newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

స్టూడెంట్ వీసాలు, ట్రేడ్ డీల్‌పై ట్రంప్ షాక్

19-02-202019-02-2020 16:51:06 IST
Updated On 19-02-2020 17:21:13 ISTUpdated On 19-02-20202020-02-19T11:21:06.840Z19-02-2020 2020-02-19T11:21:03.820Z - 2020-02-19T11:51:13.801Z - 19-02-2020

స్టూడెంట్ వీసాలు, ట్రేడ్ డీల్‌పై ట్రంప్ షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వచ్చే వారంలో భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే రోజు భారత్‌ ప్రయోజనాలకు సంబంధించి రెండు షాక్‌లు ఇచ్చారు. ఒకటి అమెరికాలో చదువుకునే విద్యార్థుల వీసాలకు ఇకపై నిర్దిష్ట కాల వ్యవధిని నిర్ణయించనున్నారు. దీంతో విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక వెంటనే పెట్టే బేడా సర్దుకుని అమెరికానుంచి వచ్చేయాల్సి ఉంటుంది. 

రెండో షాక్ ఏమిటంటే తన భారత్ పర్యటనలో కీలకమైన వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిద్ధంగా లేనని ప్రకటించడం. భారత్‌తో తాము వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని, అయితే ఈ మెగా డీల్‌కు మరికొంత కాలం వేచిచూస్తామని ట్రంప్‌ స్పష్టం చేయడంతో అత్యాధునికి యుద్ధ సాంకేతిక సామగ్రి డీల్‌పై భారత్ పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయినట్లే..

వివరాల్లోకి వెళితే.. భారత విద్యార్థులతో సహా అమెరికాలో చదవాలనుకుంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం షాక్‌ ఇవ్వనుంది. ఇకపై విద్వార్థి వీసాలకు అమెరికన్ ప్రభుత్వం నిర్దిష్ట కాల వ్యవధిని నిర్ణయించనుంది. ఇప్పటిదాకా విద్యార్థుల డిగ్రీ పూర్తయ్యేదాకా వీసా అమలులో ఉండేది. తాము చదువుతున్న డిగ్రీ పూర్తయ్యాక అనుబంధ డిగ్రీ పట్టా సాధించుకునేందుకు పొడిగింపు కూడా ఇచ్చేవారు. 

అయితే అమెరికాలో ఇకపై అలా కుదరదు. వీసా ప్రారంభ తేదీ-ముగింపు తేదీ అని దరఖాస్తులో స్పష్టంగా పేర్కొంటారు. ఆ ముగింపు తేదీలోగా విద్యార్ధులు పెట్టే బేడా సర్దుకుని వచ్చేయాలి. అమెరికాలో చదువుతున్న చాలా మంది విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకున్నాక కూడా వేరే వీసాలకు మారకుండా అదే వీసాలపై కొనసాగుతుండడంతో ఈ కొత్త రూల్‌ తెచ్చారు. అయితే దీన్ని ఇమిగ్రేషన్‌ ఏజెన్సీలు తప్పుబడుతున్నాయి. 

ఏ కారణం వల్ల అయినా విద్యార్థులు తమ డిగ్రీ పూర్తి చేయకపోతే కొత్త వీసా నిబందనల ప్రకారం గడువు తీరినవెంటనే వారు అమెరికా నుంచి వచ్చేయాల్సి ఉంటుంది. ఇది భారత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. విద్యార్థి వీసాల్లో ముగింపు తేదీని ముందే పేర్కొనాల్సి రావడంతో తమ చదువు పూర్తయినా కాకున్నా ఆ తేదీలోపు అమెరికానుంచి మన విద్యార్థులు బయటపడాల్సి ఉంటుంది.

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇప్పుడే కాదన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సందర్భంగా భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని ఆశతో ఉన్న భారత ప్రభుత్వానికి నిరాశ కలిగించే ప్రకటనను ట్రంప్ వెలువరించారు. ఆ ప్రకటనను చూస్తే డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చోటుచేసుకునే అవకాశం లేదు. భారత్‌తో ట్రేడ్‌ డీల్‌పై ట్రంప్‌ విస్పష్ట సంకేతాలు పంపారు. భారత్‌తో భారీ డీల్‌ను తాను దాచుకుంటానని, నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లోగా ఈ ఒప్పందం ఖరారవుతుందనే విషయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. 

భారత్‌తో తాము వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని, అయితే ఈ మెగా డీల్‌కు మరికొంత కాలం వేచిచూస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. భారత్‌తో భారీ ఒప్పందం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ట్రేడ్‌ డీల్‌ ప్రకటన వెలువడే అవకాశం లేనట్టే. 

మరోవైపు భారత్‌తో వాణిజ్య ఒప్పందం చర్చల్లో కీలక పాత్ర పోషించిన అమెరికా ట్రేడ్‌ ప్రతినిధి రాబర్ట్‌ లిజర్‌ ట్రంప్‌తో పాటు భారత పర్యటనకు వచ్చే బృందంలో లేకపోవడం గమనార్హం. మరోవైపు ఈ పర్యటనలో ట్రేడ్‌ డీల్‌ జరిగే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేమని కూడా వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   19 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle