newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్కూల్స్ దగ్గర జంక్ ఫుడ్ అమ్మకాలు, ప్రచారంపై నిషేధం

02-09-202002-09-2020 10:23:17 IST
Updated On 02-09-2020 10:57:40 ISTUpdated On 02-09-20202020-09-02T04:53:17.337Z02-09-2020 2020-09-02T04:53:06.411Z - 2020-09-02T05:27:40.761Z - 02-09-2020

స్కూల్స్ దగ్గర జంక్ ఫుడ్ అమ్మకాలు, ప్రచారంపై నిషేధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా పరిస్థితులు ఇంకా కొలిక్కిరాలేదు. ఎవరూ బయటకు వెళ్లడానికి సాహసించడం లేదు. అన్ లాక్ 4 మార్గదర్శకాలు విడుదలైనా పాఠశాలలు, కాలేజీలపై నిషేధం కొనసాగుతూనే వుంది. మ‌న‌దేశంలో క‌రోనా వైర‌స్ ప్రభావం ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాలు త‌ప్ప మిగిలిన రాష్ట్రాల్లో అన్ లాక్ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి.

అయితే ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రావ‌డంతో వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే వ‌ర‌కు సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానాన్ని అల‌వాటు చేసుకోవాల్సిన అవసరం వుంది. 

ఇదిలా వుంటే పాఠశాలలు, విద్యా సంస్థల పరిసరాల్లో అనారోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేకుండా చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించింది. విద్యార్థినీ, విద్యార్థులకు సురక్షితమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. పాఠశాలలకు 50 మీటర్ల పరిథిలో జంక్ ఫుడ్ అమ్మకాలు, ప్రచారంపై నిషేధం విధించింది. పిల్లల్ని వీటికి దూరంగా వుంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారుల సమాచారం ప్రకారం పాఠశాలల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులకు సురక్షితమైన, సమతుల్యతగల ఆహారాన్ని అందజేయడమే తమ లక్ష్యమని చెప్పారు. పాఠశాలలకు 50 మీటర్ల పరిథిలో, హాస్టల్ వంట గదులు, మెస్‌లు, క్యాంటీన్లలో కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగాగల వస్తువులను అమ్మకూడదని చెప్పారు.

పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్ అమ్మకాలను నియంత్రించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని 2015లో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్రం నిర్దేశించిన నియమాలు పాటిస్తే పిల్లల్లో స్థూలకాయం ఇబ్బందుల నుంచి విముక్తి కలగవచ్చు. 

 

 

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   9 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   15 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   a day ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle