newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

సౌరవిద్యుత్ ఉత్పత్తిలో టాప్ 5లో భారత్.. ప్రధాని

11-07-202011-07-2020 16:12:03 IST
Updated On 11-07-2020 17:19:57 ISTUpdated On 11-07-20202020-07-11T10:42:03.045Z11-07-2020 2020-07-11T10:42:00.329Z - 2020-07-11T11:49:57.240Z - 11-07-2020

సౌరవిద్యుత్ ఉత్పత్తిలో టాప్ 5లో భారత్.. ప్రధాని
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విద్యుత్ రంగంలో స్వావలంబనకు సౌరశక్తితోనే నాంది పలుకవచ్చని భారత ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో 750 మెగావాట్ల భారీ సౌరవిద్యుత్తు ప్లాంట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంలో స్వావలంబనకు సౌరశక్తి ఎంతో తోడ్పడుతుందన్నారు. సౌరశక్తి స్వచ్ఛమైంది మాత్రమే కాకుండా.. కచ్చితంగా అందుబాటులో ఉండేదని, సురక్షితమైంది కూడా అని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత భారీ సౌరవిద్యుత్ ప్లాంట్‌లలో ఒకదాన్ని భారత్‌లో నెలకొల్పిన తొలి కంపెనీగా రేవా రికార్డు స్థాపించడాన్ని ప్రధాని ప్రస్తుతించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ విద్యుదుత్పత్తిలోనూ స్వావలంబన సాధించడం కీలకమైన విషయమని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తెలిపారు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద వనరుగా సౌరశక్తి అవతరించనుందని తెలిపారు. సౌర విద్యుత్తు విషయంలో భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రమైన రేవా అల్ట్రా మెగా సోలార్‌ ప్రాజెక్ట్‌ మధ్యప్రదేశ్‌తోపాటు ఢిల్లీ మెట్రో రైల్వేకూ విద్యుత్తు అందిస్తుందని అన్నారు. 

ప్రపంచమిప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలా లేక ఆర్థిక వ్యవస్థనా అన్న ద్వైదీభావంలో కొట్టుమిట్టాడుతోందని, అయితే స్వచ్ఛభారత్, ఉజ్వల, సీఎన్‌జీ, విద్యుత్‌ ఆధారిత రవాణా వ్యవస్థల ద్వారా భారత్‌ ఈ రెండూ పరస్పర ప్రయోజనకరమని చాటిందని అన్నారు. ప్రపంచం మొత్తమ్మీద అందుబాటులో ఉండే, పర్యావరణాన్ని కలుషితం చేయకపోగా మెరుగుపడేందుకు సాయపడే, ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడే సూర్యుడు స్వావలంబనకూ కీలకమని అన్నారు. 

ఇందుకోసం దేశం సోలార్‌ ప్యానెళ్లతోపాటు బ్యాటరీలు, ఇతర పరికరాలను సొంతంగా ఉత్పత్తి చేయాలని, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరారు. మధ్యప్రదేశ్‌లోని రేవా నర్మదా నది, తెల్లపులి కోసం చాలా ప్రసిద్ధి చెందిందని, ఇకపై ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రంగానూ ఖ్యాతి గడిస్తుందని అన్నారు. 

ఈ భారీ సౌర విద్యుత్ ప్లాంట్ వల్ల ప్రతి సంవత్సరమూ 15 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్ది మొత్తం మీద అతిప్రధానమైన విద్యుత్ మీడియంగా సౌర విద్యుత్ త్వరలో అవతరించనుందని చెప్పారు. ఈరోజు రేవా చరిత్ర సృష్టించింది. తల్లి నర్మద, తెల్లపులి పేరుతో రేవా ప్రసిద్ధి కెక్కింది. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ ప్రాజెక్టు కూడా రేవా కీర్తికిరీటంలో ఒకభాగమైందని ప్రధాని కొనియాడారు.

రేవాలో నెలకొల్పిన సౌర విద్యుత్ ప్లాంట్ వల్ల ఈ దశాబ్దంలోనే ఈ మొత్తం ప్రాంతం అతి పెద్ద విద్యుత్ కేంద్రంగా మారిపోతుందని, ఈ సందర్భంగా రేవా ప్రజలకు, మధ్యప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నానని ప్రధాని పేర్కొన్నారు.

రేవా తరహాలోనే భారీ సోలార్‌ ప్లాంట్లను షాజాపూర్, నీమచ్, ఛత్తర్‌పూర్‌లలోనూ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, ఓంకారేశ్వర్‌ సమీపంలో తేలియాడే సోలార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.  మధ్యప్రదేశ్‌ ఊర్జా వికాస్‌ నిగమ్, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆప్‌ ఇండియా సంయుక్తంగా 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ భారీ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి.

 

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   6 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   14 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   15 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle