newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

సోషల్ మీడియాతో ఆ కుర్రాడు.. ఓవర్ నైట్ స్టార్

28-07-202028-07-2020 10:42:07 IST
Updated On 28-07-2020 12:49:21 ISTUpdated On 28-07-20202020-07-28T05:12:07.870Z28-07-2020 2020-07-28T05:11:26.650Z - 2020-07-28T07:19:21.341Z - 28-07-2020

సోషల్ మీడియాతో ఆ కుర్రాడు.. ఓవర్ నైట్ స్టార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్ మీడియా సామాన్యుడిని హీరోను చేస్తుంది. ప్రముఖుడిని అభాసుపాలు చేసేంత శక్తి ఉంది. దానికి ఉదాహరణే మధ్యప్రదేశ్లో జరుగుతున్న పరిణామం. కోడిగుడ్డు పగిలిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారి ఓ బాలుడు ఓవర్ నైట్ స్టార్ గా మారడంతో ఒక్కసారిగా అతడి జీవితమే మారిపోయింది. 

ఇండోర్ లో కుటుంబంతో కలిసి 13 ఏళ్ల బాలుడు పరాస్ నివసిస్తూ ఉన్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు తోచిన పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో తోపుడు బండి మీద కోడిగుడ్లు విక్రయించడం మొదలు పెట్టాడు. సుమారు రూ.7 వేలు విలువైన కోడిగుడ్లు ఉన్న ట్రేను తోపుడు బండి మీద పెట్టుకొని రోడ్డు మీద వెళుతూ రోడ్డు పక్కన ఆగాడు. బండి పక్కకు నిలిపి మూత్రం పోయడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడకు ఇండోర్ మున్సిపల్ కార్మికులు వచ్చి ఆ బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బండి నిలపడంతో రూ.వంద జరిమానా విధించారు. 

ఏమైందో ఏమోగానీ ఒక్కసారిగా కోపంతో గుడ్ల బండిని బోల్తా వేశారు. దీంతో కోడిగుడ్లన్నీ పగిలిపోయాయి. దీంతో బాలుడు పరాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. రూ.7 వేల విలువైన కోడిగుడ్లు పగలడంతో రోదిస్తూ కూర్చున్నాడు. ఈ ఘటనను అక్కడి స్థానికులు ఫోన్లలో రికార్డు చేశారు.

అక్కడి స్థానికులు మున్సిపల్ కార్మికుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మున్సిపల్ సిబ్బంది కారణంగా నష్టపోయిన పిల్లాడిపై అందరూ జాలి పడ్డారు. దీంతో బాలుడిని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. 

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆ పిల్లాడికి రూ.10 వేలు సహాయం చేశారు. దీంతోపాటు ఆ పిల్లాడి చదువు ఖర్చు మొత్తం భరిస్తానని ప్రకటించారు. దీంతో దీన్ని పౌరుషంగా తీసుకుని ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే స్పందించి ఏకంగా ఆ బాలుడికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒక ఇంటిని ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. 

అతడి చదువు ఖర్చు భరిస్తానని చెప్పడంతో పాటు రూ.2500 నగదు.. దుస్తులు.. ఒక సైకిల్ ను పంపారు. మరికొందరు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. బాలుడి ఇంటికి వచ్చి పరామర్శించి వారికి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ విధంగా ఆ బాలుడి జీవితం ఒక్కసారిగా మారింది.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle