newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

సోషల్ మీడియాకు వీడ్కోలు ఆ ఒక్కరోజే: మోదీ వివరణ

04-03-202004-03-2020 10:06:21 IST
Updated On 04-03-2020 11:44:22 ISTUpdated On 04-03-20202020-03-04T04:36:21.456Z04-03-2020 2020-03-04T04:36:19.627Z - 2020-03-04T06:14:22.833Z - 04-03-2020

సోషల్ మీడియాకు వీడ్కోలు ఆ ఒక్కరోజే: మోదీ వివరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్టు ట్వీట్‌ చేసి దేశవ్యాప్త చర్చకు తెరలేపిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాల ఊహాగానాలకు తెరదించారు. తన సోషల్‌ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను అందరిలోనూ స్ఫూర్తిని నింపే మహిళలకి ఆదివారం అంకితం ఇస్తున్నట్టుగా మంగళవారం మరో ట్వీట్‌ ద్వారా స్పష్టం చేశారు. 

‘మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నా సోషల్‌ మీడియా ఖాతాలను ఏ మహిళల జీవితాలైతే అందరిలోనూ స్ఫూర్తిని నింపుతాయో, వారు చేసే పనులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయో వారికి అంకితం ఇస్తున్నాను. అలాంటి మహిళల నిజ జీవిత గాథలు లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తాయి’ అని ట్వీట్‌ చేశారు. 

స్ఫూర్తినిచ్చే మహిళల జీవితాలైనా, అలాంటి మహిళల గురించి తెలిసినవారైనా ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వారి జీవిత కథల్ని షేర్‌ చేసే అవకాశం ఇది. దీంతో వారి పోస్టులు క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రధాని ఫాలోవర్లకు చేరిపోతాయ్‌. మహిళలకు నిజంగానే ఒక సూపర్‌ ఛాన్స్‌ వచ్చింది. వారి ఆలోచనల్ని ప్రపంచానికి పంచుకునే అరుదైన అవకాశం ఇది. 

‘మీరు అలాంటి మహిళ అయినా, లేదంటే అలాంటి స్ఫూర్తిని రగిల్చే మహిళల గురించి మీకు తెలిసినా వారి జీవిత గాథల్ని #SheInspiresUs అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేయండి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా వచ్చిన పోస్టుల్లో ఎంపిక చేసిన కొన్నింటికి ప్రధాని అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసే అవకాశం లభిస్తుంది. ఇక యూట్యూబ్‌లో మోదీ అకౌంట్‌ ద్వారా వీడియోలు పోస్టు చేసే అవకాశం వస్తుంది. 

వచ్చే ఆదివారం సోషల్‌ మీడియా నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్టుగా ప్రధాని ట్వీట్‌ వెలువడగానే రకరకాల వదంతులు చెలరేగాయి. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడానికి మోదీ ట్వీట్‌ సంకేతమా అని సందేహం వ్యక్తం చేశారు. 

మరోవైపు స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడానికే మోదీ ఈ ట్వీట్‌ చేసి ఉంటారని ఆరెస్సెస్‌ నేతలు ఆశగా ఎదురు చూశారు. చాలా కాలంగా మన దేశంలో తయారైన యాప్‌లే వాడాలని డిమాండ్‌ చేస్తున్నట్టు స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జాతీయ కో కన్వీనర్‌ అశ్వని మహాజన్‌ తెలిపారు. 

అయితే మోదీ అభిమానులు ఆయన సోషల్‌ మీడియా నుంచి వెళ్లిపోతే తామూ బయటకు వచ్చేస్తామంటూ లక్షలాది మంది ట్వీట్‌ చేశారు. ఐ విల్‌ ఆల్సో లీవ్‌ హ్యాష్‌ట్యాగ్‌ భారీగా ట్రెండ్‌ అయింది. మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా విదూషకుడి పాత్ర పోషిస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ‘ప్రియమైన ప్రధాని గారూ, మీ సోషల్‌ మీడియా అకౌంట్లలో ఒక జోకర్‌లా హాస్యాన్ని పండిస్తూ సమయాన్ని వృథా చేసే బదులు కరోనా సవాళ్లను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టండి’ అని రాహుల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. 

వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో సింగపూర్‌ ప్రధాని తమ పౌరులను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగాన్ని రాహుల్‌ పోస్టు చేస్తూ, ఏదైనా ఇలా చేయాలంటూ ప్రధానికి హితవు పలికారు. నిజమైన నాయకుడంటే సంక్షోభ పరిస్థితుల నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావాలని అన్నారు.

‘ప్రతీ దేశానికి ఆ నాయకుల శక్తి సామర్థ్యాలను పరీక్షించే సమయం వస్తుంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలోనే నాయకుల సమర్థత బయటకి వస్తుంది’ అని రాహుల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలం నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ విషయంపై ఏమాత్రం ఆలోచించని మీడియా ఇక సోషల్ మీడియాకు సెలవు అని మోదీ ట్వీట్ చేయగానే దాని నేపథ్యాన్ని ఊహించలేక రకరకాల ఊహాగానాలకు దారితీసింది.

చివరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, శశిధరూర్ వంటి సీనియర్ నేతలు సైతం మోదీ ట్వీట్ బుట్టలో పడి ఏవేవో వ్యాఖ్యానాలు చేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle