newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

సోన్‌భద్రలో 3 వేల టన్నుల బంగారం నిల్వలు.. దేశ రిజర్వుల కంటే 5 రెట్లు

23-02-202023-02-2020 09:31:31 IST
2020-02-23T04:01:31.494Z23-02-2020 2020-02-23T04:01:25.119Z - - 05-08-2020

సోన్‌భద్రలో 3 వేల టన్నుల బంగారం నిల్వలు.. దేశ రిజర్వుల కంటే 5 రెట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్తర ప్రదేశ్ పంట పండింది. కాదు కాదు.. భారత్ పంట పండింది. భారతదేశ మొత్తం బంగారు రిజర్వుల కంటే నాలుగు రెట్లు అధికంగా యూపీలోని సోన్ భద్ర జిల్లాలో 3 వేల టన్నుల ముడి బంగారం నిల్వలు బయటపడ్డాయి. జియాలజీ, మైనింగ్ విభాకం శుక్రవారం చేసిన ప్రకటన ప్రకారం ఈ బంగారం నిల్వల విలువ ప్రస్తుత మార్కెట్ల రేట్ల బట్టి చూస్తే 12 లక్షల కోట్ల రూపాయలు. గత 20 సంవత్సరాలక్రితమే సోన్ భద్ర ప్రాంతంలో బంగారం నిక్షేపాలను గుర్తించే కార్యక్రమం చేపడితే ఇన్నాళ్లకు బంగారు నిల్వలు బయటపడ్డాయని మైనింగ్ శాఖ ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్‌లోని సోన్ భద్ర జిల్లా దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో బంగారం నిల్వలను గుర్తించిన పర్వతం మొత్తం 108 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాన్ని వేలం వేసేందుకు ఈ– టెండర్లను కూడా ఆహ్వానించారు. 2005లోనే ఇక్కడ ఖనిజ నిక్షేపాలను గుర్తించే కార్యక్రమం ప్రారంభించామని సోన్‌భద్ర జిల్లా మైనింగ్‌ ఆఫీసర్‌ కేకే రాయ్‌ తెలిపారు. బంగారం గనికి సంబంధించిన నివేదిక ఈ రోజే అందిందన్నారు. ఈ ప్రాంతం లో యురేనియం సహా విలువైన ఖనిజ నిక్షేపాలు కూడా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.  

ఈ వివరాలకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వడానికి మా అధికారులు, శాస్త్రజ్ఞులతో కూడిన బృందం ఒకటి ప్రస్తుతం సోన్ భద్ర జిల్లాలో ఉందని యూపీ జియాలజీ, మైనింగ్ జాయింట్ డైరెక్టర్ జై ప్రకాష్ మీడియాకు తెలిపారు. బంగారు నిల్వలకు చెందిన పూర్తి సమాచారం వచ్చే సోమవారం అందుబాటులోకి వస్తుందన్నారు. అయితే బంగారాన్ని గనుల్లోంచి వెలికి తీయాలంటే అనేక లాంఛనాలను పూర్తి చేయవలసి ఉందన్నారు. అటవీ, పర్యావరణ శాఖలతో సహా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు ఆమోదం తెలపాల్సి ఉందని జై ప్రకాష్ పేర్కొన్నారు. 

Image result for 2,900-tonne gold mine found in Sonbhadra, 4 times that of India's reserves

భారత్‌లో ఇంతవరకు రిజర్వ్ బ్యాంకు వద్ద పోగుపడిన బంగారం 700 టన్నులు మాత్రమే. కానీ సోన్ భద్రలో ఉన్నట్లు భావిస్తున్న ముడి బంగారం ఆర్బీఐ వద్ద ఉన్న నిల్వ కంటే దాదాపు అయిదురెట్లు అధికం అని తెలుస్తోంది. గతంలో యూపీలో సర్వే చేసినప్పుడు వింధ్య, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో భారీ ఎత్తున బంగారు, వజ్రాలు, ఇతర విలువైన లోహాలు ఉన్నట్లు బయటపడిందని జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ సోమ్ నాథ్ చండేల్ పేర్కొన్నారు. 

మా భౌగోళిక అధ్యయనాల ప్రకారం సోన్ భద్ర జిల్లాలో ముడి బంగారు నిల్వలు పెద్దఎత్తున ఉన్నాయని, బుందేల్‌ఖండ్ రీజియన్‌లో భారీ ఎత్తున రాగి నిల్వలు ఉన్నట్లు కూడా తెలిసిందని, కానీ వీటికి సంబంధించి మరింత లోతైన శాస్త్రీయ విశ్లేషణలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బ్రిటిష్ పాలకుల హయాంలో ఉత్తరప్రదేశ్‌లో విలువైన లోహాలు, ఖనిజాల కోసం మ్యాప్ చేసినా గత 150 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సర్వే జరగలేదని, ప్రాధమిక అంచనా ప్రాకారమే ఇంత భారీ స్థాయిలో బంగారు, రాగి నిల్వలు ఉన్నట్లు బయటపడటం విశేషమని తెలిపారు. యూపీలో వజ్రాల గనులు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

గతంలో ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్ యూపీలోని  సబ్ హిమాలయన్ ప్రాంతంలో చమురు, సహజవాయు నిక్షేపాలను వెతకాలని ప్రయత్నించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్సులు కూడా తీసుకున్నాయి. చమురు నిక్షేపాల మాటేమిటోకాని బంగారు, రాగి, వజ్రాలు, ప్లాటినం నిక్షేపాల నిల్వలకు ఉత్తరప్రదేశ్ మారుపేరుగా నిలుస్తోంది.

యూపీలో ఒక వంద ఎకరాల భూభాగంలో 12 లక్షల కోట్ల విలువైన బంగారు నిక్షేపాలున్నట్లు బయటపడటం దేశ సౌభాగ్యానికి, సంపదకు వన్నె తీసుకువస్తుందనడంలో సందేహమే లేదు.

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle