newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

సోనియా ఫ్యామిలీకి భద్రత కుదింపుపై రచ్చ

19-11-201919-11-2019 17:30:37 IST
2019-11-19T12:00:37.719Z19-11-2019 2019-11-19T12:00:31.740Z - - 12-08-2020

సోనియా ఫ్యామిలీకి భద్రత కుదింపుపై రచ్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోనియాగాంధీ కుటుంబానికి కీలకమయిన ఎస్పీజీ భద్రత కుదింపుపై పార్లమెంటులో రచ్చ రేగింది. ఈ అంశంపై లోకసభలో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ పక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోకసభలో కాంగ్రెస్ విపక్ష నేత అధిర్ రంజన్ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను ఎందుకు ఎత్తివేశారని తీవ్రంగా ప్రశ్నించారు. 

గతంలో ఎన్డీయే ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఎస్పీజీ భద్రత తొలగించలేదని, ఇపుడు ఎందుకు తొలగించాల్సిన అవసరం వచ్చిందో సభకు తెలపాలని కాంగ్రెస్ నేత  ప్రశ్నించారు. ఎస్పీజీ భద్రత తొలగింపుపై ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాగా ప్రభుత్వం స్పందించక పోవటంతో సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి ఆందోళన చేశారు. దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో ఇరవై మంది కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయారు. ఆ తరువాత వాకౌట్ చేశారు. సోనియా, రాహుల్‌ గాంధీలకు సాధారణ భద్రత స్థాయి వ్యక్తులు కాదని.. వారికి ఎస్పీజీ భద్రత ఎత్తివేతపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

28 ఏళ్లుగా సాగుతున్న ఎస్పీజీ భద్రతను పదిరోజుల క్రితం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ప్రియాంకగాంధీలకు ఇక నుంచి జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంటుంది.

ఎస్‌పీజీ భద్రత కింద ఉండే హైటెక్‌ వాహనాలు, జామర్లు, అంబులెన్సు.. మొదలైనవి జడ్‌ ప్లస్‌లో ఉండవు. వారి భద్రత బాధ్యతను సీఆర్‌పీఎఫ్‌ స్వీకరిస్తుంది. ఒక్కొక్కరికీ వంద మందితో భద్రత కల్పిస్తారు. ఎస్పీజీ భద్రత ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. చట్ట ప్రకారం ప్రధాని తల్లి హీరాబెన్‌, భార్య యశోదా బెన్‌లకు కూడా ఎస్పీజీ భద్రత కల్పించాల్సి ఉన్నప్పటికీ వారికి గుజరాత్‌ పోలీసుల భద్రత ఇస్తున్నారు.

భవిష్యత్తులో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకూ ఎస్‌పీజీ రక్షణ లభించే అవకాశాలున్నాయని, ఈ మేరకు త్వరలో చట్ట సవరణ చేయనున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1985లో ఎస్‌పీజీని నెలకొల్పిన సంగతి తెలిసిందే. 1991లో రాజీవ్‌ హత్యానంతరం ఎస్‌పీజీ చట్టాన్ని సవరించి- సోనియా, రాహుల్‌, ప్రియాంకలకు, మరికొందరు వీవీఐపీలకు కూడా రక్షణ కల్పించారు.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   11 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle