newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట-35 మంది దుర్మరణం

07-01-202007-01-2020 18:11:51 IST
Updated On 07-01-2020 18:11:49 ISTUpdated On 07-01-20202020-01-07T12:41:51.590Z07-01-2020 2020-01-07T12:41:14.459Z - 2020-01-07T12:41:49.604Z - 07-01-2020

సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట-35 మంది దుర్మరణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం కెర్మన్ అశ్రునయనాల మధ్య జరిగాయి. ఈ అయితే ఈ అంత్యక్రియల సందర్భంగా తొక్కిసలాట జరిగినట్టు ఇరాన్ ఛానెళ్లు తెలిపాయి. ఈ తొక్కిసలాట కారణంగా 35 మందికి మరణించారు. 50 మంది వరకూ గాయపడినట్టు ఇరాన్‌ ప్రభుత్వ చానల్‌ తెలిపింది. 

Image result for irani general sulemani died

సులేమానీ స్వస్థలం కెర్మన్‌లో అంత్యక్రియలకు లక్షలాదిమంది తరలి వచ్చారు. దీంతో అక్కడ శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. దీంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. అంతిమయాత్రలో పాల్గొన్నవారు రోడ్లపై ఇరుక్కుపోయారు. వీరిలో కొందరు తమను కాపాడాలని కోరారు.

కొందరు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. సులేమానీ అంతిమయాత్రలో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ సహా సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ పాల్గొన్న అమెరికాపై ప్రతీకారం తప్సదన్నారు.  లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇరానీయులు ట్రంప్ తలకు వెల కట్టింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చంపినవారికి రూ. 575 కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఇరాన్ జనాభా 8 కోట్లని… ట్రంప్ ను హతమార్చిన వారికి ప్రతి ఇరాన్ పౌరుడు తన వాటాగా ఒక డాలరును ఇస్తాడని ఇరాన్ తెలిపింది. సులేమానీ అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో ఆ దేశ అధికార వార్తా సంస్థ ఈ ప్రకటనను ప్రసారం చేసింది. మరోవైపు తమ దేశం నుంచి అమెరికా బలగాలు వెంటనే వెళ్లిపోవాలని ఇరక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఇరాక్ లో సైనిక స్థావరాల కోసం ఎంతో ఖర్చు చేశామన్నారు. అదంతా చెల్లిస్తే బలగాలు ఉపసంహరిస్తామన్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle