newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

‘సుప్రీం’లో ఎల్జీ పాలిమర్స్‌కు ఎదురుదెబ్బ

19-05-202019-05-2020 17:30:55 IST
Updated On 19-05-2020 17:39:45 ISTUpdated On 19-05-20202020-05-19T12:00:55.741Z19-05-2020 2020-05-19T12:00:39.696Z - 2020-05-19T12:09:45.028Z - 19-05-2020

‘సుప్రీం’లో ఎల్జీ పాలిమర్స్‌కు ఎదురుదెబ్బ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో జరిగిన విషవాయువు స్టైరీన్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమేరేపింది. దీనిపై కోర్టుల్లో కేసులు కూడా దాఖలయ్యాయి. ఎన్జీటీ ట్యిబ్యునల్ కూడా కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు చుక్కెదురైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది అత్యున్నత న్యాయస్థానం.

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విచారణ జూన్ 8కి వాయిదా పడింది. ఎన్జీటీలో విచారణ తరువాతే సుప్రీం కోర్టులో విచారణ ఉంటుందని తెలిపింది ధర్మాసనం. ఎన్జీటీలో న్యాయపరమైన అంశాలు లేవనెత్తేందుకు అవకాశం వుందన్నారు. సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదన్న ఎల్జీ పాలిమర్స్ వాదనలను త్రోసిపుచ్చింది. ఆ విషయాలు అన్నీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట ప్రస్తావించాలని తెలిపింది ధర్మాసనం.

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ దాఖలు.విషవాయువు లీకేజీ ఘటనలో రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయాలన్న తీర్పుపై ఈ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చారంటూ సుప్రీంకోర్టు లో సవాలు చేసింది ఎల్జీ పాలిమర్స్ కంపెనీ. 

మరోవైపు ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదానికి కారణమైన స్టైరిన్‌ రసాయనం పూర్తిగా విశాఖ నుంచి తరలించారు. ఐదు రోజుల క్రితం స్టైరిన్‌ రసాయనం నిండిన నౌక దక్షిణ కొరియాకు బయలుదేరింది. ఇంకా మిగిలిన స్టైరిన్‌తో కూడిన మరో నౌక సోమవారం ఉదయం 6:45 నిమిషాలకు విశాఖ రేవు నుంచి తరలివెళ్లిందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. దీంతో పోర్టు, కంపెనీలో ఉన్న  మొత్తం స్టైరిన్‌ పూర్తిగా దక్షిణకొరియాకు పంపించామన్నారు. 

కాగా పాలిమర్స్‌లో గ్యాస్‌లీక్‌ ప్రమాదంపై రాష్ట్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ బుధవారం నగరానికి రానున్నది.  రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నేతృత్వంలో ఆరుగురు సీనియర్‌ అధికారుల బృందం తొలుత కర్మాగారం, తరువాత బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడతారు. ప్రమాదం సంభవించిన వెంటనే ఒకసారి వచ్చిన కమిటీ కొంతమేర వివరాలు సేకరించింది. గ్యాస్‌లీక్‌ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం నియమించిన కమిటీ, ఇతర అధ్యయన కమిటీలు తమ నివేదికలను ఉన్నతస్థాయి కమిటీకి అందజేయాల్సి ఉంది. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   19 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle