newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సుప్రీంకోర్టులో కరోనా అలజడి..క్వారంటైన్లోకి రిజిస్ట్రార్లు

28-04-202028-04-2020 10:08:07 IST
Updated On 28-04-2020 10:40:46 ISTUpdated On 28-04-20202020-04-28T04:38:07.749Z28-04-2020 2020-04-28T04:37:46.313Z - 2020-04-28T05:10:46.413Z - 28-04-2020

సుప్రీంకోర్టులో కరోనా అలజడి..క్వారంటైన్లోకి రిజిస్ట్రార్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా 23వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా886 మరణాలు సంభవించాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 1463 కొత్త కేసులు నమోదయ్యాయి ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కాగా.. సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉన్నసుప్రీం కోర్టు ఇద్దరు రిజిస్ట్రార్లు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కరోనా సోకిన ఉద్యోగి గత వారం రెండుసార్లు కోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరిని కలిసారనే దానిపై సిబ్బంది విచారణ జరుపుతున్నారు. 

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేసుల ఉధృతి పెరుగుతూనే వుంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉండగా, గుజరాత్‌, ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 62 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 1543 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,435కు చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్‌తో 934 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,868 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

మహారాష్ట్రలో 369 మంది, గుజరాత్‌లో 162, మధ్యప్రదేశ్‌లో 110, ఢిల్లీలో 54, రాజస్థాన్‌లో 50, తమిళనాడులో 24, ఏపీలో 31, తెలంగాణలో 25, పశ్చిమ బెంగాల్‌లో 20, కర్ణాటకలో 20, పంజాబ్‌లో 19 మంది కరోనాతో చనిపోయారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. లాక్ డౌన్ విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల‌కు క‌రోనా సోకింది.

కాన్పూర్ సిటీలోని  మొర‌దాబాద్ లో 20 మంది పోలీసుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిందని అధికారులు తెలిపారు. బిజ్నోర్‌, వార‌ణాసి, ఆగ్రా, మొర‌దాబాద్ లో ప‌నిచేస్తున్న 20 మందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో..వారిని ఆయా ప్రాంతాల్లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించాం. పోలీసులకు ఐసోలేష‌న్ వార్డులో చికిత్సనందిస్తున్నాం. స‌ద‌రు పోలీసులతో స‌న్నిహితంగా ఉన్న వారి వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

మరోవైపు తమిళనాడు-ఆంధ్రా సరిహద్దుల్లో రోడ్లపై గోడలు కట్టిన వైనం వివాదాస్పదం అయింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు-గుడియాత్తం సరిహద్దులో గోడలు కట్టగా చిత్తూరు కలెక్టర్ సూచనల మేరకు తమిళనాడు అధికారులు వాటిని తొలగించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అడ్డుగోడల వల్ల రైతులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారని తమిళనాడు అధికారులకు విన్నవించారు. దీంతో మూడు ప్రాంతాల్లోని గోడలను అధికారులు నేలమట్టం చేశారు. 

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   3 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   3 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   20 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   21 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   19 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle