newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

సుఖోయ్‌ యుద్ద విమానాల కొనుగోలుకు ఆమోదం.. చైనాకు సవాల్

03-07-202003-07-2020 06:53:40 IST
Updated On 03-07-2020 12:35:13 ISTUpdated On 03-07-20202020-07-03T01:23:40.464Z03-07-2020 2020-07-03T01:23:37.181Z - 2020-07-03T07:05:13.320Z - 03-07-2020

సుఖోయ్‌ యుద్ద విమానాల కొనుగోలుకు ఆమోదం.. చైనాకు సవాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 21 మిగ్‌-29 యుద్ధ విమానాలతో పాటు 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకరణకు డీఏసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో పాటు 12 ఎస్‌యూ-30 ఎంకేఐల కొనుగోలుకూ పచ్చజెండా ఊపింది. రష్యా నుంచి ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలు, ఆధునీకరణకు 7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా,10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్‌ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది.

యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని చాలాకాలంగా భారత వాయుసేన (ఐఏఎఫ్‌) కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో 38,900 కోట్ల విలువైన ఆయుధసామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. వీటిలో 31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి సమీకరిస్తారు.

చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, భారత్‌ సాయుధ సంపత్తిని మరింత బలపరుచుకుంటోంది. రూ.38,900 కోట్ల విలువైన యుద్ధవిమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధా ల కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం పచ్చజెండా ఊపింది. వీటిలో రూ.31,130 కోట్ల విలువైన కొనుగోళ్లు భారత పరిశ్రమలకే కేటాయించడం గమనార్హం. స్వదేశీ సాంకేతికతతో రూపకల్పనకు రక్షణశాఖ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి 21 మిగ్‌-29 యుద్ధవిమానాలు, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) నుంచి 12 సు-30 ఎంకేఐ యుద్ధవిమానాల్ని కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఉన్న 59 మిగ్‌-29 విమానాల్ని ఆధునికీకరించేందుకు ప్రత్యేక ప్రతిపాదనను ఆమోదించింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన రక్షణ సముపార్జన మండలి (డీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు. 1000 కిలోమీటర్ల పరిధి కలిగిన దీర్ఘశ్రేణి ఉపరితల దాడి క్షిపణులు, ‘అస్త్ర’ క్షిపణుల్ని నావికాదళం, వాయుసేన కోసం రక్షణ శాఖ సమీకరిస్తోంది. ఇక.. సరిహద్దు పరిస్థితుల్లో ఏ మార్పూ రాకపోవడంతో.. ప్రత్యేక బలగాలను భారత్‌ లద్దాఖ్‌ సరిహద్దులకు తరలించింది. చైనా రెచ్చగొడితే ఏం చేయాలనేదానిపై సైనికులందరికీ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. 

రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) సాంకేతికతను దేశీయ సంస్థలకు బదిలీ చేయడం వలనే ఈ కొనుగోళ్లు సాధ్యమయ్యాయని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అస్త్ర క్షిపణులు, పీనాక ఆయుధ సామగ్రి, ఉపరితల దాడి చేయగల క్షిపణుల్ని అత్యున్నత సామర్థ్యం కలిగినవిగా డీఆర్‌డీఓ చైర్మన్‌ జి. సతీష్‌ రెడ్డి అభివర్ణించారు. 

యుద్ధవిమానాలను పెంచాలంటూ భారత వైమానిక దళం చాలాకాలంగా చేస్తున్న విజ్ఞప్తికి సమాధానమే తాజాగా డీఏసీ ఆమోదించిన యుద్ధవిమానాలు. రష్యా నుంచి మొత్తం 21 మిగ్‌-29 మిమానాలు రానున్నాయి. 1970లో సోవియట్లు అభివృద్ధిపరచిన ఈ విమాన శ్రేణి.. అప్పటి నుంచి పలుమార్లు అప్‌గ్రేడ్‌ అవుతూ వస్తోంది. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle