newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

సీబీ‘ఐ’ దూకుడు.. 110 చోట్ల మెరుపుదాడులు

10-07-201910-07-2019 09:24:32 IST
2019-07-10T03:54:32.602Z10-07-2019 2019-07-10T03:53:58.028Z - - 17-07-2019

సీబీ‘ఐ’ దూకుడు.. 110 చోట్ల మెరుపుదాడులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిందనే ఆరోపణల నుంచి సీబీఐ బయటపడుతోందా? రాజకీయనేతల్ని టార్గెట్ గా చేసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు మంగళవారం రికార్డు నెలకొల్పారు.

భారీస్థాయిలో దాడులు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. రూ.1,139 కోట్ల బ్యాంకింగ్‌ కుంభకోణానికి సంబంధించి సీబీఐ గత వారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 చోట్ల తనిఖీలు చేపట్టింది. అది మరిచిపోకముందే ఈ దాడులు చేసింది. 

ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ.250 కోట్ల స్కాలర్‌ షిప్‌ కుంభకోణానికి సంబంధించి పలు విద్యా సంస్థలపై దాడులు నిర్వహించింది సీబీఐ. యూపీలో రద్దయిన నోట్ల చెలామణీ ఆరోపణలపై నాలుగుచోట్ల సోదాలు జరిపింది.

రూర్కెలాలోని బోకారో స్టీల్‌ ప్లాంట్‌లో అవినీతి కేసులో రాంచీ, బొకారో, కోల్‌కతాలోని అధికారుల ఇళ్లపై దాడులు చేసినట్టు ప్రకటించింది. అవినీతి, నేర పూరిత ప్రవర్తన, ఆయుధాల స్మగ్లింగ్‌ తదితర నేరాలకు సంబంధించి 30 కేసులు నమోదు చేసింది.

జమ్మూకశ్మీర్‌లో ఆయుధాల లైసెన్స్‌ జారీలో అక్రమాలకు సంబంధించి 13 చోట్ల సోదాలు చేశామని సీబీఐ తెలిపింది. మంగళవారం ఉదయం ఏకకాలంలో ప్రారంభమైన ఈ సోదాల్లో 500 మంది అధికారులు పాల్గొన్నారు.

ఈ దాడులలో భారీగా నగదు, నగలతోపాటు పలు బ్యాంకు పత్రాలు, స్థిరాస్తులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పత్రాలను స్వాధీనం చేసుకుంది. తాజా దాడులతో 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle