newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

14-01-202014-01-2020 13:50:56 IST
Updated On 14-01-2020 13:54:52 ISTUpdated On 14-01-20202020-01-14T08:20:56.661Z14-01-2020 2020-01-14T08:20:54.766Z - 2020-01-14T08:24:52.435Z - 14-01-2020

సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి మించిన హాట్ టాపిక్ లేదు. ఈ చట్టంపై ఎవరికివారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే వున్నారు. ఈ చట్టం వల్ల ఎవరికీ అన్యాయం జరగదని, పౌరసత్వం రద్దు అనేది ఈ చట్టంలో ఎక్కడుందో చెప్పాలంటూ హోంమంత్రి అమిత్ షా సవాల్ విసురుతూనే వున్నారు. ఇదిలా ఉంటే.. సీఏఏ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ. పౌరసత్వ సవరణ చట్టం బాధను, విచారాన్ని కలిగిస్తోందని కామెంట్ చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో సత్య నాదెళ్ళ వ్యాఖ‍్యలు ప్రాధాన్యత పొందుతున్నాయి.

సీఏఏ తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం మంచిది కావని సత్య నాదెళ్ల అన్నారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. ప్రతి దేశం తన సరిహద్దులను నిర్ణయించుకుంటుంది. నిర్ణయించుకోవాలన్నారు. అందుకు అనుగుణంగానే జాతీయ భద్రతను కాపాడుకోవాలి, ఇమ్మిగ్రేషన్ విధానాన్ని నిర్దేశించాలి. అదే సందర్భంలో ప్రజాస్వామ్య దేశాల్లో  ప్రజలు,  ప్రభుత్వాలు చర్చించుకోవాలని తాను భావిస్తున్నానన్నారు. భారతీయుడిగా పుట్టాను, బహుళ సాంస్కృతిక వాతావరణాల్లో పెరిగాను. వలసదారునిగా అమెరికాలో ఉన్నాను. భారతీయ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు  భారీగా ప్రయోజనం చేకూర్చేలా బహుళజాతి సంస్థను నడిపించాలని ఒక వలసదారుగా తన ఆశ అంటూ న్యాయపరంగా వచ్చే వలసదారులతో  దేశ ఉన్నతికి దోహదపడుతుంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

బజ్‌ఫీడ్ ఎడిటర్-ఇన్-చీఫ్ బెన్ స్మిత్ ట్విటర్‌లో సత్య నాదెళ్ళ వ్యాఖ్యలను ఉటంకించారు. సీఏఏపై సత్య నాదెళ్ళ మాట్లాడిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్విటర్‌లో SatyaNadella, Microsoft యాష్ టాగ్స్ ట్రెండవుతున్నాయి. అంతేకాదు పలువురు ప్రముఖులు సత్య నాదెళ్ల కామెంట్లపై స్పందిస్తున్నారు. యన ప్రకటన మీద ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ''నాదెళ్ల చెప్పిన మాటలు నాకు సంతోషం కలిగించాయి. మన సొంత భారతీయ ఐటీ సంస్థల అధిపతులు ఇటువంటి ధైర్యం, మేధస్సును ప్రదర్శించివుంటే బాగుండునని నేను కోరుకుంటున్నా'' అని ట్వీట్ చేయడం విశేషం. సత్య నాదెళ్ళ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   17-01-2020


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   17-01-2020


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   17-01-2020


గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

   16-01-2020


డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

   15-01-2020


బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

   14-01-2020


ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

   14-01-2020


భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

   13-01-2020


యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

   13-01-2020


ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

   09-01-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle