newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

సీఏఏకి అనుకూలంగా ర్యాలీలు.. చట్టం చదవాలంటున్నమోడీ

23-12-201923-12-2019 08:42:07 IST
Updated On 23-12-2019 11:23:51 ISTUpdated On 23-12-20192019-12-23T03:12:07.633Z23-12-2019 2019-12-23T03:09:05.087Z - 2019-12-23T05:53:51.196Z - 23-12-2019

సీఏఏకి అనుకూలంగా ర్యాలీలు.. చట్టం చదవాలంటున్నమోడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏని వ్యతిరేకిస్తుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సీఏఏని సమర్ధిస్తూ ర్యాలీలు నిర్వహించారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సీఏఏ, ఎన్నార్సీకి అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.మరోవైపు, బీజేపీకి గట్టి పట్టున్న ఘట్కోపార్‌లో సీఏఏకి అనుకూలంగా ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు.

Image

కర్ణాటకలోని బెంగళూరులో సీఏఏకి అనుకూలంగా భారీ ర్యాలీ నిర్వహించగా .. దుండగులు ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. బీహార్‌లోని ముజఫరాపూర్‌లో సీఏఏకి అనుకూలంగా బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

సీఏఏకు మద్దతుగా మహారాష్ర్టలోని నాగపూర్‌లో బీజేపీ మద్దతు సంఘం లోక్‌ అధికార్‌ మంచ్‌ ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

సీఏఏ వల్ల దేశంలో ఎవరికీ అన్యాయం జరగదన్నారు.  సీఏఏని నాగపూర్‌ స్వాగతిస్తుంది అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించడం విశేషం. దేశద్రోహులను కాల్చిపారేయండి అంటూ పౌరసత్వ చట్టానికి అనుకూలంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నేతలు నినాదాలు చేశారు. స్థానిక యశ్వంత్‌ స్టేడియం నుంచి సంవిధాన్‌చౌక్‌ వరకూ సాగిన ఈ ర్యాలీలో పలువురు జాతీయపతాకాన్ని ఎగురవేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు.

మరోవైపు ఢిల్లీలో మోడీ ఓ సభలో ప్రసంగించారు. సీఏఏ పై అపోహలు వద్దన్నారు. ఆందోళన చేస్తున్న వారిలో ఎక్కువ మంది చొరబాటుదారులే అని ఆరోపించారు మోడీ. కాంగ్రెస్‌ హయాంలోనే ఎన్‌ఆర్‌సీ వచ్చిందని, యాజమాన్య హక్కులు కల్పించేందుకే పౌరసత్వ చట్టం తెచ్చాం.

ఎన్‌ఆర్‌సీపై కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు, పట్టణ నక్సలైట్లు అసత్యప్రసారాలు చేస్తున్నరు. ముస్లింలను డిటెన్షన్‌ సెంటర్లకు పంపిస్తారంటూ భయపెడుతున్నారని మండిపడ్డారు. పౌరసత్వ చట్టాన్ని క్షుణ్ణంగా చదివితే అపోహలు పోతాయని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

 

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   6 hours ago


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   11 hours ago


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   12 hours ago


గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

   16-01-2020


డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

   15-01-2020


బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

   14-01-2020


సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

   14-01-2020


ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

   14-01-2020


భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

   13-01-2020


యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

   13-01-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle