newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్... కరోనా అదుపు పైనే ఫోకస్

16-06-202016-06-2020 08:10:01 IST
Updated On 16-06-2020 08:21:47 ISTUpdated On 16-06-20202020-06-16T02:40:01.397Z16-06-2020 2020-06-16T02:39:50.213Z - 2020-06-16T02:51:47.778Z - 16-06-2020

సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్... కరోనా అదుపు పైనే ఫోకస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షల 42 వేలు దాటిపోయాయి. మరణాలు 10 వేలకు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే అలాంటి ఆలోచనే లేదని కేంద్రం చెబుతున్నా.. తమిళనాడు తరహాలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో నిర్బంధ లాక్ డౌన్ అమలుచేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి సమావేశం కానున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. 

మంగళ, బుధవారాల్లో ఆయన సీఎంలతో చర్చించనున్నారు.  కరోనా వ్యాప్తి తక్కువగా వున్న పలు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతారు. అందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 21 రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో మోదీ భేటీ అవుతారు. బుధవారం మరో 15 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారితో సమావేశం అవుతారు. 

ఇందులో అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ప్రధాని మోదీ సీఎంలతో సమీక్ష నిర్వహించడం ఇది ఆరోసారి. చివరి సారిగా మే 11న ఆయన ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. వీరితో భేటీ అనంతరం మోడీ కరోనా కేసులతో అల్లాడుతున్న రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తీసుకుంటారు. 

దేశంలోని 15 ప్రాంతాల్లో కరోనా నియంత్రణకు ఏంచేయాలనే దానిపై మోడీ ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle