newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

సంప్రదాయం పేరిట కాలేజీ అమ్మాయిల లోదుస్తుల తనిఖీలు

15-02-202015-02-2020 15:36:34 IST
2020-02-15T10:06:34.579Z15-02-2020 2020-02-15T10:06:31.044Z - - 08-08-2020

సంప్రదాయం పేరిట కాలేజీ అమ్మాయిల లోదుస్తుల తనిఖీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహిళలకు సహజసిద్ధంగా వచ్చే పీరియడ్స్ విషయంలో సంప్రదాయాలు పాటించడం ఇంకా తగ్గలేదు. కాలేజీలో చదివే అమ్మాయిలు నెలసరి టైంలో కొన్ని చోట్లకు వెళ్ళకూడదని ఆంక్షలు విధించింది ఓ కాలేజ్. అంతేకాదు, కాలేజీలో అమ్మాయిల లో దుస్తులు కూడా తీయించి మరీ తనిఖీలు చేయడం వివాదాస్పదం అయింది. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. నెలసరి టైమ్​లో వంటగదిలోకి, పూజ గది సమీపానికి  వెళుతున్నారని ఓ కాలేజీ ప్రిన్సిపల్ ​కోపానికొచ్చింది.

హాస్టల్​లోని 68 మంది స్టూడెంట్లను పిలిపించింది. రెస్ట్​ రూంలో వారి లోదుస్తులను బలవంతంగా విప్పించి చెక్​ చేయడంతో కాలేజీ అమ్మాయిలు తీవ్ర అవమానానికి గురయ్యారు. ఇద్దరు అమ్మాయిలు తాము పీరియడ్స్ లో వున్నామని తనిఖీలకు ముందే ప్రకటించడంతో వారిపై ప్రిన్సిపల్ విరుచుకుపడింది. 

గుజరాత్ భుజ్ లోని శ్రీ సహజానంద గర్ల్స్ ఇనిస్టిట్యూట్​లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్​ చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆదేశించింది. కాలేజీ యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. నేషనల్​ కమిషన్​ ఫర్​ విమెన్ కల్పించుకుని కేసును సుమోటోగా స్వీకరించింది. ఢిల్లీ నుంచి ఎన్‌‌సీడబ్ల్యూ టీమ్‌‌ గుజరాత్‌‌కు వెళ్లి స్టూడెంట్స్‌‌తో మాట్లాడుతుందని అధికారులు తెలిపారు. 

భుజ్‌‌లోని శ్రీ సహజానంద గర్ల్స్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ స్వామి నారాయణ్​ మందిర్‌‌‌‌ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తోంది.దాదాపు 1500 మంది విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు.  ఈ కాలేజీలో సంప్రదాయాలు చాలా ఎక్కువ. నెలసరిలో ఉన్న అమ్మాయిలు కాలేజీ హాస్టల్‌‌లోని వంటగది, దేవుడి గదిలోకి వెళ్లకూడదనే రూల్​ ఉంది.

కొంతమంది డిగ్రీ అమ్మాయిలు నెలసరి టైంలో వంటగదిలోకి వెళ్లారని ప్రిన్సిపల్‌‌కు కంప్లయింట్‌‌ అందడంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెనకా ముందు ఆలోచించకుండా ఏకంగా 68 మంది స్టూడెంట్స్‌‌ను రెస్ట్‌‌రూంకు తీసుకెళ్లి వారితో బలవంతంగా లో దుస్తులు విప్పించి చెక్​ చేయించడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం వివాదాస్పదం అయింది. 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   12 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   16 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   18 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   20 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   20 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   21 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle