newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

శానిటరీ ఉద్యోగాలకు 7 వేలమంది ఇంజనీర్లు.. దేశమా!

29-11-201929-11-2019 11:01:35 IST
2019-11-29T05:31:35.776Z29-11-2019 2019-11-29T05:31:33.310Z - - 12-08-2020

శానిటరీ ఉద్యోగాలకు 7 వేలమంది ఇంజనీర్లు.. దేశమా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్న ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ పోస్టులకు పరీక్షలు పెడితే దాదాపు 20 లక్షలమంది హాజరయ్యారు. ఎక్కడ ఉద్యోగావకాశాలు ఉన్నా వెంటనే వేలు, లక్షల సంఖ్యలో యువతీయువకులు వచ్చి వాలిపోతున్నారు. దేశంలో నిరుద్యోగం ఎంతగా తాండవిస్తోందో ఈ గణాంకాలే చాటి చెబుతున్నాయి. తాజాగా 549 శానిటరీ పోస్టుల భర్తీకోసం ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు వేల సంఖ్యలో ఎగబడటం భీతావహ పరిస్థితిని సూచిస్తోంది. పలానా పనులు చేయం అంటూ ఇన్నాళ్లుగా మడి గట్టుకుని కూచున్న యువత నిరుద్యోగ భూతం ధాటికి.. ఏ కొలవు దొరికినా సరే చేసిపడేస్తాం అంటూ ముందుకురుకుతోంది. ఇది శ్రమను గౌరవించడం అనే కొత్త సంస్కృతి ప్రభావం అని చెప్పలేం.

వివరాల్లోకి వెళితే తమిళనాడులోని  కోయంబత్తూరు నగర కార్పొరేషన్‌లో వందల సంఖ్యలో ఉన్న శానిటరీ కార్మికుల పోస్టుల భర్తీకోసం ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు (బీఎస్‌సీ, ఎంఎస్‌సీ, ఎంకామ్‌) వేలకొద్దీ ఎగబడిన వైనం నిరుద్యోగ భారతానికి అద్దం పట్టింది. కార్పొరేషన్‌లోని 549 శానిటరీ కార్మికుల పోస్టులకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో మొత్తం 7 వేల మంది ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు దరఖాస్తు చేసుకోవడం విశేషం.

గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల కోసం పిలుపునివ్వగా  వేల దరఖాస్తులు వచ్చి పడ్డాయని కార్పొరేషన్‌ అధికారులు స్వయంగా ప్రకటించారు. 

ఈ ఉద్యోగాల కోసం బుధవారం ప్రారంభమైన మూడు రోజుల ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల ధృవీకరణ కార్యక్రమంలో 7వేల మంది దరఖాస్తుదారులు హాజరైనట్లు కార్పొరేషన్ అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 70 శాతం మంది అభ్యర్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సి, కనీస అర్హత పూర్తి చేసినవారు కాగా,  వీరిలో ఎక్కువ మంది ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారని వారు తెలిపారు. వీరిలో ఇప్పటికే ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు. అలాగే గత పదేళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారు కూడా ఈ శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రతిదీ ఒక వృత్తి కాబట్టి శానిటరీ వర్కర్‌గా పనిచేయడంలో పెద్దగా సిగ్గు లేదనీ  బిఇ మెకానికల్ గ్రాడ్యుయేట్ ఎస్ విఘ్నేష్ అన్నారు. తల్లి, తమ్ముళ్లను పోషించుకోవాల్సి  వుంది. అందుకే ఈ ఇంటర్వ్యూకి వచ్చానన్నారు. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన పూవిజి మీనా, ఎంకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె భర్త ఎస్ రాహుల్, ఇంటర్వ్యూలో ఎంపికైతే తాము శానిటరీ కార్మికులుగా  పనిచేయడానికి అభ్యంతరం లేదని ఈ జంట తెలిపింది. అలాగే 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న పి ఈశ్వరి మాట్లాడుతూ, కార్పొరేషన్ చాలా సంవత్సరాల తరువాత ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున  పర్మినెంట్‌ జాబ్‌ కోసం చూస్తున్నానని చెప్పారు.

పట్టభద్రులుగా ఉండి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది ప్రైవేట్ సంస్థల్లో నెలకు 6 లేక 7 వేల రూపాయల జీతానికి పనిచేస్తూ కుటుంబాలను పోషించాల్సి వస్తోంది. అయితే 12 గంటలపాటు పనిచేసినా ఉద్యోగ భద్రత లేని స్థితిలో చివరకు శానిటరీ ఉద్యోగాలైనా సరే దొరికితే చాలు అని వీరు భావిస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10వ తరగతి. ప్రారంభ జీతం రూ .15,700. పొద్దున మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు పని గంటలు. ఈ మధ్యలో ఉన్న విశ్రాంతి సమయంలో ఇతర చిన్న పనులు చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇదే ఉద్యోగార్థులను ఆకర్షించినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా నగర కార్పొరేషన్‌లో 2,000 మంది పర్మినెంట్‌, 500 మంది కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులు పనిచేస్తున్నారు. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle