newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

శాంతి నెలకొన్నట్లే... భారత్ సరిహద్దుల్లో చైనా బలగాల ఉపసంహరణ!

11-06-202011-06-2020 18:04:13 IST
2020-06-11T12:34:13.538Z11-06-2020 2020-06-11T12:34:11.232Z - - 07-08-2020

శాంతి నెలకొన్నట్లే... భారత్ సరిహద్దుల్లో చైనా బలగాల ఉపసంహరణ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సరిహద్దుల వద్ద మోహరించిన బలగాలను చైనా ఉపసంహరించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ప్రతిగా భారత్‌ సైతం దశలవారీగా సైన్యాన్ని వెనక్కి పిలుస్తున్నట్లు పేర్కొన్నాయి. తూర్పు లడఖ్‌, గాల్వన్‌ లోయ, ప్యాంగాంగ్‌ త్సో సెక్టార్‌ వద్ద చైనా బలగాలు మోహరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన అనంతరం శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్‌- చైనాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు ఇరుదేశాల విదేశాంగ శాఖలు ప్రకటన విడుదల చేశాయి. 

ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో మోహరించిన బలగాలను ఇరు దేశాలు ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం.‘‘ ప్రతిష్టంభనకు కారణమైన ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. భారత్‌ కూడా ఈ ప్రక్రియను ఆరంభించింది. పరస్పర అంగీకారంతో ఇరు వర్గాలు ముందుకు సాగుతున్నాయి’’ అని ఓ అధికారి పేర్కొన్నారు. బుధవారం మరోసారి ఇరు వర్గాల మధ్య తూర్పు లడఖ్‌లో చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. 

కాగా సరిహద్దు వివాదాలపై చర్చించేందుకు శుక్రవారం భారత విదేశాంగ తరఫున సంయుక్త కార్యదర్శి నవీన్‌ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ వూ జియాంగోతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు భారత ఆర్మీ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌, చైనా టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. 

తూర్పు లడఖ్‌లో సరిహద్దుల వద్ద తలెత్తిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. సరిహద్దుల్లో తలెత్తిన విభేదాలు.. వివాదంగా మారేందుకు భారత్‌- చైనా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోవని వ్యాఖ్యానించింది. 

చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునైంగ్‌ సోమవారం మాట్లాడుతూ చైనా వైఖరిని స్పష్టపరిచారు. ‘‘జూన్‌ 6 మధ్యాహ్నం చుసుల్‌- మోల్డో ప్రాంతంలో చైనా, ఇండియా కమాండర్ల మధ్య సమావేశం జరిగింది. ఇరు వర్గాలు తమ వాదన వినిపించాయి. సరిహద్దు పరిస్థితులపై దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలు జరిగాయి. సరిహద్దు ఉద్రిక్తతలపై శాంతియుత పరిష్కారం కనుగొని.. విభేదాలు వివాదాలుగా మారకుండా ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. చర్చలకు ఇరు వర్గాలు సుముఖంగా ఉన్నాయి. కాబట్టి పరిస్థితులన్నీ స్థిరంగా, అదుపులోనే ఉన్నాయి’’ అని ఆమె పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే తదుపరి చర్యగా ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో మోహరించిన సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని విశ్వసనీయ సమాచారం.

అయితే పరిస్థితులు కాస్త సద్దుమణిగి సైనిక బలగాల మోహరింపును వెనక్కు తీసుకున్నప్పటికీ చైనా సైనిక బలగాలు గత నెలరోజులుగా అంత భారీ సంఖ్యలో సరిహద్దుకు ఎలా, ఎందుకు చేరుకున్నాయ్నది ఇప్పటికీ పజిల్‌గానే ఉంది. ఇప్పుుడు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేగంగా సరిహద్దులకు తరిలే దీర్ఘ ప్రణాళికతో చైనా అడుగులేస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. చైనా భారీ ఎజెండా ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టం కాలేదని, భారత్ అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరంటున్నారు.

 

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   3 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   5 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   8 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   8 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   9 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle