newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

శవాల దిబ్బగా న్యూయార్క్.. ఒకేరోజు 2 వేల కరోనా మృతులు

10-04-202010-04-2020 10:55:16 IST
Updated On 10-04-2020 10:56:16 ISTUpdated On 10-04-20202020-04-10T05:25:16.965Z10-04-2020 2020-04-10T05:25:04.483Z - 2020-04-10T05:26:16.362Z - 10-04-2020

శవాల దిబ్బగా న్యూయార్క్.. ఒకేరోజు 2 వేల కరోనా మృతులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆధునిక అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని ఉత్పాతం ఆ దేశాన్ని ప్రకంపిపచేస్తున్న వేళ.. న్యూయార్క నగరం శవాల దిబ్బగా మారుతోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇప్పటికే లక్షా 50 వేల కేసులు పైగా ఈ ఒక్క నగరంలో నమోదు కాగా 24 గంటల్లో ఈ నగరంలో 2 వేలమంది కరోనా రోగులు మృత్యువాత పడటం అమెరికాను కలవరపెడుతోంది. కోవిడ్‌–19 రోగులు కళ్ల ముందే మరణిస్తూ ఉండడంతో న్యూయార్క్ నగరంలో  వైద్య సిబ్బంది కూడా హడలెత్తిపోతున్నారు. ఏ విపత్తు కూడా అమెరికాను ఈ స్థాయిలో ఇప్పటివరకు వణికించకపోవడంతో ఏం జరుగుతోందో, దీనిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు.

అమెరికాలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. 24 గంటల్లోనే 2 వేల మంది మృతి చెందడం ఆందోళనకు దారి తీస్తోంది. రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. మృతి చెందిన వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో 10 మంది పురుషులే. వీరంతా న్యూయార్క్, న్యూజెర్సీకి చెందిన వారు. న్యూయార్క్‌లో మరణించిన భారతీయుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని సమాచారం. ఫ్లోరిడాలో మరొక ఇండియన్‌ చనిపోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. 

ఇక మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు పరీక్షల్లో తేలింది. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఈ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాధిగ్రస్తులు భారత్‌లోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందినవారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు, వివిధ ఎన్నారై సంస్థలతో కలిసి కరోనా సోకిన భారతీయులకు కావల్సిన సాయాన్ని అందిస్తున్నారు.  

న్యూయార్క్ నగరంలో ఏసీ ట్రక్కులకు ఇప్పుడు వేరే పని ఏమీ లేదు. మృతదేహాలను తీసుకుపోవడమే వాటి పనిగా ఉంది. ఆసుపత్రులు సరిపోకపోవడంతో భారీ ఏసీ ట్రక్కులను తాత్కాలిక మార్చురీలుగా మార్చి శవాలను వాటిలో ఉంచేస్తున్నారు. అంత్యక్రియలు చేయడానికి కూడా వంతులవారీగా వేచి ఉండాల్సిన పరిస్థితిలో ఈ ఏసీ ట్రక్కుల్లో శవాలను భద్రపర్చి తమ వంతు వచ్చినప్పుడు వాటిని ఖననం చేయడం అమెరికా మునుపెన్నడూ ఎరగలేదు. 

కరోనా వైరస్‌ ధాటికి న్యూయార్క్‌ అల్లకల్లోలంగా మారింది. కేవలం న్యూయార్క్‌లోనే కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటితే, 6 వేలకి పైగా మరణాలు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోవిడ్‌–19తో జనం పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో పెద్ద పెద్ద ఏసీ ట్రక్కుల్ని తాత్కాలిక మార్చురీల కింద మార్చేశారు. ఎవరైనా మరణిస్తే వాటిల్లో భద్రపరిచి, తమ వంతు వచ్చినప్పుడు ఖననం చేస్తున్నారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 4.50 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 16 వేలకు చేరింది.   

 ‘మా నగరంలో వైరస్‌ విశ్వరూపం చూపిస్తోంది. ప్రతీ ఒక్కరినీ కాపాడడమే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం. వచ్చే రెండు వారాల్లో వైరస్‌ని అదుపులోకి తెస్తాం’ అని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో అన్నారు. ఈ వైరస్‌ కేవలం వృద్ధుల్ని, వేరే వ్యాధులతో బాధపడుతున్న వారినే కాదు, యువకుల్ని కూడా కాటేస్తోంది. ‘అప్పటివరకు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కోలుకుంటున్నారు కదా అనుకుంటాం. హఠాత్తుగా కళ్ల ముందే తుది శ్వాస విడుస్తున్నారు. యువతీ యువకులు కూడా దీనికి అతీతమేమీ కాదు’అని మౌంట్‌ సినాయ్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు డయానా టోరెస్‌ అన్నారు.  

ఒక చిన్న ఉదాహరణ చూస్తే న్యూయార్క్‌ కల్లోలం గురించి అర్థమవుతుంది. నగరంలోని బ్రూక్లిన్ అపార్ట్‌మెంటు ఎదురుగా వైకాఫ్ హైట్స్ అనే ఆసుపత్రి ఉంటుంది. ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఒక జంట ప్రతీ రోజూ కిటికీలోంచి ఆస్పత్రి వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు దాని ఎదుట మృత దేహాలను తీసుకువెళ్లడానికి వచ్చే ఏసీ ట్రక్కులు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం చూస్తుంటే మనసు కలిచి వేస్తోందని అలిక్స్‌ మోంటాలెనె అన్నారు. ఆమె రాయిటర్స్‌ వార్తా సంస్థతో స్కైప్‌లో మాట్లాడారు.

‘‘మా కిటికీ లోంచి బయటకి చూస్తే ఏం జరుగుతుందో కనిపిస్తూ ఉంటుంది. వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. అంటే ఆస్పత్రి లోపల ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. రోజుకు ఎన్ని మృతదేహాలు వస్తున్నాయో లెక్క పెట్టడం మానేశాం. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది’’ అని అలిక్స్ చెప్పారు. ప్రత్యేకించి యువతీయువకులను కరోనా కాటేస్తుండటంతో అమెరికన్ సమాజం కదిలిపోతోంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle