newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

శరణార్థుల చేయూతే ప్రధాన ఎజెండా

24-06-201924-06-2019 06:58:00 IST
Updated On 24-06-2019 12:08:49 ISTUpdated On 24-06-20192019-06-24T01:28:00.451Z23-06-2019 2019-06-23T16:54:25.903Z - 2019-06-24T06:38:49.372Z - 24-06-2019

శరణార్థుల చేయూతే ప్రధాన ఎజెండా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐక్య‌రాజ్య స‌మితిలో శ‌ర‌ణార్థుల‌కు ఆశ్ర‌యం ఇచ్చే అంశం మీద ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగిందట‌. యూఎన్ఓ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర‌స్ నేతృత్వంలో జ‌రిగిన ఈ చ‌ర్చ‌లు ప‌లు దేశాల ప్ర‌తినిధులు త‌మ అభిప్రాయాల‌ను కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పార‌ట‌. ఆర్థిక ప‌రమైన‌, భ‌ద్ర‌తా ప‌ర‌మైన ఇబ్బందుల‌తో పాటు యుద్ధాలు, ఉగ్ర‌వాదుల దాడులు, జాతిప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లు, అణిచివేత‌తో ప‌లు దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు పొరుగు దేశాల‌కు శ‌ర‌ణార్ధులుగా వెళ్తున్నారు. 

ముఖ్యంగా సిరియా, ఆఫ్ఘ‌నిస్థాన్, ద‌క్షిణ సూడాన్, మ‌య‌న్మార్, సోమాలియా, వెనుజిలా, ఇరాక్ నుంచి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు పొరుగు దేశాల‌కు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని శ‌ర‌ణార్ధులుగా వ‌ల‌స పోతున్నారు. వీరికి ఆశ్ర‌యం, ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో చాలా దేశాలు విఫ‌లం అవుతున్నాయ‌న్న‌దే ఇప్పుడు ఐక్యరాజ్య స‌మితిలో జ‌రిగిన చ‌ర్చ‌. శ‌ర‌ణార్థుల‌ను అక్కున చేర్చుకోకుండా కొన్ని దేశాలు అమానుషంగా, అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌నీ యూఎన్ఓ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర‌స్ ఆరోపించారు. 

నేరుగా ఆ దేశాల పేర్లు చెప్ప‌క‌పోయినా, వ‌ల‌స పోతున్న దేశాల పొరుగు దేశాలు అంటూ, కొన్ని యూర‌ప్, ఆఫ్రికా దేశాల మీద ఆరోప‌ణ చేశార‌ట‌. ఇది చాలా విచారించ‌ద‌గ్గ విష‌య‌మ‌నీ, ఆయా దేశాలు త‌మ తీరు మార్చు కోవాల‌ని కోరార‌ట‌. కేవ‌లం యుద్దాలు, ఘ‌ర్ష‌ణ‌ల‌తో దాదాపు 7 కోట్ల మంది పొరుగు దేశాల్లో శ‌ర‌ణార్థులుగా బ‌తుకుతున్న‌ట్లు తెలిపారు.

కేవ‌లం గ‌తేడాదిన్న‌ర కాలంలో వెనుజిలా నుంచి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు వ‌స‌ల వెళ్లడం బాధ క‌లిగించే అంశంగా చెప్పుకొచ్చారు ఆంటోనియా గుటెర‌స్. అంత‌ర్జాతీయ శ‌ర‌ణార్థుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న విడుద‌ల చేసిన ఈ ప్ర‌క‌ట‌న మీద‌ ప‌లు దేశాల ప్ర‌తినిధులు భిన్న‌వాదాలు వినిపించార‌ట‌. 

శ‌ర‌ణార్థుల‌ను ఆదుకోవ‌డంలో తాము చాలా చ‌ర్య‌లు తీస‌కుంటున్నామ‌నీ, అయితే త‌మ దేశంలో శాంతి భ‌ద్ర‌త‌లకు కొంద‌రు విఘాతం క‌ల్గిస్తున్నార‌నీ, ఎక్కువ‌గా అత్యాచార ఘ‌ట‌న‌ల్లో శ‌ర‌ణార్థులే ముద్దాయిలుగా ఉన్నార‌నీ కొన్ని దేశాలు ఫిర్యాదు చేశాయ‌ట‌. ప్ర‌ధానంగా త‌మ దేశంలోకి వ‌చ్చిన సిరియా, ఇరాక్ శ‌ర‌ణార్థుల్లో కొంద‌రు ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు పెట్టుకుని దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌నీ, అలాంటి వారి వ‌ల్ల త‌మ ప్ర‌జ‌లు శ‌ర‌ణార్థుల‌ను దేశం నుంచి బ‌య‌ట‌కు పంపాల‌ని కోరుతున్న‌ట్లు జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, ఇట‌లీ దేశాల ప్ర‌తినిధులు చెప్పుకొచ్చార‌ట‌.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle