newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

శబరిమల కోసం ప్రత్యేక చట్టం ..సుప్రీం ఆదేశం

20-11-201920-11-2019 17:05:59 IST
2019-11-20T11:35:59.531Z20-11-2019 2019-11-20T11:35:57.379Z - - 05-08-2020

శబరిమల కోసం ప్రత్యేక చట్టం ..సుప్రీం ఆదేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శబరిమల వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమస్యపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారిస్తోంది.  తాజాగా శబరిమలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వానికి కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమల ఆలయ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఈ చట్టం 2020 జనవరి మూడో వారం నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది.

శబరిమల ఆలయ నిర్వహణలో తమ హక్కులు పరిరక్షించాలంటూ పండలం రాజ కుటుంబం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కేరళలోని ఆలయ పాలకమండలి చట్టాల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ప్రభుత్వ చర్యతో ఉపక్రమించిన నేపథ్యంలో వారు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం ఈ పిటిషన్‌ను విచారించింది సర్వోన్నత న్యాయస్థానం. 

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం వుంది. దీనిపై కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఈ వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ అయిన క్రమంలో... ఆలయ సలహా మండలిలో మహిళలకు పదవులు కేటాయించే విషయంలో నిర్ణయం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు.

మత ఆచార వ్యవహారాల గురించిన వివాదం విచారణలో ఉంది. అయితే మహిళల కోటా ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలకు ప్యానెల్లో చోటిచ్చారు. దీనిపై వివరణ కోరింది. ఇందుకు బదులుగా... ఆలయ పాలనలో మహిళలకు అవకాశం కల్పించే విషయంలో తాము ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు కేరళ వివరించింది. 

ఆలయాల్లో మహిళలకు పదవులకు సంబంధించి గతంలో రూపొందించిన చట్ట ముసాయిదాను కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అందచేసింది. కోర్టు ఈ ముసాయిదాను పరిశీలించింది. ఈ చట్టం సరిపోదని.. శబరిమల ఆలయ నిర్వహణ- పాలనకై ప్రత్యేక చట్టం అవసరమని పేర్కొంది. ఈ వివాదంపై తదుపరి విచారణను జనవరి మూడో వారానికి వాయిదా వేసింది. 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle