newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

వ్యాక్సిన్‌ తయారీలో పోటీ ముమ్మరం.. దేశంలో వ్యాక్సిన్‌ పరీక్షల జోరు..

26-07-202026-07-2020 09:39:56 IST
2020-07-26T04:09:56.802Z26-07-2020 2020-07-26T04:09:52.961Z - - 03-08-2020

వ్యాక్సిన్‌ తయారీలో  పోటీ ముమ్మరం.. దేశంలో వ్యాక్సిన్‌ పరీక్షల జోరు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల తయారీలో ముమ్మరంగా పోటీ మొదలైంది. దేశదేశాలు పోటీపడి మరీ త్వరలో వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటిస్తున్నయి. దీంతో భారత్ కూడా వ్యాక్సిన్ తయారీలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. స్వదేశీ వ్యాక్సిన్‌ ప్రయోగాలను భారత్ వేగవంతం చేసింది. భారత్‌ బయోటెక్, జైడస్‌ క్యాడిలా సంస్థలకు చెందిన వ్యాక్సిన్‌లను దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మనుషులపై ప్రయోగించి చూస్తున్నారు. 

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ఢిల్లీలో ఎయిమ్స్‌ ఆస్పత్రిలో 30 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. ఈ రెండు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్‌లు మొదటి, రెండో దశ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్‌ను పుణేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రెండుమూడో దశ ప్రయోగాల అనుమతుల కోసం వేచిచూస్తోంది.  

సైడ్‌ ఎఫెక్ట్‌లు అతిస్వల్పం  

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) భాగస్వామ్యంతో భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ను మొత్తం 12 ఆస్పత్రుల్లో 500 మంది వాలంటీర్లపై ప్రయోగించి చూశారు. 18–55 మధ్య వయసున్న వీరికి వ్యాక్సిన్‌ డోసు ఇచ్చాక స్వల్పంగా సైడ్‌ ఎఫెక్ట్‌లు వచ్చినట్టుగా ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. కొద్దిగా జ్వరం తప్ప ఇతరత్రా అనారోగ్య సమస్యలేవీ రాలేదని ఢిల్లీలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.  

మొదటి దశలో చేసిన ప్రయోగాలు విజయవంతంగా ముగిస్తే ఈ నెల 29 నుంచి రెండో దశ వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేపడతారు. మొదటి దశలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు లేవని నిర్ధారించుకోవడం, యాంటీ బాడీలు ఏ స్థాయిలో ఉత్పన్నమయ్యాయో తెలుసుకోవడానికి వాలంటీర్లకు మరికొన్ని టెస్టులు చేయాల్సి ఉందని ఎయిమ్స్‌ పట్నా డైరెక్టర్‌ సింగ్‌ చెప్పారు. కొవాగ్జిన్‌ ట్రయల్స్‌ హైదరాబాద్, పట్నా, కాంచీపురం, రోహ్‌తక్, ఢిల్లీలో  ప్రారంభమయ్యాయి. నాగపూర్, భువనేశ్వర్, బెల్గామ్, గోరక్‌పూర్, కాన్పూర్, గోవా, విశాఖపట్నంలలో  ప్రయోగించాల్సి ఉంది. రెండో దశ ప్రయోగాలు పట్నా, రోహ్‌తక్‌లలో 26 నుంచి ప్రారంభం కానున్నాయి. జైడస్‌కి చెందిన జైకోవిడ్‌ టీకాని అహ్మదాబాద్‌లో ప్రయోగించి చూస్తున్నారు.  

ఢిల్లీలో కొత్త‌గా 450 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆసుపత్రి

ఒక‌ప్పుడు క‌రోనా హాట్ స్పాట్‌గా ఉన్న దశ నుంచి ఇప్పుడు క‌రోనాపై విజ‌యం సాధిస్తోన్న స్థాయికి ఢిల్లీ చేరింద‌ని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. శ‌నివారం బురారీలో 450 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ  ప్ర‌భుత్వ ఆసుత్రుల్లో మౌలిక స‌దుపాయాలను ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌కు తీసిపోకుండా పెంచామ‌ని రానున్న కాలంలో మ‌రిన్ని ఆసుప్ర‌తులు నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. గ‌త నెల‌తో పోలిస్తే రాష్ట్రంలో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా తగ్గాయ‌ని, మ‌ర‌ణాల రేటు కూడా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపారు. 

జూన్ 23న ఒక్కరోజే అత్య‌ధికంగా 3947 కేసులు న‌మోద‌వ‌గా ప్ర‌స్తుతం వెయ్యికి త‌క్కువ‌గానే కేసులు న‌మోద‌వుతున్నాయ‌న్నారు. ప‌రీక్షల సామ‌ర్థ్యం పెంచ‌డం, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ట్రేసింగ్ చేసి చికిత్స అందించ‌డం ద్వారా క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌తీ ఒక్క‌రి కృషి, సామాజిక స్పృహ‌తో ఇది సాధ్య‌మైంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా వైద్యులు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బందికి ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలియ‌జేశారు. ఇక 24 గంట‌ల్లో ఢిల్లీలో 1025 కొత్త క‌రోనా కేసులు న‌మోదుకాగా 32 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశ రాజ‌ధానిలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 1,28,389కు చేరుకోగా, 3777 మంది మ‌రణించారు. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   10 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   13 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle