newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

వ్యాక్సిన్...ఏది ముందు? ఏది సురక్షితం?

16-09-202016-09-2020 17:12:11 IST
2020-09-16T11:42:11.095Z16-09-2020 2020-09-16T11:42:07.022Z - - 01-10-2020

వ్యాక్సిన్...ఏది ముందు? ఏది సురక్షితం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. మహమ్మారిని అంత మొందించాలంటే వైరస్ వినా మరో మార్గం లేదు. ప్రపంచంలో పలు దేశాలు వ్యాక్సిన్ పరిశోధనల్లో నిమగ్నమై ఉన్నాయి. పలు ఆశాజనక ప్రకటనలు కూడా చేస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి వస్తుందని ప్రపంచ దేశాలన్నీ భావించాయి. ఆశగా అందుకోసం ఎదురు చూస్తున్నాయి.

అయితే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ట్రయల్స్ నిలిపివేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో క్లినికల్ టెస్టులు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచమంతా ఊసురుమంతి. సరిగ్గా అదే సమయంలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ లోపభూయిష్టమైనదైతే కావచ్చు నాణ్యమైన వ్యాక్సిన్ మాది అంటూ ముందుకు వచ్చింది  రష్యా.

రష్యా వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా నలువైపుల నుంచీ సందేహాలూ అనుమానాలూ వ్యక్తమయ్యాయి. విస్తృత పరిశోధనలు లేకుండానే రష్యా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసిందంటూ విమర్శలూ వెల్లువెత్తాయి. సరిగ్గా అదే సమయంలో ప్రపంచ మంతా గొప్పగా చెబుతున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోవడంతో రష్యా మాదే నిఖార్సైన వ్యాక్సిన్ అంటూ పునరుద్ఘాటించింది. ఇలా జరిగి 24 గంటలు పూర్తిగా గడిచాయో లేదో.. రష్యా వ్యాక్సిన్ లోనూ లోపాలు బయటపడ్డాయి.

రష్యా వ్యాక్సిన్ స్పత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా ప్రజారోగ్యం విషయంలో ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలిపోయింది. ఈ వ్యాక్సిన్ పరీక్షల్లో పాల్గొన్న 15% మంది తీవ్ర ఆరరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని రష్యా స్వయంగా వెల్లడించింది. వెంటనే ప్రయోగాలను నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో మూడు వారాల్లో అమెరికా వ్యాక్సిన్ అందుబాటులోనికి వస్తుందని ప్రకటించారు.

ఇలా వరుస ప్రకటనలు, వరుస వైఫల్యాలతో వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది? ఏ వ్యాక్సిన్ సురక్షితం అన్న విషయంలో ప్రపంచ వ్యాప్తంగా సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. అసలు ఇలా అదరాబాదరాగా తీసుకువచ్చే వ్యాక్సిన్లు సురక్షితమేనా అన్న భయాలూ వెన్నాడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే వచ్చే ఏడాది రెండో అర్థభాగం కంటే ముందు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం దాదాపు అసాధ్యమని చెబుతోంది.

ఇంత అయోమయం మధ్య ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మళ్లీ ప్రారంభించింది. వ్యాక్సిన్ ప్రయోగాలలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమేనని ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రూపకర్తలు చెబుతున్నారు. హడావుడి తయారీతో అందరి కంటే ముందు మార్కెట్ లోకి వచ్చిన రష్యా వ్యాక్సిన్ కూడా సురక్షితం కాదని దానిని వాడిన వారిల 14% మందిలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తేలిపోయింది. ఏది ఏమైనా కరోనా మహమ్మారితో పోరులో ప్రపంచం విజయం సాధించాలంటే వ్యాక్సిన్ త్వరగా బయటకు రావాలి. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు మూడడుగులు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ.  

మీరు ప్రాజెక్టులు కడితే ఒప్పుకోం.. మేం మాత్రం కడతాం.. చైనా వితండవాదం

మీరు ప్రాజెక్టులు కడితే ఒప్పుకోం.. మేం మాత్రం కడతాం.. చైనా వితండవాదం

   9 hours ago


రిలయన్స్ రిటైల్ లోకి భారీగా పెట్టుబడులు..!

రిలయన్స్ రిటైల్ లోకి భారీగా పెట్టుబడులు..!

   9 hours ago


బాబ్రీ తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!

బాబ్రీ తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!

   10 hours ago


సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

   12 hours ago


బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

   13 hours ago


దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

   13 hours ago


భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

   15 hours ago


బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

   16 hours ago


బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

   29-09-2020


ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

   29-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle