newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

వైరస్‌ల చరిత్రలో అతి తెలివైన దుష్టశక్తి కరోనా: వైరాలజిస్టు

21-04-202021-04-2020 15:09:51 IST
Updated On 22-04-2020 14:14:55 ISTUpdated On 22-04-20202020-04-21T09:39:51.599Z21-04-2020 2020-04-21T09:39:49.752Z - 2020-04-22T08:44:55.285Z - 22-04-2020

వైరస్‌ల చరిత్రలో అతి తెలివైన దుష్టశక్తి కరోనా: వైరాలజిస్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేవలం 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 22 లక్షలమందికి సోకి, లక్షా 65 వేలమందికిపైగా పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్‌కు అంత శక్తి ఎలా వచ్చిందో అర్థం చేసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య నిపుణులు మొత్తంగా మల్లగుల్లాలు పడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మాతిసూక్ష్మమైన ఒక చిన్న కణం ఇంత ఉత్పాతాన్ని ఎలా కలిగిస్తోందన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌-19 వ్యాప్తి, మహమ్మారి కదలికలు వైద్య నిపుణులకే అంతుచిక్కని క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్ పీటర్ కోల్చిన్స్కీ ఈ వైరస్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సార్స్‌-కోవిడ్‌-2 వైరస్‌ను చతురత కలిగిన దుష్టశక్తిగా ఆయన అభివర్ణించారు. 

ఎలాంటి లక్షణాలు లేకుండానే ఇది పెద్దసంఖ్యలో ప్రజలకు వ్యాపించి సైలెంట్‌ కిల్లర్‌గా మారుతోందని పీటర్ కోల్చిన్స్కీ వ్యాఖ్యానించారు. సార్స్‌ వైరస్‌ కంటే ఇది ప్రమాదకరమైందని, కోవిడ్‌-19, సార్స్‌ వైరస్‌ల మధ్య కొంత సారూప్యత ఉందని చెప్పారు. సార్స్‌ కుటుంబానికే కోవిడ్‌-19 వైరస్‌ చెందినప్పటికీ దీని దూకుడు భిన్నంగా ఉంటుందని, సార్స్‌ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కలిగించి బాధిత వ్యక్తిని గుర్తించే అవకాశం ఇస్తుందని కానీ కోవిడ్ 19 వైరస్ అలాంటి లక్షణాలను కనబడనివ్వకుండానే లక్షలాదిమందిపై గుప్తంగా దాడి చేస్తోందని పీటర్ కొల్చిన్సీ  ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.

కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తి నోటి తుంపరల ద్వారా మరొకరి శరీరంలోకి గొంతు ద్వారా లోపలికి ప్రవేశిస్తుందని అన్నారు. ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవని, జలుబు చేసి ఉంటుందనే భ్రమలో ఉంటారని అన్నారు. లక్షణాలు కనిపించి ఆస్పత్రికి తరలించేలోగానే జరగాల్సిన నష్టం జరుగుతుందని చెప్పారు. తనకు కోవిడ్‌-19 సోకిందని తెలియని బాధితుడు అప్పటివరకూ సన్నిహితంగా మెలిగిన వారందరికీ  ఈ వ్యాధిని సంక్రమింపచేసే అవకాశం ఉందని ఆందోళణ వ్యక్తం చేశారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, ఇతర రక్షణ పరికరాలతో మహమ్మారికి దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఒక్క జాడ కూడా బయట పెట్టకుండా, వైద్య నిపుణులు గుర్తించేలోపే అంతర్గత మెకానిజంలను పెంచుకుని సైలెంట్ కిల్లర్లలా కరోనా మనుషులను నిలువునా చంపేస్తోందని పీటర్ చెప్పారు. కరోనాను చెదరగొట్టాలంటే మొత్తం వైరస్‌లు వంశవృక్షాన్ని గురించి ఆలోచించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

దాదాపు వైరస్‌లన్నీ పైభాగంలో ముళ్లు కలిగి ఉంటాయని, తుంపరల ద్వారా శరీరంలోకి ప్రవేశించే కరోనా వైరస్ తన ముళ్లను ఉపయోగించి మానవ శరీర కణాల్లోని ప్రొటీన్లకు అతుక్కుపోతాయని పీటర్ చెప్పారు. వైరస్ తెలివి మొత్తానికి దాని ముళ్లే కారణమని చెప్పారు. మనిషి కణంలోకి ప్రవేశించాక తన సంఖ్యను పెంచుకోవడానికి తన అంతర్గత నిర్మాణాన్ని ఉపయోగించుకుంటుందని చెప్పారు.

కోవిడ్ 19 వైరస్‌తో పోలిస్తే స్కార్స్ కోవిడ్-1 వైరస్ మందమతి అనే చెప్పాలి. ఎందుకంటే అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి కూచుంటుంది. ఇతరులకు అది వ్యాపించకముందే నేనున్నానోచ్ అంటూ ప్రకటించేస్తుంది. భౌతిక దూరం పాటిస్తే  సార్స్ వైరస్ నశించిపోతుంది. కానీ కరోనా వైరస్ మాత్రం ప్రాణాంతకమైనది. తన్ను తాను వ్యక్తపర్చుకోకముందే, తన లక్షణాలను ప్రదర్శించుకోకముందే అసంఖ్యాక ప్రజల్లో విస్తరించేసి ఉంటుందని, వైరస్ ఉంది అని తేలకముందే మనుషులు చనిపోవడానికి ఇదే కారణమని పీటర్ చెప్పారు. సాంకేతికంగా చూస్తే వైరస్ సజీవంగా ఉండదు. కానీ వైరస్‌‌లలోని ఈ చతురత కలిగిన దుష్ట శక్తి ఎన్నడూ ఉనికిలో లేనప్పటికీ అది నన్ను అద్భుతంగా ఆకర్షించింది. అందుకే నేను వైరాలజిస్టు (పైరస్‌ల అధ్యయనవేత్త, నిపుణుుడు) అయిపోయాను అని పీటర్ తెలిపారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   10 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle