newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

వైద్యురాలు భారతీయ ఆత్మ.. ఇలాంటివారు దేశానికే గర్వకారణం: మోదీ ట్వీట్ వైరల్

02-05-202002-05-2020 14:33:17 IST
Updated On 02-05-2020 14:52:09 ISTUpdated On 02-05-20202020-05-02T09:03:17.402Z02-05-2020 2020-05-02T09:03:14.237Z - 2020-05-02T09:22:09.229Z - 02-05-2020

 వైద్యురాలు భారతీయ ఆత్మ.. ఇలాంటివారు దేశానికే గర్వకారణం: మోదీ ట్వీట్ వైరల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైద్యసేవలు సమర్దంగా అందించలేదని, తమవారిని నిర్లక్ష్యంతో నిలువునా పొట్టన బెట్టుకున్నారని డాక్టర్లు, నర్సులపై దాడిచేస్తూ, ఆసుపత్రి ఫర్నిచర్‌ని ధ్వంసం చేస్తూ రోగుల బంధువులు సాగిస్తున్న ఆరాచకం చివరకు అలాంటి దాడులకు కారకులను కఠినంగా శిక్షించేలా చట్టం తెచ్చేవరకు వెళ్లింది. చివరకు కరోనా వైరస్‌ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి కూడా అక్కడక్కడ అవమానాలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో కోవిడ్‌-19తో పోరుపై మనల్ని గెలిపించడానికి అనుక్షణం యుద్ధం చేస్తున్న వైద్యనారాయణులను సముచితంగా గౌరవిస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. 

ఇలాంటి అపురూప ఘటనకు సంబంధించిన ఒక  వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. కరోనా బాధితులకు 20 రోజులపాటు ఐసీయూలోనే ఉండి సేవలందించి ఇంటికి తిరిగొచ్చిన ఒక మహిళా వైద్యురాలు జాతి మొతాన్ని ఆనందంలో ముంచెత్తారని, భారత దేశ ఆత్మ ఇక్కడే ఉందని ప్రధాని చేసిన ట్వీట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

Doctor returns home to heartwarming welcome after 20 days of duty ...

కోవిడ్‌-19 బాధితులకు నిర్విరామంగా 20 రోజుల పాటు ఐసీయూలో వైద్య సేవలు అందించిన ఇంటికి తిరిగొచ్చిన మహిళా వైద్యురాలిని ఆమె కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు పూలతో స్వాగతించిన అపురూప ఘట్టం ఈ వీడియోలో ఉంది. చప్పట్లు, ప్లకార్డులతో ఊహించని విధంగా తనకు లభించిన సాదర స్వాగతానికి సదరు మహిళా వైద్యురాలు భావోద్వేగానికి గురై కంటతడిపెట్టిన అపురూప క్షణాలు అందులో ఉన్నాయి. 

‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. ఇది భారతదేశం యొక్క ఆత్మ. మనం ధైర్యంగా కోవిడ్‌-19తో పోరాడుతున్నాం. ముందుండి పనిచేసేవారంటే మనకెంతో గర్వకారణమ’ని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళా వైద్యురాలిపై నెటిజనులు అభినందనలు కురిపిస్తున్నారు. 

కరోనా యోధురాలికి ఇంతకు మించిన స్వాగతం ఎవరూ పలకలేరంటూ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ట్వీట్ చేశారు. 

ఇక నెటిజన్లయితే ఆ వైద్యురాలిని  ఆకాశానికెత్తుతున్నారు. ఈ క్షణంలో మనకు కావలిసిందిదే. డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, పోలీసులు ఇలా కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న వీరినే మనం లెజెండ్స్‌గా గుర్తించి గౌరవించాలి. దేశంకోసం, సమాజ ఆరోగ్యం కోసం కుటుంబాన్ని వదిలి మూడువారాల పాటు అసాధారణమైన సేవలందించిన ఆ మహిళా డాక్టర్‌కి సెల్యూట్ అంటూ నెటిజన్లు వందనాలర్పిస్తున్నారు.

2019 డిసెంబరులో చైనాలోని వూహాన్‌లో తొలి కరోనా వైరస్ బయటపడ్డాక, ఈ నాలుగు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలమంది వైరస్ ప్రభావానికి గురయ్యారు. భారత్‌లో మే 1 నాటికి 35 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రధానంగా వైద్య సిబ్బంది సహనానికి పరీక్ష పెట్టింది. వేలాదిమంది ఆసుపత్రులకు వెల్లువెత్తుతుండగా తక్కువ సంఖ్యలో ఉన్న వైద్య సిబ్బంది కరోనా రోగులకు సేవలందిస్తూ రోజులతరబడి ఆసుపత్రుల్లో ఐసీయూ సెంటర్లలో ఉండిపోయి ప్రాణాలకు లెక్కచేయకుండా సేవాభావానికి నిలువెత్తు నిర్వచనగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఈ సాధారణమైన మహిళా డాక్టర్ కూడా ఒకరు. 

వైద్యోనారాయణో హరి. ఈ నానుడి ఇలాంటి వారిని చూసే పుట్టి ఉంటుంది. వైద్యులను, వైద్య సిబ్బందిని ఇకనైనా గౌరవిద్దాం. వారిని అవమానించడం జాతి గౌరవానికి భంగమని గుర్తిద్దాం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle