newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

వైట్‌హౌస్‌లో పెరిగిన కరోనా కౌంట్.. అధ్యక్ష, ఉపాధ్యక్షుల సహాయకులకు పాజిటివ్

10-05-202010-05-2020 08:24:01 IST
2020-05-10T02:54:01.581Z10-05-2020 2020-05-10T02:53:59.481Z - - 12-08-2020

 వైట్‌హౌస్‌లో పెరిగిన కరోనా కౌంట్.. అధ్యక్ష, ఉపాధ్యక్షుల సహాయకులకు పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండురోజుల్లో వైట్‌హౌస్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మూడుకు చేరుకోవడంతో అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం శ్వేతసౌథంలో కల్లోలం మొదలైంది. ఇన్నాళ్లుగా న్యూయార్క్ వంటి మహానగరాల్లో ప్రజలను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు నేరుగా వైట్ హౌస్‌మీదే గురిపెట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా సోకిన మర్నాడే మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రెస్‌ సెక్రటరీ కేటీ మిల్లర్, అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా సోకింది. దీంతో వైట్‌హౌస్‌లో కేసుల సంఖ్య మూడుకి చేరుకుంది. కరోనా పరీక్షల్లో వాళ్లిద్దరికీ పాజిటివ్‌గా తేలింది. 

శ్వేతసౌధం కరోనా బారినపడిన సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నప్పటికీ బింకం వదలని ట్రంప్ కరోనా వైరస్‌కి ఎవరూ భయపడాల్సిన పని లేదని కొట్టిపడేయటం విశేషం.

ఇటీవల ఉపాధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ కేటీ మిల్లర్‌ పెన్స్‌ను కలుకున్నారు కానీ ట్రంప్‌ని నేరుగా కలుసుకోలేదు. అయితే కేటీ మిల్లర్‌ ట్రంప్‌ సలహాదారుల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే స్టీఫెన్‌ మిల్లర్‌ భార్య కావడంతో వైట్‌ హౌస్‌లో ఆందోళన నెలకొంది. వైట్‌హౌస్‌లో రాకపోకలపై మరింత పకడ్బందీ చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే స్టీఫెన్‌ మిల్లర్‌కి పరీక్షలు చేయించారా ఆయన వైట్‌ హౌస్‌కు తరచూ వస్తున్నారా అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

కేటీ మిల్లర్‌కి గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వస్తే, ఆ మర్నాడు నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ ఒక్క రోజులోనే పరీక్షల్లో అంత వ్యత్యాసం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అందుకే కరోనా వైరస్‌కి ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన తేల్చేశారు. ట్రంప్‌ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా సోకడంతో వైట్‌హౌస్‌లో పనిచేసే సిబ్బంది అందరికీ రొటీన్‌గా చేసే పరీక్షల్లో కేటీకి పాజిటివ్‌ వచ్చింది.  

అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలికి కూడా కరోనా సోకినట్టుగా సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. ఇవాంకా తన పనులన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా నిర్వహిస్తూ ఉండడంతో ఆమెను కొన్ని వారాలుగా కలుసుకోలేదు. దీనివల్ల  ఇవాంకాకు వచ్చిన ఇబ్బందిలేదు. ఇవాంక ఆమె భర్త ఖుష్నెర్‌ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే వారిద్దరికీ నెగిటివ్‌ వచ్చింది.

ముగ్గురు కీలక నేతల వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో వైట్‌హౌస్‌లో రాకపోకలపై మరింత పకడ్బందీ చర్యలకు యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే స్టీఫెన్‌ మిల్లర్‌కి పరీక్షలు చేయించారా? ఆయన వైట్‌ హౌస్‌కు తరచూ వస్తున్నారా అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ట్రంప్‌ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా సోకడంతో వైట్‌హౌస్‌లో పనిచేసే మొత్తం సిబ్బందికి  పరీక్షలు నిర్వహించారు. దాంతో  కేటీకి పాజిటివ్‌ వచ్చింది.అయితే ట్రంప్ మాత్రం ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఇవాంక సహాయకురాలికి కరోనా రావడంతో ఆమెకు ఎక్కువ ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. 

ఉపాధ్యక్షుడి ఆపీసులోని సభ్యుడికి కరోనా వైరస్ సోకినట్లు గత మార్చినెలలోనే ప్రకటించిన కేట్ మిల్లర్ ఇప్పుడు తానే స్వయంగా కరోనా బారిన పడటం విశేషం. కాగా అధ్యక్ష ఉపాధ్యక్షుల వ్యక్తిగత సహాయకులకు వరుసగా కరోనా సోకడంతో వైట్ హౌస్ బ్రీఫింగ్ రూమ్‌లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లను మార్చారు.

ట్రంప్‌ రక్షణ బాధ్యతలు చూస్తున్న మిలిటరీలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత రోజు పెన్స్‌ కార్యదర్శికి కూడా సోకడంతో వైట్‌హౌస్‌ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అందరినీ మాస్క్‌ ధరించాలని చెబుతున్నప్పటికీ.. అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు పెన్స్‌ మాస్క్‌లు ధరించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కాగా, కరోనా లెక్క లపై చైనా ఏదో దాస్తోందని విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో నిప్పులు చెరిగారు. వూహాన్‌ లేబొరేటరీ నుంచే వైరస్‌ పుట్టి ఉండొచ్చని అన్నారు. 

మరోవైపు ఓహియో రాష్ట్రంలో కరోనా మృత్యుఘోష పెరుగుతోంది. గత 3 వారాల్లో 500 మంది వైరస్‌తో చనిపోయారు. ఓ ఔషధాన్ని వినియోగించడం ద్వారా కొవిడ్‌-19 నుంచి ఉపశమనం పొందొచ్చంటూ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రచారంతో బయోమెడికల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ రిక్‌ బ్రైట్‌ విభేదించారు. దీంతో ఆయనను తక్షణం బదిలీ చేశారు.  

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle