newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

వేడెక్కిన ఢిల్లీ రాజకీయం.. ఆప్‌తో తృణమూల్ దోస్తీ

31-01-202031-01-2020 08:46:27 IST
Updated On 31-01-2020 12:37:50 ISTUpdated On 31-01-20202020-01-31T03:16:27.338Z31-01-2020 2020-01-31T03:16:24.668Z - 2020-01-31T07:07:50.023Z - 31-01-2020

వేడెక్కిన ఢిల్లీ రాజకీయం.. ఆప్‌తో తృణమూల్ దోస్తీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం హోరెత్తుతోంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలు తమ మిత్రులతో దోస్తీ కడుతున్నాయి. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) ప్రకటించింది.  అధికార ఆమ్‌ ఆద్మీకి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు  వెల్లడించింది. దీంతో పోటీ మరింత రసవత్తరంగా ఉండబోతోంది. ఢిల్లీలోని బెంగాలీయులను ఆప్ కు ఓటు వేయాలని టీఎంసీ కోరనుంది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతినిధి దేరెక ఓబ్రెయిన్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌కు ఓటేసి గెలిపించాల్సిం దిగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటేయండి. కేజీవ్రాల్‌తో పాటు ఆప్‌ అభ్యర్థులందరికీ ఓటేసి గెలిపించండి’ అంటూ ఓబ్రెయిన్‌ ట్వీట్‌తో పాటు వీడియో కూడా పోస్ట్‌ చేశారు. ఆప్‌ గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని ఓబ్రెయిన్‌ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి హస్తగతం చేసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. రాజకీయవ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలతో ముందుకెళుతున్నారు.

ఈ దఫా ఎలాగైనా కమలం జెండా ఎగురేయాలని బీజేపీ కేంద్రమంత్రులను రంగంలోకి దింపింది. ఇటు బీజేపీ మంత్రులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివిధ ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మలను తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.

వీరిద్దరు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియామవళిని పాటించడం లేదని ఆప్ ఫిర్యాదు చేసింది. రెండురోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై మండిపడ్డారు. వీరిని దేశద్రోహులతో పోల్చిన కేంద్ర మంత్రి.. ఆ ద్రోహులందరినీ కాల్చిచంపాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ్ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ కూడా షహీన్ బాగ్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కశ్మీర్‌లో జరుగుతోన్న పరిణామాలతో ఢిల్లీలోని కశ్మీరీ పండిట్లు సంతోషంగా ఉన్నారని,  సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నవారు మాత్రం ఇళ్లలోకి దూరి మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడతున్నారని ఘాటైన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది. 

అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తాము తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ ఇవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకూ ప్రచారం నిర్వహించనున్నారు. 

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle