newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వెయ్యి కేసులు దాటినా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదు.. బతికిపోతున్నాం..

30-03-202030-03-2020 15:19:08 IST
Updated On 30-03-2020 15:41:48 ISTUpdated On 30-03-20202020-03-30T09:49:08.364Z30-03-2020 2020-03-30T09:49:06.127Z - 2020-03-30T10:11:48.636Z - 30-03-2020

వెయ్యి కేసులు దాటినా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదు.. బతికిపోతున్నాం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న క‌రోనా కేసుల నేప‌థ్యంలో భార‌త్‌లో ఇంకా క‌మ్యూనిటీ ట్రాన్సిమిష‌న్ జ‌ర‌గ‌లేద‌ని ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) శ‌నివారం తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో దాదాపు ప‌ది శాతం మందికి తీవ్ర‌మైన శ్వాస‌సంబంధ స‌మ‌స్య‌ ఉన్న‌ట్లు తెలిపింది. 

‘క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఇప్ప‌టివ‌ర‌కు హాస్పిట‌ల్లో చేరిన 110 మందిలో దాదాపు ప‌ద‌కొండు మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అయితే వారిలో చెన్నై, మ‌హారాష్ర్ట‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ముగ్గురికి ఎలాంటి విదేశీ ప్ర‌యాణ చ‌రిత్ర లేదు.  క‌రోనా సోకిన వ్య‌క్తితోనూ వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇక క‌మ్యునిటీ ట్రాన్స్‌మిష‌న్ అన‌డానికి ఎలాంటి ఆధారాల్లేవు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాందోళ‌న‌కు గురికావ‌ద్దు.’ అని ఐసీఎంఆర్ శాస్ర్త‌వేత్త గంగాఖేద్క‌ర్ అన్నారు. 

ఇప్ప‌టివ‌ర‌కు 150  ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ల్యాబ్‌ల‌లో క‌రోనా పాజిటివ్ కేసుల‌ను గుర్తించేందుకు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా సెల్ఫ్ టెస్టింగ్ కిట్ల‌ను అందుబాటులో ఉంచితే, ప్ర‌జ‌లు ఎవ‌రికివారు స‌రైన మార్గ‌ద‌ర్శ‌కాలు లేకుండా వాటిని వినియోగిస్తార‌ని, దాని వ‌ల్ల అన‌వ‌స‌ర‌మైన గంద‌ర‌గోళం ఏర్పడుతుంద‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా డాక్ట‌ర్ల అనుమ‌తి లేకుండా సొంత నిర్ణ‌యాల‌తో మందులు వాడ‌టం మంచిది కాద‌ని చెప్పారు. 

భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి ద‌గ్గ‌ర్లో ఉంది. ఈ వైర‌స్ కార‌ణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక  ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 6,40,589కు చేరుకోగా, 29,848 మంది చ‌నిపోయారు. జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ జ‌రిపిన గ‌ణాంకాల ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా పాజిటివ్‌, మ‌ర‌ణాల రేటు పెద్ద సంఖ్య‌లో ఉన్న‌ట్లు తెలిపింది. 

ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్‌పై భార‌త్ చేస్తున్న పోరులో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అంద‌జేసే పౌరుల సౌక‌ర్యార్థం అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు పీఎం-కేర్స్‌(ప్ర‌ధాన‌మంత్రి సిటిజ‌న్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిచ్యుయేష‌న్స్‌) ఫండ్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శ‌నివారం ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనాపై పోరుకు త‌మ వంతు సాయంగా విరాళాలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

కాగా, భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటివరకు భారత్‌లో 1090 మందికి కరోనా సోకిందని, 27 మంది మృతిచెందాjని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళలో 182 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కరోనా పాజిటివ్‌గా తేలి చికిత్స పొందినవారిలో 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొంది. మరోవైపు కరోనా కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదివారం ఆదేశాలు జారీచేసింది. 

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   15 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   a day ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle