newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

వెనక్కు తగ్గేది లేదు- చైనా.. క్షిపణి వ్యవస్థలతో భారత్.

28-06-202028-06-2020 10:51:50 IST
2020-06-28T05:21:50.341Z28-06-2020 2020-06-28T05:21:46.028Z - - 05-07-2020

వెనక్కు తగ్గేది లేదు- చైనా.. క్షిపణి వ్యవస్థలతో భారత్.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లేహ్‌లో గస్తీ తిరుగుతున్న భారత చినూక్‌ హెలికాప్టర్‌

సరిహద్దు వెంట మోహరింపులు పెంచిన భారత్‌

చైనా దుస్సాహసానికి చెక్‌ పెట్టేందుకే..

న్యూఢిల్లీ తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ముందుకు చొచ్చుకువచ్చిన చైనా ఆర్మీ వెనక్కి తగ్గేది లేదంటూ మొండికేసింది. పైపెచ్చు వివాదాస్పద ప్రాంతాల్లోకి భారీగా సైనిక బలగాలను దించుతోంది. దీంతో భారత్‌ అదే స్థాయిలో చర్యలు చేపడుతోంది. లద్దాఖ్‌కు ఆర్మీతోపాటు వైమానిక బలగాలను తరలించింది. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు కీలకమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను తరలించింది.

గల్వాన్‌ ఘటన జరిగిన పెట్రోల్‌ పాయింట్‌–14 వద్దకు రెండు దేశాలు బలగాలను, సైనిక సంపత్తిని భారీగా తరలించాయి. ఈ ఘటన జరిగిన అనంతరం అదే రోజు రెండు దేశాల కార్ప్స్‌ కమాండర్ల స్థాయిలో చర్చలు ఒక వైపు సాగుతుండగానే చైనా అబ్జర్వేషన్‌ పోస్టులు, టెంట్లతోపాటు గోడను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో తేలింది. అక్కడి నుంచి వెనక్కి తగ్గేందుకు చైనా నిరాకరించడంతో ఆ రోజు జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గతంలో ఎన్నడూ కూడా గల్వాన్‌ లోయను తమ మ్యాప్‌లో చైనా చూపించుకోలేదు.

అయినప్పటికీ, అది తమ భూభాగం కాబట్టే అక్కడికి వచ్చామనీ, తిరిగి ఎందుకు వెనక్కి వెళ్లాలని చైనా ప్రతినిధులు వాదించినట్లు సమాచారం.  ఆ తర్వాత జరగాల్సిన చర్చల తేదీలు కూడా ఖరారు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో రెండు దేశాలు ఎల్‌ఏసీ వెంట ఆయుధ సంపత్తిని, బలగాలను మోహరించడం కొనసాగిస్తున్నాయి. మరో మూడు నెలల తర్వాత లద్దాఖ్‌లో మళ్లీ మంచు కురియడం మొదలవుతుంది. ఆ సమయంలో లద్దాఖ్‌కు మిగతా భారత దేశంతో దాదాపు 6 నెలలపాటు సంబంధాలు తెగిపోతాయి. భారత సైన్యం కూడా అటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లకు సిద్ధమైంది.

చైనా మోహరింపులిలా..

► ఎల్‌ఏసీ వెంట చైనా భారీగా బలగాలు, ట్యాంకులు, క్షిపణులు, యుద్ధ విమానాలను మోహరించింది. పాంగాంగ్‌ త్సోలోని ఫింగర్‌4 వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేసింది.

► సుఖోయ్‌–30 వంటి యుద్ధ విమానాలు, వ్యూహాత్మక బాంబర్లను అక్కడ మోహరించింది. ఇవి భారత్‌తో సరిహద్దులకు 10 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి పహారా కాస్తున్నట్లు సమాచారం.

► దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, పెట్రోలింగ్‌ పాయింట్‌–14 సమీపంలోని గల్వాన్‌ లోయ, పెట్రోలింగ్‌ పాయింట్‌–15,17, 17ఏ, ఫింగర్‌ పాయింట్, పాంగోంగ్‌ త్సోలకు సమీపంలోని చైనా సైనిక హెలికాప్టర్లు గస్తీ చేపట్టాయి.

భారత్‌ ఏం చేస్తోందంటే..

► ఉత్తర భారతదేశంలోని ఎయిర్‌ బేస్‌లు, కంటోన్మెంట్‌లలో ఉన్న బలగాలు, ఫిరంగులు, శతఘ్ని దళాలు, నిఘా రాడార్లు, ఫైటర్‌ జెట్లు, హెలికాప్టర్లు గత నెల నుంచి లద్దాఖ్‌కు తరలుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ప్రస్తుతం 45వేల సైన్యం మోహరించి ఉంది.  

► చైనా బలగాలు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తక్షణమే తప్పికొట్టేందుకు వైమానిక, నావికా దళాలకు చెందిన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలతోపాటు డ్రోన్లను సైతం రెప్పపాటులోనే నేలకూల్చే సామర్ధ్యం ఉన్న ఆకాశ్‌ క్షిపణులు ఇందులో ఉన్నాయి.

► చండీగఢ్‌లోని వైమానిక స్థావరం నుంచి 46 టన్నుల భారీ టి90 యుద్ధట్యాంక్‌ను సి17 గ్లోబ్‌మాస్టర్‌ విమానం లద్దాఖ్‌కు మోసుకెళ్లింది.

► దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, ఫుక్చే, నియోమాల్లోని అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్స్‌ను ఎయిర్‌ ఫోర్స్‌ అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎస్‌యు30 ఎంకేఐ యుద్ధ విమానాలను మోహరించింది. శ్రీనగర్, లేహ్‌లో జాగ్వార్, మిరాజ్‌–200 యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించింది.

► సముద్రంలో చైనా కదలికలపై కన్ను వేసి ఉంచేందుకు నేవీ తన పి–81 నిఘా విమానాన్ని గస్తీకి పంపింది.

► లద్దాఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన చైనా సరిహద్దుల్లో ఉన్న 65 పాయింట్లలో పహారాను మరింత పెంచింది.

► సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గల్వాన్‌ లోయ, లద్దాఖ్‌లోని హాట్‌ స్ప్రింగ్స్, డెప్సంగ్‌ మైదానాలు, ప్యాంగాంగ్‌ త్సోతోపాటు ఉత్తర సిక్కింలోని నకు లా ప్రాంతాల్లో భారత్, చైనా బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉండటంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

నిపుణులు ఏమన్నారంటే..

► ‘అతిక్రమణలను, భారత భూభాగం వైపు నిర్మాణాలు చేపట్టడం చైనా నిలిపివేయాలి. సైనిక ప్రతిష్టంభన తొలగిపోవడానికి ఏకైక పరిష్కారం ఇదే’ అని చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిస్రీ అన్నారు.

► వెనక్కి తగ్గేందుకు రెండు పక్షాలు ఏమేరకు సానుకూలంగా ఉన్నాయనే దానిపైనే వివాద పరిష్కారం ఆధారపడి ఉంది’ అని మాజీ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హూడా అన్నారు.  

► ‘సరిహద్దుల్లో మోహరింపులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయి. బలగాల ఉపసంహరణ టి–20 మ్యాచ్‌లాగా వెంటనే ఫలితం తేలేది కాదు, టెస్ట్‌ మ్యాచ్‌ వంటిది. ఇందుకు 2, 3 నెలల వరకు పట్టవచ్చు. అంతకంటే, ఎక్కువ కాలం కూడా కొనసాగవచ్చు’ అని సైనిక ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి అంచనా వేశారు.

► భారత్‌తో సరిహద్దుల వెంట చైనా అనుసరిస్తున్న వైఖరితో ఆ దేశం భవిష్యత్తులో సుదీర్ఘ కాలం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డిప్యూటీ చీఫ్‌ ఆర్మీ స్టాఫ్‌(రిటైర్డు) లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇలాంటి తీరుతో ఆ దేశం అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతుందన్నారు. ప్రపంచమంతా కోవిడ్‌–19 మహమ్మారితో పోరాడుతుంటే చైనా మాత్రం లద్దాఖ్‌లో దుశ్చర్యకు పాల్పడటం ఆ దేశం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందని అమెరికాతో టారిఫ్‌ యుద్ధం, ఆస్ట్రేలియాతో విభేదాలు, హాంకాంగ్‌లో దిగజారుతున్న పరిస్థితులతో చైనాకు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు. గల్వాన్‌ ఘటనతో చైనా సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఒక రాజకీయ బలగమే తప్ప దానికి ఎలాంటి సైనిక ప్రమాణాలు లేనట్లు అర్థమవుతోందని చెప్పారు.

వెనక్కి తగ్గని చైనా

గల్వాన్‌ తీరంలో మళ్లీ టెంట్లు

9కి.మీ. పరిధిలో 16 టార్పాలిన్లు

లద్ధాఖ్‌లో భారీగా మోహరింపు

గురు, శుక్రవారాల్లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి

ఈ ప్రాంతం భారత్‌కు కీలకం

అప్రమత్తమైన భారత్‌ అత్యాధునిక వైమానిక రక్షణ 

వ్యవస్థల మోహరింపు తీర దేశాలవే 

దక్షిణ చైనా సముద్ర జలాలు

చైనాకు ఆసియాన్‌ ఝలక్‌

లద్ధాఖ్‌లో భారీగా బలగాల మోహరింపు

ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి.. భారత్‌ అప్రమత్తం

న్యూఢిల్లీ, జూన్‌ 27: చైనా వెనక్కి తగ్గలేదా? వాస్తవాధీన రేఖ వెంబడి మరో 16గుడారాలు ఏర్పాటు చేసిందా? బలగాలను ఇప్పటికీ మోహరిస్తూనే ఉందా? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి తాజా ఉపగ్రహ చిత్రాలు. వాటి ప్రకారం.. చైనా అధీనంలో ఉన్న గల్వాన్‌ నదీ తీరంలోని 9 కిలోమీటర్ల పరిధిలో 16 నలుపు టార్పాలిన్లు(గుడారాలు) కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో చైనా భారీగా బలగాలను మోహరిస్తూనే ఉందని తేలుతోంది. ఈ పరిణామం భారత సైనిక దళాలకు భారీ సవాలేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లద్ధాఖ్‌ నుంచి వెనక్కి తగ్గడానికి ఈనెల 22న ఇరు దేశాల లెఫ్టినెంట్‌ జనరల్స్‌ స్థాయిలో జరిగిన చర్చల్లో భారత్‌, చైనా అంగీకరించినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, గురు, శుక్రవారాల్లో ప్లానెట్‌ ల్యాబ్స్‌ తీసిన చిత్రాల్లో మాత్రం అక్కడ చైనా మరింతగా మోహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చైనా గుడారాలు వేసిన ప్రాంతం భారత సైనిక దళాలకు అత్యంత కీలకమని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భారత సైనిక శిబిరాలు కనిపించలేదు.

భారత వైమానిక రక్షణ వ్యవస్థల మోహరింపు

వాస్తవాధీన రేఖ వెంట చైనా యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల కార్యకలాపాలు భారీగా పెరిగాయి. హెలికాప్టర్లు తరచూ సరిహద్దుకు చొచ్చుకుని వస్తున్నాయి. దీంతో భారత్‌ అప్రమత్తమైంది. సత్వరమే స్పందించే, భూమ్మీద నుంచి గాల్లోకి ఎగిరే అడ్వాన్స్‌డ్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను తూర్పులద్ధాఖ్‌లో మోహరించింది. ఇందులో ఆకాశ్‌ మిస్సైల్‌ కూడా ఉంది. చైనా వైమానిక యుద్ధ విమానాలు లేదా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ హెలికాప్టర్లు దుస్సాహసానికి దిగితే అడ్డుకోవడానికి వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరించామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేనా, ఓ మిత్ర దేశం నుంచి త్వరలో అత్యంత సమర్థవంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ రానుందని, దాన్ని కూడా ఇక్కడే మోహరిస్తామని వివరించాయి. కాగా, వాస్తవాధీన రేఖకు అతి సమీపంలోని సమస్యాత్మక సెక్టార్లు అయిన దౌలత్‌బేగ్‌ ఓల్డీ, గల్వాన్‌ వ్యాలీ, పెట్రోలింగ్‌ పాయింట్‌ 14, 15, 17, 17ఏ తదితరాల్లో చైనా హెలికాప్టర్లు తిరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక, చైనా దశాబ్దాల తరబడి భారీ మూల్యం చెల్లించక తప్పదని మాజీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ అన్నారు. చైనా ఒంటరి అవుతోందని మాజీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుబ్రతా సాహా అభిప్రాయపడ్డారు. చైనా దూకుడును ఇరుగుపొరుగు దేశాలపై భారీ మిలటరీ దాడిగా అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు టెడ్‌ యోహో అభివర్ణించారు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి దౌత్య మార్గాలనే ఉపయోగించాలని ఇండియన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డాక్టర్‌ అమీ బెరా సూచించారు. వాస్తవాధీన రేఖపై చైనా దాడిని పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులోని రాజకీయ కార్యకర్త, గ్లాస్‌గోలో అజ్ఞాతంలో ఉన్న అమ్జాద్‌ ఆయుబ్‌ మీర్జా తీవ్రంగా ఖండించారు. గిల్గిత్‌, బాల్టిస్థాన్‌ ప్రజలు భారత్‌కే మద్దతు పలుకుతున్నారని చెప్పారు.

తీర దేశాలదే దక్షిణ చైనా సముద్రం: ఆసియా దేశాల

దక్షిణ చైనా సముద్రంలో చేపలు పట్టడం, ఇంధన వనరులను తోడుకునే హక్కు తీర దేశాలకు ఉంటుందని ఆసియాన్‌ దేశాలు స్పష్టం చేశాయి. దక్షిణ చైనా సముద్ర జలాలన్నీ గంపగుత్తగా తనవేనంటున్న చైనా వాదనకు భిన్నంగా స్పందించాయి. పది దేశాల ఆసియాన్‌ వార్షిక సమావేశం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. అనంతరం వియత్నాం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ చైనా సముద్రంపై సార్వభౌమత్వ హక్కులు, అధికారాలకు 1982 ఐక్యరాజ్యసమితి సముద్రాల ఒప్పందమే ప్రాతిపదిక అని దక్షిణాసియా దేశాల నాయకులు స్పష్టం చేశారు. సముద్ర జలాల్లో సార్వభౌమత్వ హక్కులు, చట్టబద్ధ అధికారాలు, పరిధికి సంబంధించి 1982లో కుదుర్చుకున్న యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ద లా ఆఫ్‌ ద సీ (యూఎన్‌సీఎన్‌వోఎ్‌స) ప్రాతిపదిక అని తేల్చి చెప్పారు. తద్వారా, దక్షిణ చైనా సముద్రమంతా తమదేనన్న చైనా వాదనను తీవ్రంగా ఖండించాయి.

 

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

   19 minutes ago


భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

   2 hours ago


ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

   3 hours ago


ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

   8 hours ago


భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

   9 hours ago


భారత్‌పై దుందుడుకు వైఖరి..  చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

భారత్‌పై దుందుడుకు వైఖరి.. చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

   9 hours ago


భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

   04-07-2020


భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

   04-07-2020


రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

   04-07-2020


చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

   04-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle