newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

10-08-202010-08-2020 14:45:03 IST
Updated On 10-08-2020 14:44:56 ISTUpdated On 10-08-20202020-08-10T09:15:03.412Z10-08-2020 2020-08-10T09:09:33.333Z - 2020-08-10T09:14:56.885Z - 10-08-2020

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అన్ని మార్గాలను వారు ఎంచుకుంటున్నారు. తాజాగా ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓడరేవుకు సమీపంలో కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో రూ. 1000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. 191 కిలోల డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. హెరాయిన్‌ను అక్రమంగా రవాణ చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఈ అక్రమాలకు పాల్పడిన నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. భారీగా డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయని సమాచారం అందడంతో దాడులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్‌ను నిందితులు తీసుకొచ్చారని అధికారులు తెలిపారు.

ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టిక్ పైపులకు వెదురు రంగు వేసి ఆయుర్వేద మందులంటూ స్మగ్లర్లు దిగుమతి చేసేందుకు ప్రయత్నించారు. అనుమానం రావడంతో వారి గుట్టురట్టయింది. చూడడానికి వెదురు పైపుల్లా అనిపించినా.. అవి తరచి చూస్తే గానీ అందులో వున్నవి డ్రగ్స్ అని తెలీదు. స్మగ్లర్ల తెలివితేటలకు చెక్ చెప్పారు కస్టమ్స్ అధికారులు. 

రాజస్థాన్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయని పోలీసులు తెలిపారు.మొత్తం 2.74 కిలో గ్రాముల నిషేధిత హెరాయిన్, పాకిస్తాన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. పాకిస్తాన్ నుంచి ఈ కరెన్సీ ఇండియాలో వస్తోందన్న సమాచారంతో దాడులు చేశారు. మొత్తం వీటి విలువ 3 కోట్లకు పైమాటే. బర్మార్ ఎస్పీ ఆనంద్ శర్మ, ఆయన టీం దాడులు చేసింది.

ఈ కేసుకి సంబంధించి 5గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. బన్వార్ గ్రామంలో ఖండు ఖాన్ ఇంటిపై దాడులు నిర్వహించగగా 1.74 కేజీల హెరాయిన్ దొరికింది. ములారాం బ్రమాలా విలేజ్ కి చెందిన వ్యక్తి అని అతని మరోపేరు ఖండు ఖాన్ అని పోలీసులు వెల్లడించారు. రామ్ ఇంటి నుంచి కేజీ హెరాయిన్ పట్టుబడింది.  

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

   2 hours ago


బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

   2 hours ago


దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

   2 hours ago


భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

   4 hours ago


బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

   5 hours ago


బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

   16 hours ago


ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

   a day ago


కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

   29-09-2020


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

   29-09-2020


నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

   29-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle