newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

వెంటిలేటర్లు లేని న్యూయార్క్.. ఆరు రోజుల్లో స్టాక్ అవుట్

07-04-202007-04-2020 15:03:48 IST
2020-04-07T09:33:48.906Z07-04-2020 2020-04-07T09:33:46.612Z - - 09-08-2020

వెంటిలేటర్లు లేని న్యూయార్క్.. ఆరు రోజుల్లో స్టాక్ అవుట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వాషింగ్ట‌న్ డీసీ క‌రోనా కాటుకు అగ్ర‌రాజ్యం అమెరికా చిగురుటాకులా వ‌ణికిపోతుంది. ఇంత‌కంత‌కూ పెరుగుతున్న కోవిడ్‌-19 కేసులు, మ‌ర‌ణాలతో  అమెరికా అల్లాడుతోంది. ముఖ్యంగా న్యూయార్క్‌లో క‌రోనా బాధితులు ఎక్కువ‌. రాష్ట్రంలో వెంటిలేట‌ర్ల కొర‌త ఉంద‌ని, రాబోయే ఆరు రోజుల‌కు స‌రిప‌డా వెంటిలేట‌ర్లు మాత్ర‌మే ఉన్నాయ‌ని గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. రాబోయే రోజుల్లోనూ కావాల్సిన‌న్ని వెంటిలేట‌ర్ల‌ను అందించే స్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌ని తాను భావించ‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌భుత్వం గ‌త‌వారం న్యూయార్క్ న‌గ‌రానికి 400 వెంటిలేట‌ర్ల‌ను అందించింది. ఇప్ప‌టికే 2,200 వెంటిలేట‌ర్లు స్టాక్‌లో ఉన్నా అంత‌కంత‌కూ పెరుగుతున్న క‌రోనా బాధితుల‌కు ఇవి స‌రిపోవ‌డం లేద‌ని ఆండ్రూ తెలిపారు. ప్ర‌తిరోజు దాదాపు 350 మంది కోవిడ్‌-19 బాధితులు ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్నార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వారికి చికిత్స అందించేందుకు త‌గినంత హాస్పిట‌ల్స్‌, వైద్య‌సిబ్బంది, వైద్య ప‌రికరాలు లేవ‌ని పేర్కొన్నారు. 

అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య ఇప్ప‌టికే 3 ల‌క్ష‌లు దాటేసింది. జావిట్స్ సెంటర్ మరియు బ్రూక్లిన్ క్రూయిజ్ టెర్మినల్ వంటి ప్రదేశాలలో తాత్కాలిక ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు ఆండ్రూ క్యూమా ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా, వ‌చ్చే వంద రోజుల్లో 1,00,000 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచనున్నట్టు మార్చి 27న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్ప‌టికే వీటి త‌యారీ కోసం వివిధ సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇత‌ర దేశాల‌కు కూడా వెంటిలేట‌ర్ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 

కరోనా బారినపడి విలవిలలాడుతున్న న్యూయార్క్‌ నగరంలో ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు తప్పకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న హోమ్ మేడ్ మాస్క్‌లను తప్పకుండా ధరించాలని నగర మేయర్ సూచించారు. మన ముఖాలకు మాస్క్‌లు ధరించినప్పుడే మనమే కాకుండా ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడుకోగలం అని బిల్ డె బ్లాసియో చెపపారు. అది స్కార్ఫ్ కావచ్చు, ఇంటిలోనే తయారు చేసుకున్న ఏరకమైన మాస్క్ అయినా కావచ్చు.. ప్రతిదీ వాడుకోవచ్చు. ఆరోగ్య వైద్య సిబ్బందికి అవసరమైన సర్జికల్ మాస్క్‌లను తప్పకుండా వాడాల్సిన అవసరం లేదు.

కరోనా వైరస్‌‌కు ఇప్పటికే గురై కూడా ఫ్లూ వంటి లక్షణాలు బయటపడని వ్యక్తుల వల్లే కొత్తగా 10 శాతం వరకు ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయని సింగపూర్ పరిశోధకుల అధ్యయనంలో తేలడంతో అమెరికా అప్రమత్తమైంది. పలునగరాల మేయర్లు ఈ అధ్యయనాన్ని గుర్తు చేస్తూ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించే బయటకు రావాలని కోరారు.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle