newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

వీసాల నిలిపివేత భారత్‌కు భారం.. డ్రాగన్‌కు వరం.. ఐటీ నిపుణుల్లో కలవరం

28-06-202028-06-2020 07:15:29 IST
2020-06-28T01:45:29.648Z28-06-2020 2020-06-28T01:45:03.316Z - - 11-08-2020

వీసాల నిలిపివేత భారత్‌కు భారం.. డ్రాగన్‌కు వరం.. ఐటీ నిపుణుల్లో కలవరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వీసాల నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అగ్రరాజ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు భారత ప్రొఫెషనల్స్‌కు ఆటంకం కాగా ఇవి చైనాకు వరంలా మారతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీసాల నిలిపివేత నిర్ణయం అమెరికన్లకు ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఏమాత్రం ఉపయోగపడదని లాస్‌ఏంజెల్స్‌ టైమ్స్‌ హెచ్చరించింది. 

ట్రంప్‌ నిర్ణయం చైనాకు మాత్రమే ఉపకరిస్తుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ స్పష్టం చేసింది. సింథటిక్‌ ఇంటెలిజెన్స్‌, సెమీకండక్టర్స్‌, బయోటెక్‌ రంగాల్లో చైనా నైపుణ్యాలతో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో వారే పాతుకుపోతారని, అధ్యక్షుడి నిర్ణయంతో హువాయి, బైదు, టెన్సెంట్‌ వంటి డ్రాగన్‌ కంపెనీలకు మేలు చేకూరుతుందని వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఇక బహుళజాతి సంస్థలు అమెరికాకు విదేశీ మేనేజర్లను రప్పించే వెసులుబాటు లేకుంటే ఈ ఉద్యోగాలను విదేశాలకే తరలిస్తాయని, అమెరికన్లకు అవకాశాలు అందుబాటులో ఉండవని వ్యాఖ్యానించింది. 

అమెరికన్ల ఉద్యోగాలు కాపాడేందుకు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అత్యంత నైపుణ్యాలతో కూడిన విదేశీ ప్రొఫెషనల్స్‌ను కలవరపాటుకు గురిచేసింది. తమ భవిష్యత్‌పై పలువురు ప్రొఫెషనల్స్‌లో గుబులు మొదలైంది. మరోవైపు హెచ్‌1బీ వీసాదారులపై ఆధారపడిన వారి భాగస్వాములు అత్యవసరంగా భారత్‌కు వచ్చిన క్రమంలో తిరిగి అమెరికాలో అడుగుపెట్టేందుకు అనుమతించాలని అమెరికన్‌ అధికారులను కోరతున్నారు. వీసాల నిలిపివేతపై ట్రంప్‌ ఉత్తర్వులపై విశ్లేషకుల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హెచ్‌-1బీ రద్దుతో యూఎస్‌ కంపెనీలకే అధిక‌ నష్టం !

హెచ్‌-1బీతో పాటు ఇతర నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేయడంతో అధిక నైపుణ్యం కలిగిన ఆసియా దేశాల వృత్తి నిపుణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, ఇదే సమయంలో వలస కార్మికులపై ఆధారపడిన అమెరికా కంపెనీలకు నష్టం కలుగుతుందని ఆ దేశ చట్టసభల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్‌-1బీతోపాటు ఇతర విదేశీ వర్క్‌ వీసాలను 2020 చివరి వరకు రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 

అమెరికా ఆర్థిక వ్యవస్థకు వలసదారుల అవసరం ఎంతో ఉందని అమెరికన్‌ కాంగ్రెస్‌ చట్ట సభ్యురాలు జూడీ చూ అన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనుకుంటే వలసదారులను అడ్డుకోవద్దని సూచించారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle