newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

విషాదం.. ఉన్నావ్ బాధితురాలి మృతి

07-12-201907-12-2019 07:31:26 IST
2019-12-07T02:01:26.720Z07-12-2019 2019-12-07T02:01:12.801Z - - 03-08-2020

విషాదం.. ఉన్నావ్ బాధితురాలి మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన దేశంలో అమ్మాయిలకు సరైన రక్షణ లేదని అనేక ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో జరిగిన దిశ ఘటన చేదు గురుతులు చెదిరిపోకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి చెందింది. తీవ్రమయిన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఢిల్లీలో కన్నుమూసింది. 

గడచిన రెండు రోజులుగా ఆమె మృత్యువుతో పోరాటం చేసింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స నిర్వహించారు. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు చికిత్స అందించిన సంగతి తెలిసిందే.  దుండగులు అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టారు. 

నిందితుల బంధువులు బెదిరిస్తున్నారంటూ బాధితురాలి కుటుంబ సభ్యుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చిలో ఇద్దరు వ్యక్తులపై ఆమె ఈ కేసు దాఖలు చేశారు. ఆమెకు నిప్పు పెట్టారనే అనుమానంతో ఈ ఇద్దరు నిందితులు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న ఆమె రాత్రి 11.40కి చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

నిర్భయ లాంటి చట్టం ఉన్నా బాధితురాలు మాత్రం నిందితులకు శిక్ష పడకుండానే కన్నుమూసింది. ఆమెపై అత్యాచారం చేసి, తాజాగా కిరోసిన్ దాడి చేసిన దుర్మార్గులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఉన్నావ్ బాధితురాలిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేశారు.  ఐదుగురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేశారు. యూపీ ప్రభుత్వం ఈ రేప్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 

ఒకవైపు ఘోర ఘటన అనంతరం నుంచి బాధితురాలిని విధి వెంటాడుతూనే వుంది. ఈఏడాది జూలై 29న ఉత్తర్ ప్రదేశ్‌ రాయ్‌బరేలీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఉన్నావ్ అత్యాచార కేసులో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు మరణించారు. 

Image result for unnav victim died

లోక్ సభలో రగడ

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 23 ఏళ్ళ బాధితురాలిపై 2018 డిసెంబరులో నిందితులు అత్యాచారం చేశారు. అప్పటి నుంచీ ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని సజీవంగా తగలపెట్టేందుకు ప్రయత్నించిన ఘటనపై శుక్రవారం లోక్‌సభ అట్టుడికింది. చర్చ సందర్భంగా పలువురు సభ్యులు హైదరాబాద్‌లో దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను కూడా ప్రస్తావించారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు.. ఆమెను బెదిరిస్తున్న తీరులో వ్యవహరించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. బాధితురాలిని కోర్టుకి వెళ్లకుండా అడ్డుకున్న నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle