newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు

09-12-201909-12-2019 14:26:50 IST
2019-12-09T08:56:50.034Z09-12-2019 2019-12-09T08:56:46.216Z - - 11-08-2020

విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టూంజీ మిస్ యూనివర్శ్-2019 కిరీటాన్ని దక్కించుకున్నారు.  మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్‌ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలోని టైలర్‌ పెర్రీ స్టూడియోస్‌లో జరిగిన ఈ అందాల పోటీలకు పాపులర్‌ టీవీ పర్సనాలిటీ స్టీవ్‌ హార్వే హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఏడుగురు మహిళలతో కూడిన బృందం ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించింది. ఫైనల్‌లో ప్యూర్టో రికన్‌, మెక్సికన్‌ భామలను వెనక్కి నెట్టి జోజిబినీ తుంజీ విజేతగా నిలిచినట్లు వారు ప్రకటించారు. 

ఈ క్రమంలో తుంజీ మాట్లాడుతూ... ‘అచ్చం నాలాగే కనిపించే మహిళలు ఉన్న ప్రపంచలో నేను పెరిగాను. వారిది కూడా నాలాంటి శరీర వర్ణమే. శిరోజాలు కూడా నా వంటివే. అయితే మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ సౌందర్యరాశులుగా పరిగణించలేదు. నేటి నుంచి ఆ భావన తొలగిపోతుందనుకుంటున్నా. అలా అనుకునే వాళ్లు నా ముఖం చూడండి. నా ముఖంలో ప్రతిబింబిస్తున్న మీ ముఖాలు చూసుకోండి’ అని తన దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపారు. 

అనంతరం మిస్‌ యూనివర్స్‌-2018 కాట్రియోనా గ్రే(ఫిలిప్పైన్స్‌) తుంజీకి విశ్వ సుందరి కిరీటం అలంకరించగా.. తుంజీ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఇంకా చేయాల్సి చాలా ఉంది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

26 ఏళ్ల జోజిబిని టుంజీ చాలాకాలంగా జెండర్ ప్రాతిపదికన జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్నారు. తన మిస్ యూనివర్స్ బయోడేటా వివరాల ప్రకారం, లింగ ప్రాతిపదికన జరుగుతున్న  ప్రతికూల ప్రచారాన్ని సవాలు చేస్తూ ఆమె సోషల్ మీడియా క్యాంపెయిన్‌లో ఆమె నిబద్ధతతో పోరాడుతున్నారు. సహజ సౌందర్యాన్ని ప్రోత్సహించడంలో ఆమె ముందున్నారు. మహిళలు తామెలా ఉన్నారో అలాగే తమను తాము ప్రేమించుకోవాలన్నది ఆమె అభిప్రాయం.

మిస్ యూనివర్స్‌ కిరీటం గెలుచుకోవడానికి ముందు ఆమెకు వేసిన ప్రశ్న.. నేటి యువతులకు మీరు బోధించే అతి ముఖ్యమైన విషయం ఏమిటి? ఈ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం షాక్ కలిగించింది. ఈ సంవత్సరం నేను కనుగొన్న కొత్త విషయం ఏమిటంటే, విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్న ప్రతి అభ్యర్థికీ.. శ్రోతలు, జడ్జీల ముందు తన తుది ప్రకటన చేసే అవకాశం కల్పించడమే అన జోజుబిని సమాధానం చెప్పారు. కనీసం విశ్వసుందరి పోటీల్లో అయినా లింగ వివక్షత కనిపించడం లేదన్నది దాని అంతరార్థం.

ఆమె సమాధానంతో పోటీలు జరిగిన ప్రాగంణంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ చిన్న సమాధానం ఆమెను విశ్వసుందరిగా పట్టం గట్టందనడంలో సందేహం లేదు మరి.

జోజిబినితో పాటు 20 మంది సుందరీమణులు సెమీ ఫైనల్స్ వరకూ చేరారు. ఈ పోటీలకు బారత్ నుంచి వర్తికా సింగ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే వర్తికా సింగ్ టాప్-10లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   2 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   13 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle