newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

వియత్నాం ఎందుకు సక్సెస్ అయింది?

29-03-202029-03-2020 09:06:03 IST
2020-03-29T03:36:03.432Z29-03-2020 2020-03-29T03:35:55.924Z - - 09-08-2020

వియత్నాం ఎందుకు సక్సెస్ అయింది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచానికి సవాలుగా మారింది కరోనా వైరస్. ఈ వైరస్ చైనాలో తగ్గినా ఇటలీ, స్పెయిన్, అమెరికాలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అమెరికాలో మరణాల సంఖ్య క్రమేపీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే సౌత్ కొరియా, రష్యాతో పాటు చిన్నదేశం వియత్నాం కరోనాను జయించింది. ఎనభై లక్షల మంది జనాభా.. చాలా చిన్న దేశం.. కానీ పెద్ద సమస్యను అవలీలగా ఎదుర్కొంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విషపు కోరల నుంచి చాలా తేలిగ్గా తప్పించుకోగలిగింది. అగ్రదేశాలకు ఆదర్శంగా నిలిచిన ఆ చిన్న దేశం గురించి తెలుసుకోవాలని వుందా..?

వియత్నాం.. చాలా చిన్న దేశం.. కరోనాను ప్రపంచానికి అంటించిన చైనాకు పొరుగునే వున్న దేశం. ఒక న‌గ‌రంతో సమానమైన ఈ దేశపు జ‌నాభా చూస్తే.. కేవలం 8 మిలియ‌న్లు. అగ్రదేశం అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా దెబ్బకి విలవిలలాడిపోతుంటే.. వియత్నాం మాత్రం ఆ రాక్షసిని విజయవంతంగా తిప్పికొట్టగలిగింది. ఇట‌లీ, జ‌ర్మనీ, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, ఇరాన్.. ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలేవీ క‌రోనా మహమ్మారిని నియంత్రించలేక నిట్టూరుస్తుంటే.. వియ‌త్నాం విజ‌య‌వంతంగా క‌ట్టడి చేయగలిగింది. ఇక్కడ కేసులు ఇప్పటికీ వంద‌ల్లోనే ఉన్నాయి. వియ‌త్నాం ప్రభుత్వ వ‌ర్గాల సమాచారం ప్రకారం  మృతుల సంఖ్య సున్నా. వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఈ చిన్నదేశం క‌రోనాను ఎలా క‌ట్టడి చేసింది? 

2019 చివ‌రి నాళ్లలో క‌రోనా మ‌హ‌మ్మారి వెలుగుచూసింది. చైనాలోని వుహాన్‌లో దీని తొలి జాడ ప్రపంచానికి తెలిసింది. దీనిపై చైనా పూర్తిగా అధ్యయనం చేయ‌క‌ముందే పొరుగునే వున్న వియ‌త్నాం ఈ ప్రమాదాన్నితొందరగానే ఊహించింది.

నూత‌న‌ సంవ‌త్సరం తొలిరోజుల్లో తక్షణ కట్టడి చర్యలు ప్రారంభించింది. వియ‌త్నాంలో క‌మ్యూనిస్టు పార్టీ అధికారంలోవ ది. ప్రభుత్వ ముఖ్యులు కొందరు ముందుగానే పసిగట్టి క‌రోనా తమ దేశంలో రాకుండా గట్టి నియంత్రణ చర్యలు చేపట్టారు. ఒకవేళ కరోనా వ్యాధి వ్యాపిస్తే వైద్య సౌక‌ర్యాలు అంతంత‌మాత్రంగానే ఉన్న ప‌రిస్థితుల్లో ఎదుర్కోవడం కష్టమని అక్కడి పాలకులు అంచ‌నా వేశారు. వెంట‌నే చైనాతో ఉన్న స‌రిహద్దును దాదాపుగా మూసివేశారు. చైనాలోని లాక్‌డౌన్ జ‌న‌వ‌రి 20 త‌ర్వాత ప్రారంభమైతే... జ‌న‌వ‌రి 1 నుంచే వియ‌త్నాంలోని ప‌లు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమ‌లు చేశారు.

వియ‌త్నాంలో వైద్య సిబ్బంది కొరత బాగా వుంది. దానికి తోడు వైద్యరంగానికి నిధుల కేటాయింపు కూడా  చాలా త‌క్కువ‌. దేశ రాజ‌ధాని న‌గ‌రం హోచిమిన్ సిటీలో ఐసీయూ ప‌డ‌క‌ల సంఖ్య వేయిలోపే వున్నాయి. కరోనా నియంత్రణకు పాలకులు వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు. మొద‌ట‌గా వ్యాధిగ్రస్తులను గుర్తించ‌డం ప్రారంభించారు. వారిని క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించారు. బాధితులు ఎవ‌రెవ‌రితో స‌న్నిహితంగా ఉన్నారో ఆచూకీ తెలుసుకొన్నారు. వారిని క‌నుగొని ప‌రీక్షలు నిర్వహించారు. ఇది ఒక ఉద్యమంలా సాగింది. 

వియ‌త్నాం దేశంలో అధికార క‌మ్యూనిస్టు పార్టీ స‌భ్యులు అత్యంత ప్రభావితమైన వ్యక్తులు. ప్రభుత్వంలో వారి పాత్ర చాలా కీల‌కం. వీరు నిఘా వ్యవహారాలు నిర్వహించి బాధితుల‌ను క‌నుగొన‌డంలో ముఖ్య భూమిక తీసుకున్నారు. ఫస్టు.. దేశంలో అనేక‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. మూడు వారాలు, నాలుగు వారాలు లాక్‌డౌన్ పాటించారు. కొత్తగా కేసులేవీ నమోదు కాలేదు. దాంతో లాక్‌డౌన్ ఎత్తివేశారు.

కాకపోతే.. నిఘా మాత్రం కొన‌సాగేది. కరోనా బాధితులు తిరిగిన మార్గాల్ని తెలుసుకుని వారు ఎవరెవర్ని క‌లుసుకున్నారో కనిపెట్టి వారిని నాలుగు అంచెలుగా విభజించారు. అంద‌రికి ప‌రీక్షలు నిర్వహించారు. గృహ నిర్భంధం విధించారు. కొందర్ని అవసరాన్ని బట్టి క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించారు.

ప్రజలు ఇంటిలో ఉంటే దేశానికి సేవ‌ చేసిన‌ట్టేన‌ని ప్రభుత్వం బాగా ప్రచారం చేసింది. దాదాపు అది ఒక నినాదంగా మారింది. విస్తృతంగా శానిటైజ‌ర్లు వాడారు.  మాస్కుల‌ను విరివిగా స‌ర‌ఫ‌రా చేశారు.. ఈ లాక్‌డౌన్‌లో అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి.

దేశ ఆర్థిక‌రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వం అనేక ఉద్దీప‌న ప‌థకాల‌ను ప్రకటించింది. ప్రస్తుతం భారత్ కూడా వియత్నాం చూపిన బాటలోనే వెళుతోంది. చైనాకు దూరంగా ఎన్నో వేల‌ మైళ్ల దూరంలో ఉన్న అమెరికా వంటి అగ్ర దేశాలు కూడా క‌రోనా ప్రభావంతో కంగారుపడుతుంటే పొరుగునే వున్న వియ‌త్నాం మాత్రం ముందు చూపుతో వ్యాధిని కట్టడి చేయగలిగింది. ఇప్పటికీ వియ‌త్నాంలో పాజిటివ్ కేసుల సంఖ్య 200 కూడా దాట‌లేదు. మ‌ర‌ణాలు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అదీ వియత్నాం విజయ రహస్యం.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle