విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-202006-07-2020 11:07:13 IST
Updated On 06-07-2020 12:34:35 ISTUpdated On 06-07-20202020-07-06T05:37:13.651Z06-07-2020 2020-07-06T05:37:00.739Z - 2020-07-06T07:04:35.301Z - 06-07-2020

కరోనాతో దేశంలో విద్యారంగం సంక్షోభంలో పడింది. పరీక్షలు రద్దయిపోయి గ్రేడ్ ల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తున్నారు. రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో కీలక మార్పులు రాబోతున్నాయి. కేంద్రం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆన్లైన్ క్లాసులు వినాలన్నా, కోర్సులు విజయవంతంగా పూర్తి చేయాలన్నా విద్యార్థులకు సొంతంగా డిజిటల్ డివైజ్‌లు అవసరం ఉంటుంది. దీంతో రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందించాలని మానవ వనరుల అభివృద్ది శాఖ ప్రతిపాదించింది. వచ్చే ఐదేళ్లలో దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో ఎన్రోల్ అయ్యే విద్యార్థుల్లో 40 శాతం మందికి ఉచితంగా డిజిటల్ డివైజ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2025-26 నాటికి దేశంలోని 4 కోట్ల మంది స్టూడెంట్స్‌కి ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్, ఫోన్స్, టెలివిజన్ సెట్స్ లాంటివి అవసరం అవుతాయి. వీటిని రెడీచేయనుంది. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ లో భాగంగా వీటిని భారతీయ సంస్థలు తయారుచేయనున్నాయి. ఈ డిజిటల్ ప్రాజెక్ట్ కోసం రాబోయే ఐదేళ్లకు గానూ రూ.60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.36,473 కోట్లను ఖర్చు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు భరించాలి. దీని ద్వారా 4 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల కోసం స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు కొనుగోలు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కరోనా సంక్షోభం వల్ల ఉపాధి కోల్సోయారు అనేకమంది. దీంతో వారికి పిల్లల చదువులు కష్టంగా మారాయి. తాజాగా కేంద్రం ఆలోచన వారికి ఊరట నిచ్చేలా వుంది.

మాల్దీవులు, నేపాల్ సహా ఆరు దేశాలకు భారతీయ వ్యాక్సిన్లు
3 hours ago

జాక్ మా కనిపించాడుగా..!
3 hours ago

న్యాయవాది నుంచి ఉపాధ్యక్షురాలి దాకా 'కమల హ్యారిస్' ప్రయాణం
3 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 13,823 మందికి కరోనా
4 hours ago

రిపబ్లిక్ డే 'ట్రాక్టర్ ర్యాలీ'కి సన్నాహాలు..
5 hours ago

నేడే జో బైడన్, కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం..
5 hours ago

ఒక విషాదం మరవకముందే మరొకటి.. పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..!
6 hours ago

వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం
16 hours ago

సరిహద్దుల్లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా.. మోడీ ఏం చేస్తారో!
21 hours ago

హింస సమాధానం కానేకాదు.. మెలనియా ట్రంప్ వీడ్కోలు సందేశం
a day ago
ఇంకా