newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

విదేశాల నుంచి స్వదేశానికి .. ఎన్నారైలకు ఊరట

18-05-202018-05-2020 12:44:14 IST
Updated On 18-05-2020 12:52:33 ISTUpdated On 18-05-20202020-05-18T07:14:14.990Z18-05-2020 2020-05-18T07:13:59.599Z - 2020-05-18T07:22:33.872Z - 18-05-2020

విదేశాల నుంచి స్వదేశానికి .. ఎన్నారైలకు ఊరట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో వున్న తమ దేశస్తులను వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లుచేశాయి. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. చికాగో నుంచి రానున్న తొలి విమానంలో 33మంది శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. 

అక్కడి నుంచి వారందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి తర్వాత ఇళ్లకు పంపిస్తారు. మరోవైపు విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత నౌకాదళం ఆపరేషన్‌ ‘సముద్ర సేతు’ చేపట్టింది. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు ఉద్దేశించిన ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది.

ఇందులో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకురావడానికి ఐఎన్‌ఎస్‌ జలాశ్వ అక్కడికి చేరుకుంది. వివిధ ప్రాంతాలకు చెందిన 518 మంది భారతీయులు అందులో ఎక్కారు. ఈనెల 12న ప్రారంభించిన ‘‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సముద్ర సేతు ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1”లో భాగంగా ఇప్పటి కే 698 మంది మనవాళ్లను మాల్దీవుల నుంచి ఇక్కడకు తీసుకొచ్చారు.

వాతావరణం అనుకూలించకపోయినా గంటకు 40 నాటికల్‌ మైళ్ల వేగంతో నౌక ప్రయాణిస్తోంది. వారందరినీ కేరళలోని కోచ్చికి తీసుకొచ్చి, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపుతారని నేవీ వర్గాలు తెలిపాయి. ఇటు మనదేశంలో లాక్ డౌన్ నేపధ్యంలో చిక్కుకుపోయిన విదేశీయులను తరలింపు కొనసాగుతుంది. మొత్తం 588 మంది ప్ర‌యాణికుల‌లో ఆరుగురు గ‌ర్భిణిలు మరియు 21 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మాలే వ‌ద్ద 30 -40 నాట్ల ఈదురు గాలులు, భారీవ‌ర్షం నేప‌థ్యంలో కూడా ఓడలోని సిబ్బంది తిరుగు ప్రయాణానికి కావాల్సిన అన్ని చ‌ర్య‌లనూ పూర్తి చేశారు.

ప్రయాణీకుల భద్రత మరియు వైద్య ప్రోటోకాల్‌లను అవ‌లంభిస్తూ అన్ని ర‌కాల ఫార్మాలిటీలను పూర్తి చేశారు. ప్ర‌యాణించిన ప్రాంతాల‌ను ప్రత్యేక శ్రద్ధతో క్రిమిసంహారకం చేయ‌డంతో పాటు శానిటైజేషన్ ప్రక్రియ చేప‌ట్టారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు కొచ్చి ఓడరేవుకు చేరుకుంది. ఇందులో కేరళకు చెందిన 568 మంది మహిళలు, తమిళనాడుకు చెందిన 15 మంది, తెలంగాణకు చెందిన ముగ్గురు, లక్షద్వీప్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు, ఇందులో 6 మంది గర్భిణీ స్త్రీలు ఉండగా, 21 మంది పిల్లలు ఉన్నారు. మాల్దీవుల నుండి తిరిగి వచ్చిన భారతీయులలో ఇది మూడవ బ్యాచ్.

తాజాగా హైదరాబాద్ లో చిక్కుకుపోయిన 79  మంది విదేశీయులను  ప్రత్యేక విమానంలో యుకె తరలించారు. యుకె కు చెందిన 79 మంది శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వారి స్వస్థలాలకు పంపారు. యుకె కన్సల్టెంట్లు తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో పూర్తిగా వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం విరందరిని స్వదేశాలకు తరలించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఎయిర్ ఇండియా AI 1840 విమానంలోవారు బయలుదేరి వెళ్లారు. లాక్‌డౌన్‌ సడలింపులతో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి భారీసంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. 

 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   8 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   11 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   15 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   17 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   19 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   20 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   20 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle