newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?

10-07-202010-07-2020 08:29:15 IST
2020-07-10T02:59:15.270Z10-07-2020 2020-07-10T02:58:53.256Z - - 09-08-2020

విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేర‌ళలో ప్ర‌భుత్వం ఏదైనా ఆరోప‌ణ‌లు త‌క్కువ‌. విద్యావంతులు, చైత‌న్యం అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో చిన్న విషయాలు కూడా ప్రజ‌ల్లోకి వెళ‌తాయి. రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ప‌నితీరు కూడా బాగా ఉంద‌నే అభిప్రాయం ఉంది. సామాన్య క‌మ్యూనిస్టుగా ఆయ‌న కేర‌ళ‌ను పాలిస్తున్నార‌నే ప్ర‌శంస‌లు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఒక కేసు పిన‌రయి విజ‌య‌న్‌కు మ‌ర‌క‌లు అంటించింది. ఆయ‌న రాజీనామాకై కేర‌ళ‌లో విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. కేర‌ళ‌ను కుదిపేస్తున్న గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు క‌థ ఇది.

ఈ మొత్తం గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో అస‌లు ముద్దాయి ఓ మ‌హిళ‌. ఆమె పేరు స్వ‌ప్న సురేష్‌. త్రివేంద్రం స‌మీపంలోని ఓ గ్రామానికి చెందిన స్వ‌ప్న సురేష్ తండ్రి దుబాయ్‌లో ఉద్యోగం చేసేవారు. పెద్ద‌గా చ‌దువుకోని స్వ‌ప్న చ‌రిత్ర అంతా నేర‌పూరిత‌మే. ఆమె బ‌యోడెటాలో ఓ టాలీవుడ్ సినిమాకు కావాల్సినంత విల‌నిజం ఉంది.

చ‌దువు రాక‌పోయినా ఆమె ఎదిగిన తీరు, నేరాలు చేసిన‌, చేయించిన వైనం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చ‌దువు పెద్ద‌గా రాక‌పోయినా ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం సంపాదించింది. దుబాయ్‌లోని త‌న తండ్రి వ‌ద్ద కూడా చాలా రోజుల పాటు ఉంది.

దీంతో ఆమె అర‌బిక్ భాష‌పై కూడా ప‌ట్టు సంపాదించింది. అర‌బిక్ భాష్‌పై ఉన్న ప‌ట్టుతో దుబాయ్‌లోనే ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం పొందింది. కేర‌ళ‌, అర‌బ్ దేశాల మ‌ధ్య ప్ర‌యాణాలు, స్మ‌గ్లింగ్‌కు అవ‌కాశాలు ఈ స‌మ‌యంలోనే గ‌మ‌నించింది. త‌ర్వాత భార‌త్ తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కూడా ట్రావెల్ రంగంలోనే కొన‌సాగింది. త‌న అనుభ‌వంతో ఎయిర్ ఇండియా శాట్స్ సంస్థ‌లో పెద్ద ఉద్యోగ‌మే సంపాదించింది. అయితే, ఏ ఉద్యోగం చేసినా స‌మాజంలో ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యం పెంచుకోవ‌డం, వారి ద్వారా మ‌రింత ఎత్తుకు ఎద‌గ‌డం స్వ‌ప్న సురేష్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ నేప‌థ్యంలో ఏకంగా ప్ర‌భుత్వ శాఖ‌లోకే అడుగుపెట్టింది.

ఐటీ శాఖ‌లో త‌న‌కు అనుభ‌వం ఉంద‌ని చెప్పి, తెలిసిన ఉన్న‌తాధికారుల స‌హాయంతో కేర‌ళ ఐటీ శాఖ‌లో పెద్ద ఉద్యోగంలో చేరింది. ఎయిర్‌పోర్టుల‌లో ప‌ని వ‌ల్ల యూఏఈ క‌న్సులేట్‌లో పీఆర్వోగా ప‌ని చేసే స‌రిత్ కుమార్ అనే వ్య‌క్తితో స్వ‌ప్న సురేష్‌కు స్నేహం ఏర్ప‌డింది. అప్ప‌టికే దుబాయ్ - కేర‌ళ మ‌ధ్య స్మ‌గ్లింగ్‌కు ఉన్న అవ‌కాశాల‌ను గుర్తించిన స్వ‌ప్న ఓ పెద్ద స్కెచ్ వేసింది.

యూఏఈ విదేశాంగ శాఖ నుంచి కేర‌ళ‌లోని యూఏఈ క‌న్సులేట్‌కు బంగారాన్ని పార్శిళ్ల రూపంలో పంపించేది. యూఏఈ విదేశాంగ శాఖ పార్శిళ్లు కాబ‌ట్టి ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీ చేసే వారు కాదు. కన్సులేట్‌కు ఈ పార్శిళ్లు చేరాక స‌రిత్ కుమార్ తీసుకొని బ‌య‌ట‌కు త‌ర‌లించేవాడు. ఇలా య‌థేచ్ఛ‌గా వీరి స్మ‌గ్లింగ్ సాగిపోయింది.

చివ‌ర‌కు 6వ తేదీన‌ క‌స్ట‌మ్స్ అధికారుల‌కు ఈ వ్య‌వ‌హారం తెలిసి రూ.15 కోట్లు విలువ చేసే 30 కిలోల అక్ర‌మ బంగారాన్ని ప‌ట్టుకున్నారు. దీంతో స్వ‌ప్న సురేష్ త‌న‌కు తెలిసిన పెద్ద‌ల ద్వారా ఒత్తిడి తెచ్చి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేసింది.

ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో శివ‌శంక‌ర్ అనే ఓ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ స్వ‌ప్న సురేష్‌తో స‌న్నిహితంగా ఉండేవాడు. ఆమె ఇంటికి కూడా ఆయ‌న వెళ్లి వ‌స్తుండేవాడు. ఆయ‌న స్వ‌ప్న సురేష్‌ను ఈ కేసు నుంచి త‌ప్పించ‌డానికి క‌స్ట‌మ్స్ వారిపై ఒత్తిడి చేశారు. ఈ వ్య‌వ‌హారం త్వ‌ర‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో విప‌క్షాలు, మీడియా గోల చేశాయి. స్మ‌గ్లింగ్ కేసులో నిందితురాలిని త‌ప్పించ‌డానికి సీఎం కార్యాల‌యం నుంచే ఫోన్లు వెళ్ల‌డం కేర‌ళ ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశంగా దొరికింది.

అస‌లు స‌ద‌రు స్వ‌ప్న సురేష్ ఎవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని పిన‌ర‌యి విజ‌య‌న్ అంటున్నారు. అంతేకాదు ఆమె కోసం ఫోన్ చేసిన అధికారి శివ‌శంక‌ర్‌ను స‌స్పెండ్ చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న ఏకంగా ప్ర‌ధానికే లేఖ రాశారు. ఇంత‌చేసినా పిన‌ర‌యి విజ‌య‌న్‌పై ఆరోప‌ణ‌లు ఆగ‌డం లేదు. ఆయ‌న రాజీనామా చేయాలంటే ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి.

ప్ర‌భుత్వం లాఠీఛార్జ్‌లు చేయిస్తోంది. అయితే, కేర‌ళ‌లో ఇంత ర‌చ్చ రాజేసిన ఆ స్వ‌ప్న సురేష్ ఇప్పుడు ప‌రారీలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆమె ఎక్క‌డ ఉందో వెతికి ప‌ట్టుకునేందుకు రాష్ట్ర‌, కేంద్ర ద‌ర్యాప్తు బృందాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   18 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle