newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

విజయ్ మాల్యా తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

22-01-202022-01-2020 09:36:00 IST
Updated On 22-01-2020 10:55:56 ISTUpdated On 22-01-20202020-01-22T04:06:00.327Z22-01-2020 2020-01-22T04:05:38.424Z - 2020-01-22T05:25:56.024Z - 22-01-2020

విజయ్ మాల్యా తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. మాల్యాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది రూపాయలతో పలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న మాల్యా ఇప్పటివరకూ కనీసం ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకపోవడాన్ని సర్వోన్నత న్యాయ స్థానం తీవ్రంగా తప్పు బట్టింది.

మాల్యా ఆస్తులను ఇప్పటికే ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటిని వేలం వేయడం ద్వారా బ్యాంకుల సొమ్మును రాబట్టుకోవచ్చునంటూ కర్ణాటక హైకోర్టు ఇదివరకే తీర్పునిచ్చింది. దీనిపై మాల్యా తరపున సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా..మాల్యా ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడాన్ని కోర్టు గుర్తించింది. మాల్యా తీరుపై తీవ్ర అభ్యంతరం, అసహనం వ్యక్తంచేసిందని సమాచారం. 

ఇదిలా ఉండగా, మాల్యా తరపున గతంలో సీనియర్ న్యాయవాది పాలీ నారిమన్ వాదించారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.

దీంతో కేసులో కీలకపరిణామం చోటుచేసుకుంది. రుణాలు చెల్లిస్తామని మాల్యా కంపెనీలు గత కొన్నేళ్ళుగా చెబుతున్నా ఒక్కరూపాయి కూడా చెల్లించకపోవడాన్ని కేంద్రం తరఫున న్యాయవాది తుషార్ మెహతా కోర్టుకి తెలిపారు. 9వేలకోట్లకు పైగా మాల్యా బ్యాంకులకు బాకీపడ్డాడు. 2019లో ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం మాల్యాను పరారీలో వున్న ఆర్థికనేరస్థుడిగా ప్రకటించింది. ఈ కేసు విచారణ కోసం త్వరలోనే కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీజే బాబ్డే పేర్కొన్నారు.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle