newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

వాళ్ల కాలినడకను మేమెలా ఆపగలం.. వలసబాటపై సుప్రీం

16-05-202016-05-2020 08:08:23 IST
Updated On 16-05-2020 09:02:05 ISTUpdated On 16-05-20202020-05-16T02:38:23.218Z16-05-2020 2020-05-16T02:38:21.016Z - 2020-05-16T03:32:05.888Z - 16-05-2020

వాళ్ల కాలినడకను మేమెలా ఆపగలం.. వలసబాటపై సుప్రీం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వలస కార్మికులు కాలినడకతో, సైకిల్ తొక్కుతూ తమ తమ స్వస్థలాలకు వెళుతుండటాన్ని తానెలా అడ్డుకోగలనని సుప్రీంకోర్టు నిస్సహాయతను వ్యక్తం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, పర రాష్ట్రాల్లో నిలువ నీడ లేక, ఆకలికి తాళలేక చావో బతుకో సొంత ఊళ్లలోనే తేల్చుకుందామని నిర్ణయించుకుని కాలినడకపై వలసకార్మికులు వందలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రమాదాల్లో మరణిస్తుండటంపై అలోక్ శ్రీవాస్తవ్ అనే లాయర్ వేసిన పిటిషన్‌ను విచారణకు తీసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

వలసకార్మికులను తామెలా అడ్డుకోగలం అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయా రాష్ట్రాలే ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందని, కేవలం పత్రికల్లో వార్తలను ఆధారంగా చేసుకుని ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది.

ఔరంగాబాద్‌లో 16 మంది వలస కూలీలు గూడ్స్ రైలు కింద పడి చనిపోయిన నేపథ్యంలో.. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు వారికి ఆహారం, వసతి జిల్లా యంత్రాంగాలే ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది. న్యాయవాద్ అలోక్ శ్రీవాత్సవ ఈ విషయాన్ని  సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దీనిపై జస్టిస్. ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ బెంచ్‌లో జస్టిస్ ఎస్‌కే కౌల్, బీఆర్ గవాయ్ కూడా సభ్యులుగా ఉన్నారు.

స్వస్థలాలకు కాలినడకను వెళుతూ వలసకార్మికులు రైలు, రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుని మరణిస్తున్న విషయాన్ని న్యాయవాద్ అలోక్ శ్రీవాత్సవ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఇది తమ పరిధిలోనిది కాదని ఈ విషయంపై రాష్ట్రాల ప్రభుత్వాలే తేల్చుకోవాలని సుప్రీకోర్టు తేల్చి చెప్పింది.

కాగా వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వమే అన్ని ప్రయాణ సదుపాయాలను ఏర్పాటు చేస్తోందనీ.. అయితే కార్మికులు కాలినడకన వెళ్లే బదులు తమ వంతు వచ్చే వరకు వేచి చూడాలని కేంద్రం సుప్రీం ధర్మాసనానికి నివేదించింది. 

‘‘వలస కార్మికులు రోడ్లపై కాలినడకన వెళ్లకుండా ఆపేందుకు ఏదైనా మార్గం ఉందా..?’’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై మెహాతా స్పందిస్తూ.. ‘‘వలస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్రాష్ట్ర ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేస్తున్నాయి. ప్రయాణం కోసం వేచిచూడకుండా ప్రజలు కాలినడకన వెళ్లడం మొదలు పెడితే ఏమీ చేయలేం...’’ అని పేర్కొన్నారు. 

వారిని కాలినడకన వెళ్లొద్దంటూ అధికారులు కేవలం అభ్యర్థన మాత్రమే చేయగలరనీ.. అలాకాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని మెహతా నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి ఒక్కరికీ తమ స్వస్థలాలకు వెళ్లే అవకాశం వస్తుందన్నారు. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో రైలుపట్టాల మీద పడుకుని నిద్రపోతున్న 16 మంది వలసకార్మికులపై గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో వారంతా మరణించడం దేశానికి షాక్ కలిగించింది. 

కోవిడ్-19 నేపథ్యంలో పనులు కోల్పోయిన వీరు ముంబై నుంచి మధ్యప్రదేశ్‌కు కాలినడక వెళుతూ అర్ధరాత్రి దాటాక రైలుపట్టాలమీదే పడుకుండిపోయిన సందర్భంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయనే విషయం తెలియక రోజంతా నడిచి అలిసిపోయి పట్టాలమీదే పడుకున్న ఘటనలో 16 మంది దేహాలు తునాతునకలైపోయాయి. 

దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో వలస కార్మికులు మరో దారిలేక కాలినడకతో వందలాది మైళ్లు నడవటం తప్పని స్థితిలో ఈ ఘోరం జరిగింది.

రాష్ట్రాలనుంచి ఒత్తిడితో కేంద్రం వలస కార్మికులను తగు జాగ్రత్తలతో రైళ్లలో పంపడానికి అంగీకరించింది. దీంట్లో భాగంగా దేశంలోని నలుమూలలకు శ్రామిక్ రైళ్లు వలస కార్మికులను తీసుకెళుతున్నాయి. అయినప్పటికీ పలువురు వలస కార్మికుల కాలినడకతోనే స్వస్థలాలకు బయలు దేరుతుండటం గమనార్హం.

తాజా సర్వే ప్రకారం గత 50 రోజుల్లో 450మందికి పైగా వలసకార్మికులు ఆకలికి తాళలేక, నడకతో డస్సిపోయి, శక్తి కోల్పోయి ఉన్నఫళంగా మరణించారని సమాచారం.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   2 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle