newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

వలస కూలీల ఆకలి బాధలు.. స్వంతూళ్ళకెళ్లేందుకు అష్టకష్టాలు

26-05-202026-05-2020 11:39:59 IST
Updated On 26-05-2020 12:18:44 ISTUpdated On 26-05-20202020-05-26T06:09:59.163Z26-05-2020 2020-05-26T06:08:52.568Z - 2020-05-26T06:48:44.266Z - 26-05-2020

 వలస కూలీల ఆకలి బాధలు.. స్వంతూళ్ళకెళ్లేందుకు అష్టకష్టాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పొట్టచేత బట్టుకుని ఊరు కాని ఊరు వచ్చారు. కరోనా వైరస్ రాకముందు బాగానే వుంది వారి జీవితం. కానీ కరోనా విజృంభించడంతో లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ఎక్కడివారు అక్కడే వుండిపోవాల్సి వచ్చింది. పనులు లేవు.. పస్తులుండలేక తమ సొంతూళ్ళకు వెళ్లేందుకు వారు చేయని ప్రయత్నం లేదు. ప్రారాణాలు దక్కించుకోవాలనే ఒకే ఒక్క ఆలోచన వాళ్ళని ఎలాంటి సాహసాలైనా చేయిస్తోంది. నదులైనా, నట్టడవులైనా.. వేల మైళ్ళ దూరాలైనా.. దారీతెన్నూ లేని తీరాలైనా.. వలస కార్మికులు వరస కట్టి మరీ పోతున్నారు. మాటలే తప్ప ప్రభుత్వాల నుంచి వారికి అందే సాయమే లేదు.

లాక్‌డౌన్‌ పొడిగించుకుంటూ పోతున్న కొద్దీ వలస కార్మికుల కష్టాలు కూడా పెరుగుతూ పోతున్నాయి. ప్రాణాలైనా దక్కించుకుందామనే ఆలోచనతో  సొంతూళ్లకు పోదామనుకుంటే దారే లేదు. ఇన్ని రోజుల తర్వాత కూడా సొంత ఊళ్ళు వెళ్లేందుకు వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పగటిపూట ఎండను భరించలేక, ఇతర కారణాల వల్ల వలస కార్మికులు రాత్రి సమయంలో నదులను దాటుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. 

హరియాణా నుంచి బిహార్‌లోని తమ సొంత గ్రామాలకు కాలినడకన వెళ్లేందుకు... సుమారు రెండువేల మందికి పైగా యమునా నదిని దాటేశారు. వీరు మొదట ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షహరన్‌పూర్‌కు, అక్కడినుంచి బిహార్‌ వెళ్లేందుకు కాలిమార్గంలో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో యమునా నదిని దాటి సొంతూళ్లకు వెళ్తున్నారు. యమునా నది ఉగ్రరూపం దాలిస్తే వారి పరిస్థితి ఏంటి? తమ తట్టాబుట్టా నెత్తిమీద పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. పీకల్లోతు నీళ్ళలో వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీకావు, 

ఇలాంటి వారికోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నప్పటికీ అందులో ప్రయాణించే అవకాశం లభించని వందలాది మంది కాలినడకనే బయలుదేరుతున్నారు. ఎండాకాలం కారణంగా నదిలో నీరు తక్కువగా ఉండటంతో తాము నదిని దాటి వెళ్తున్నామని వలస కార్మికులు చెబుతున్నారు. మా దగ్గర డబ్బు ల్లేవ్.. రోడ్డుపై వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని కొడుతున్నారు. అందుకే  రాత్రి పూట నదిని దాటుతున్నామని వీళ్ళు చెబుతుండటం చూస్తే కంట నీరు రాకమానదు. బిహార్‌ వరకు మేము నడిచే వెళ్తామని యమునానగర్‌లోని ఓ ప్లైవుడ్‌ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుడు చెబుతుండటం ప్రస్తుత పరిస్థితిని కళ్ళకు కడుతోంది.  

లాక్‌డౌన్‌ కారణంగా తమను యజమానులు పనుల నుంచి తొలగించారని... ఉన్న డబ్బు కాస్త అయిపోవటంతో తాము యమునానగర్‌లోని ఆశ్రయ కేంద్రంలో ఉన్నామని నదిని దాటిన వాళ్ళు చెబుతున్నారు.. తమకు ఆహారం లభించటం లేదని వీరిలో కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.  తమలో ఎక్కువ మంది అర్ధాకలితోనే నడక సాగిస్తున్నారని వారు వాపోయారు. సమీప గ్రామాల ప్రజలు కొందరు దయతలచి ఆహారం, మంచి నీరు ఇస్తున్నారని వారు తెలిపారు. 

మరోవైపు వలస కార్మికులందరినీ వారి గ్రామాలకు చేర్చేందుకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు ఊదరగొట్టేస్తున్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాలకులు హామీ ఇస్తున్నా వలస కార్మికుల ప్రయాణాలు ఆగడం లేదు. దీనికి కారణం ప్రభుత్వాల చర్యలు వారికి భరోసా కల్పించకపోవడమే. 

ఇదిలా వుంటే వలస కూలీల కోసం ప్రభుత్వం శ్రామిక రైళ్లను నడుపుతున్నా, ప్రయాణం సమయంలో సరిగా ఆహారం దొరకని పరిస్థితి. అలాంటి దయనీయ పరిస్థితికి ఉదాహరణే ఈ వీడియో. సొంతూళ్లకు వెళ్లేందుకు పలువురు వలస కూలీలు మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం డివిజన్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.  శ్రామిక్‌ ప్రత్యేక రైలు ఎక్కేందుకు వచ్చిన వీరంతా అక్కడకు వచ్చారు. ఆ రైలులో ప్రయాణించే వలస కూలీలకు అందించడానికి ప్యాక్‌ చేసిన ఆహారం, బ్రెడ్‌ మొదలైనవి అధికారులు ఒక ట్రాలీలో వేసుకొచ్చారు. 

అది చూసిన వెంటనే వలస కూలీలు దాని చుట్టూ గుమిగూడారు. రైలు ప్రయాణ సమయంలో ఇవ్వడానికి తెచ్చిన ఆహారమని ఇప్పుడు ఇవ్వమని అధికారులు చెప్పినా, ఒకరిద్దరు కూలీలు ధైర్యం చేసి ఆ ఆహారం ప్యాకెట్లను తీసుకున్నారు. అక్కడే ఉన్న మిగిలిన కూలీలు కూడా ఒక్కసారిగా ట్రాలీపై పడి, ఎవరి చేతికి దొరికిన ఆహారాన్ని వారు లాక్కునిపోయారు. ఒకరి చేతిలో ఉన్న ఆహారాన్ని మరొకరు తీసుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పలువురి మధ్య తోపులాట జరిగింది. ఈ చర్యతో ఒక్కసారిగా షాకైన అధికారులు వారి నుంచి దూరంగా జరిగిపోయారు.

వలస కార్మికుల కోసం రైల్వే అధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు.బిహార్‌లోని కతిహార్ రైల్వేస్టేషన్‌లో రైల్వే అధికారులు ఓ సంచిలో అందజేసిన కొద్దిపాటి బిస్కెట్లు, ఆహార పాకెట్ల కోసం వలస కార్మికులు పోటీపడ్డారు. రైలు బయలుదేరినప్పటి నుంచీ సరైన తిండి లేదు. రైల్వే స్టేషన్లలోనూ ఆహారం అందుబాటులో లేకపోవడంతో రైల్వే అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఏ మాత్రం వారికి సరిపోవడం లేదు.

జార్ఖండ్ వెళ్లేందుకు సరైన సదుపాయాలు లేక 22 మంది వలస కార్మికులు సైకిళ్ళపై తమ ప్రయాణం సాగించారు. పది కాదు యాభై కాదు 800 కిలోమీటర్ల మేర వారి ప్రయాణం సాగుతోంది. తమకు సైకిల్ తప్ప వేరే దారిలేదని, అందుకే ఇలా తమ ఊరికి బయలుదేరామని వలస కార్మికులు చెబుతున్నారు. 

 

 

 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   2 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle