newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

వలస కూలీలకి కేంద్రం ఊరట.. స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి

29-04-202029-04-2020 18:49:40 IST
2020-04-29T13:19:40.456Z29-04-2020 2020-04-29T13:19:09.133Z - - 11-08-2020

వలస కూలీలకి కేంద్రం ఊరట.. స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి ఎక్కువయింది. ఇవాళ కేసుల సంఖ్య 31,332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1007 మంది మృతిచెందారు.. గత 24 గంటల్లో 1,897 కొత్త కేసులు, 73 మంది మృతిచెందారు. ఇదిలా వుంటే.. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మే 3 తర్వాత ఎక్కడైతే రెడ్లు జోన్లు, కంటోన్మెంట్ లు ఉంటాయో ఆ ప్రాంతాలలో  లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన అన్ని రాష్ట్రాలూ కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయన్నారు.

కేంద్రం కూడా అలాగే భావిస్తున్నదని పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదురౌతున్నప్పటికీ, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలన్నా, దేశాన్ని రక్షించుకోవాలన్నా లాక్ డౌన్ తప్పదని అన్నారు. ఈ విషయంలో ప్రజలు అర్ధం చేసుకుని అందిస్తున్న సహకారం అపూర్వమన్నారు. కరోనాపై యుద్ధంలో ప్రతి పౌరుడూ ఒక సైనికుడిగా సహకరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు

హైదరాబాద్ లో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను తమ స్వస్థలాకు వెళ్లిపోయేందుకు అనుమతివ్వాలంటూ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఐఐటిలో పని చేసే వలస కార్మికులకు నచ్చచెప్పేందుకు రంగంలోనికి దిగిన పోలీసులపై వారు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏఎస్ఐ తలకు గాయమైంది.   దీంతో సంఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. తమకు ఇచ్చే భోజనం సరిపోవడం లేదనీ, జీతాలు చెల్లించడం లేదనీ కంది ఐఐటీలో పని చేస్తున్న వలస కార్మికులు ఆరోపిస్తున్నారు. వలస కార్మికుల ఆందోళనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మరోవైపు వలస కూలీలకి కేంద్రం ఊరటనిచ్చింది. ఎవరి రాష్ట్రాలకు వాళ్ళను పంపేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి..వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్ధులు, వలస కూలీలకి ఊరట లభించింది. రెండు రాష్ట్రాల అనుమతితో స్వస్థలాలకు తరలించనున్నారు. ఇటు గుజరాత్‌లో చిక్కుకున్న 4 వేల మంది మత్స్యకారులను త్వరలోనే  రాష్ట్రానికి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 65 బస్సుల్లో వారందరినీ రాష్ట్రానికి తీసుకొస్తామన్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారందరినీ ప్రభుత్వమే సొంత గ్రామాలను తీసుకొస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, గుజరాత్‌ సీఎంలతో మాట్లాడారని, వారి అనుమతితో అందరికి రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సొంత గ్రామాలను చేర్చేందుకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని స్పష్టం చేశారు. దీని కోసం సీఎం జగన్‌ ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే గుజరాత్‌కు 54 బస్సులు బయల్దేరాయని, మరిన్ని పంపిస్తామన్నారు. రాష్ట్రానికి వస్తున్న అందరినీ క్వారంటైన్‌కు తరలించి గడువు ముగిసిన తర్వాతనే ఇళ్లకు పంపిస్తామని పేర్కొన్నారు.

 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle