newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

వర్షాల్లేక ఆదాయం వెలవెల

26-06-201926-06-2019 08:45:29 IST
2019-06-26T03:15:29.807Z26-06-2019 2019-06-26T03:14:46.297Z - - 19-10-2019

వర్షాల్లేక ఆదాయం వెలవెల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ వ్యాప్తంగా నీటి కొర‌త జ‌నాన్నే కాదు, కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదాయాన్ని కూడా త‌గ్గించేసిందట‌. ఈ మూడేళ్ల కాలంలో అత్య‌ల్ప వ‌ర్ష‌పాతం న‌మోదు అవ్వ‌డంతో ఆహార ఉత్ప‌త్తుల ఎగుమ‌తి మీద తీవ్ర ప్ర‌భావం చూపించిందట‌. ఇప్ప‌టి దాకా ప్రపంచ ఆహార ఉత్ప‌త్తుల మార్కెట్లో ప్ర‌ధాన దేశాల‌కు పోటీ ఇచ్చిన మ‌న ఎగుమ‌తి రంగం, ఈ మూడేళ్ల కాలంలో వెల‌వెల పోయింద‌ని చెబుతున్నారు కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్.

ప్ర‌పంచ‌ దేశాల‌కు బియ్యం, గోధుమ‌లు, చ‌క్కెర‌తో పాటు ప‌లు ప్యాకింగ్ ఫుడ్స్ మ‌న ద‌గ్గ‌ర నుంచి ఎగుమ‌తి అవుతుంటాయి. ముఖ్యంగా 2012 నుంచీ బియ్యం ఎగుమ‌తిలో ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌న‌దేశ‌మే మొద‌టి స్థానంలో ఉంది. ఏటా 12 మిలియ‌న్ ట‌న్నుల‌ బియ్యం మ‌న‌దేశం నుంచి ప‌ల దేశాల‌కు ఎగుమ‌తి అవుతుంటాయి.

అలాగే 4 మిలియ‌న్ ట‌న్నుల నెంబ‌ర్ వ‌న్ క్వాలిటీ బాసుమ‌తి రైస్ కూడా ఎగుమ‌తి అవుతుంది. అయితే ఈ మూడేళ్ల‌ కాలంలో నీటి కొర‌త ఏర్ప‌డ‌టంతో ఎగుమ‌తుల మీద తీవ్ర ప్ర‌భావం చూపించింద‌ట‌. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం కిలో వ‌రి పంట పండాలంటే దాదాపు 5000 లీట‌ర్ల నీరు కావాలి. కానీ అత్య‌ల్ప వ‌ర్ష‌పాతం న‌మోదు అవ్వ‌డం, భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోవ‌డంతో బావులు, బోర్లు ఎండిపోయాయ‌ట‌. 

ఇక జ‌లాశ‌యాల్లో నిల్వ చేసిన నీరు ప్ర‌జ‌ల నిత్యావ‌స‌రాల‌కే చాలటం లేదు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో పంట‌లు స‌రిగ్గా పండ‌లేదు. ఇక ఈ ఏడాది అయితే పడాల్సిన వ‌ర్ష‌పాతం కంటే 38 శాతం త‌క్కువ‌గా వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. ఎందుకంటే జూన్ మొద‌టి నుంచే కుర‌వాల్సిన వాన‌లు, నెలాఖ‌ర‌కు కూడా ప‌డ‌టం లేదు. దీంతో ఈ ఏడాది కూడా ఆహార ఉత్ప‌త్తుల ఎగుమ‌తి చాలా త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంది. 

మ‌రో విష‌యం ఏంటంటే, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే ముందు ముందు గ‌డ్డు రోజులు ఎదుర్కోవాల్సి రావ‌డం ఖాయం అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. అంతేకాదు, 2030 నాటికి జ‌ల‌వ‌న‌రులు దారుణంగా త‌గ్గే అవ‌కాశం ఉంద‌నీ, ప్ర‌స్తుతం తాగు, సాగు అవ‌స‌రాల‌కు రెండింత‌లు కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తూ గ‌తేడాది నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చింది. అందుకే ఇప్ప‌టి నుంచైనా నీటి వ‌న‌రుల‌ను కాపాడుకోవాల‌నీ, చెట్ల‌ను మ‌రింత‌గా పెంచాల‌ని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle