newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

వందల రెట్లు పెరిగిన శానిటైజర్ల వినియోగం

26-04-202026-04-2020 18:21:26 IST
Updated On 26-04-2020 18:44:01 ISTUpdated On 26-04-20202020-04-26T12:51:26.173Z26-04-2020 2020-04-26T12:51:04.943Z - 2020-04-26T13:14:01.399Z - 26-04-2020

వందల రెట్లు పెరిగిన శానిటైజర్ల వినియోగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు బాగా వినియోగిస్తున్నారు.  వినియోగదార్ల డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు హ్యాండ్‌ శానిటైజర్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచుతున్నట్లు యూనిలివర్‌ సంస్థ ప్రకటిం చింది. కోవిడ్‌ 19 వ్యాప్తి దృష్ట్యా తమ శానిటైజర్‌ ఉత్పాదక సామర్ద్యాన్ని పెంచుకుంటున్నట్లు గతనెలలోనే హిమాలయ డ్రగ్‌కంపెనీ తెలిపింది. కరోనా భయం ఆవహించడంతో భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హ్యాండ్‌ శానిటైజర్ల విక్రయం అనూహ్యంగా పెరిగిన సంగతి తెలిసిందే.  

2019డిసెంబర్‌తో పోలిస్తే 2020 ఏప్రిల్‌ తొలివారానికి శానిటైజర్ల విక్రయాలు 17వందల శాతం అధికంగా జరిగాయి. సూపర్‌మార్కెట్‌లు, ఔషద దుకాణాల్లోని శానిటైజర్లన్నీ ఖాళీ అయ్యాయి. అమెజాన్‌, ప్లిప్‌కార్డ్‌ వంటి ఆన్‌లైన్‌, ఈకామర్స్‌ సంస్థల వద్ద కూడా శానిటైజర్లు స్టాక్‌ లేదు. డిమాండ్‌ పెరగడంతో ఒక్కసారిగా శానిటైజర్ల ధరలు రెట్టిం పయ్యాయి. అయితే ఈ హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం దీర్ఘకా లంలో సరికాదంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇది మనిషి శరీరానికి పలురకాల కీడు చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల క్రిములన్నీ చనిపోతాయన్న ధృవీకరణ ఇంతవరకు పూర్తిగాలేదు.

రోగ నిరోధక శక్తిని పెంచే కొన్ని రకాల బ్యాక్టీరియా మాత్రం శానిటైజర్ల వినియోగం వల్ల చనిపోయే ప్రమాదముందని వీరు స్పష్టం చేస్తున్నారు. కరోనా భయం రానున్న కాలంలో కూడా కొనసాగనుంది. దీన్ని ఆసరాగా చేసుకుని 2027నాటికి హ్యాండ్‌ శానిటైజర్‌ మార్కెట్‌ విలువను 2.14బిలియన్లకు పెంచుకోవాలని ఉత్పత్తిదార్లు పథకాలు సిద్దం చేశారు. ఇందుకనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. హ్యాండ్‌ శానిటైజర్‌ ఆల్కాహాల్‌ ఆధారిత, లేదా ఆల్కాహాల్‌ లేని ద్రవం. ఇది వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడ్డానికి వినియోగిస్తారు. కరోనా నేపధ్యంలో చేతుల్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచించారు. మీడియాలోనూ, అన్ని ప్రసార మాధ్యమాలలోనూ హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించాలని కోరుతుండడంతో వీటి ఆర్డర్లు పెరిగిపోతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయ్ కావడదం లేదని కంపెనీలే చెబుతున్నాయి. 

చేతులను శుభ్రం చేసుకోవడానికి సబ్బును, నీటిని వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఈ రెండు అందుబాటులో లేని సమయంలో హ్యాండ్‌ శానిటైజర్లు ఉపయోంచాలని సూచిస్తున్నారు. కానీ జనంలో భయం వల్ల సబ్బు, నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా హ్యాండ్‌ శానిటైజర్‌ వినియోగం అనూహ్యంగా పెరిగింది. ప్రజలంతా దీనివైపే మొగ్గుచూపుతున్నారు.

చేతుల్ని క్రిముల్ని సంహరించేందుకు పాఠశాలలు, ఆసుపత్రులు, సూపర్‌మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో హ్యాండ్‌ శానిటైజర్లను వినియోగిస్తున్నారు. ఆల్కాహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్స్‌ చేతిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌లను చంపడంలో మెరుగైన ఫలితాల్నిస్తుందని సంతృప్తి చెందుతున్నారు. అయితే 60నుంచి 95శాతం ఆల్కాహాల్‌ మిశ్రమం కలిగిన శానిటైజర్లు మాత్రమే ఈ విషయంలో తమ పనితనాన్ని చూపగలుగుతున్నాయి. శానిటైజర్లతో పాటు హ్యాండ్ కర్ఛీఫ్ లు, మాస్కుల వినియోగం పెరిగింది. 

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   3 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   5 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   7 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   7 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   8 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle