newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

28-05-202028-05-2020 08:55:16 IST
Updated On 28-05-2020 09:33:16 ISTUpdated On 28-05-20202020-05-28T03:25:16.651Z28-05-2020 2020-05-28T03:23:44.818Z - 2020-05-28T04:03:16.441Z - 28-05-2020

లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో  రోజు రోజుకూ పాజిటివ్ కేసుల రికార్డు స్థాయిలో నిర్ధారణ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 158,086కి చేరింది. దేశంలో వైరస్ మొదలైన తర్వాత తొలి 70 రోజుల్లో 50 వేల కేసులు నమోదుకాగా.. ఈ సంఖ్య లక్షకు చేరడానికి మరో 39 రోజులు పట్టింది. అయితే, ప్రస్తుతం కేవలం 9 రోజుల్లో ఈ సంఖ్య లక్షన్నర దాటేసింది. మరో 10 రోజుల్లో రెండులక్షలు దాటేస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తోంది. ఇప్పటికే నాలుగు విడతల లాక్ డౌన్ అమలవుతూనే వుంది. మరో మూడురోజుల్లో లాక్ డౌన్ పూర్తికానుంది. లాక్‌డౌన్‌ 5.0 ఉంటుందనే సమాచారం ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. జూన్ 1 నుంచి 14 వరకూ ఐదవ విడత లాక్ డౌన్ ఉంటుందని తెలుస్తోంది. మే 31 తర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్‌లో 70శాతం పైగా కేసులు నమోదైన 11 ప్రధాన నగరాల పైనే ఫోకస్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది.

ఈసారి లాక్ డౌన్లో మరిన్ని సడలింపులు వుండనున్నాయి.మరోవైపు లాక్‌డౌన్‌లో దేవాలయాలు,, ఇతర ప్రార్థన స్థలాలను పునః ప్రారంభించేందుకు అనుమతించే అవకాశముంది. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ దేవాలయాలకు వెళ్లేందుకు అనుమతించవచ్చు. సామూహిక ప్రార్థనలు, మత పరసామూహిక కార్యక్రమాలను అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. సినిమాహాళ్లు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్, ప్రజలు భారీగా గుమికూడే అవకాశమున్న ఇతర ప్రాంతాల మూసివేత ఐదో దశ లాక్‌డౌన్‌లోనూ కొనసాగనుందని తెలుస్తోంది.

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ సాధించిన ఫలితాలపై  సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లాక్ డౌన్ విఫలం అయిందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 31వ తేదీన మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మరికొన్ని సడలింపులు ప్రకటిస్తూనే లాక్‌డౌన్‌ 5.0ను ప్రధాని ప్రకటించవచ్చని అంటున్నారు. 

జూన్‌ 1 నుంచి మొదలయ్యే లాక్‌డౌన్‌ 5.0 లో ముఖ్యంగా  ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణే, థానే, జైపూర్, సూరత్, ఇండోర్‌లో కఠిన ఆంక్షలు అమలుచేయనున్నారు. ఈ నగరాల్లో కరోనా కట్టడిపై ఫోకస్‌ చేయనుంది. ఇక దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కరోనా కేసుల్లో అహ్మదాబాద్‌, ఢిల్లీ, పుణే, కోల్‌కతా, ముంబై నగరాల్లోనే 60 శాతం కేసులు నమోదవడంతో ఈ నగరాల్లో మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం కేసులు నమోదవుతున్న 30 మున్సిపల్‌ కార్పొరేషన్‌లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. 

జూన్‌ 1 నుంచి అన్ని ప్రార్ధనా స్ధలాలను తెరిచేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ముఖ్యమంత్రి యడియూరప్ప కేంద్రానికి లేఖ రాశారు.  లాక్‌డౌన్‌ 4.0లో సెలూన్లకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా జిమ్‌లను తెరిచేందుకు అనుమతించనుంది. కంటెయిన్మెంట్‌ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో జిమ్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో జిమ్‌లను అనుమతిస్తారు.  

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

   2 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   14 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle