newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

లాక్ డౌన్ పొడిగిస్తారా.. తొలగిస్తారా? ఇప్పుడంతా ఇదే చర్చ!

05-04-202005-04-2020 20:01:58 IST
Updated On 05-04-2020 22:22:04 ISTUpdated On 05-04-20202020-04-05T14:31:58.278Z05-04-2020 2020-04-05T14:31:55.210Z - 2020-04-05T16:52:04.542Z - 05-04-2020

లాక్ డౌన్ పొడిగిస్తారా.. తొలగిస్తారా? ఇప్పుడంతా ఇదే చర్చ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సరిగ్గా ఇంకో పది రోజులు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ గడువు పూర్తవుతుంది. మరి ఈనెల 15 నుండి యధావిధిగా అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయా? ఎప్పటిలాగా సమాజం మొత్తం ఫ్రీ బర్డ్స్ మాదిరి చక్కర్లు కొడతారా? ఆఫీసులు, సినిమాలు, షికార్లు, షాపింగులు చేసుకోవచ్చా? ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది.

దేశ జనాభాలో అత్యంత బాధ్యత కలిగిన కొందరు కరోనా ఏంటి.. మన దేశ పరిస్థితి ఏంటి.. ఆర్ధికంగా ఎంత నష్టపోయాం.. ఎంత వెనుక పడ్డాం.. మళ్ళీ కోలుకునే మార్గాలేంటి? అని ఆలోచిస్తుంటే.. కొందరు మాత్రం రెండు వారాలుగా ఇంట్లోనే తిని కూర్చొని విసుగొచ్చేసింది? ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన ఫ్రెండ్స్ తో చిట్ చాట్ లేక బోర్ కొడుతోంది? ఏప్రిల్ 15 లాక్ డౌన్ ఎత్తేయగానే ఏమేం చేయాలో అని షెడ్యూల్స్ వేసుకుంటున్నారు.

అయితే అసలు ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ తొలగిస్తారా? అంటే అవునంటూనే షరతులు వర్తించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్న మాట. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ ఏప్రిల్ 15 నుండి అడ్వాన్స్డ్ బుకింగ్స్ తెరిచింది. మరోవైపు మరికొన్ని ప్రైవేట్ విమాన సంస్థలు కూడా బుకింగ్స్ తెరిచాయి. ఎయిర్ ఇండియా మాత్రం ఈనెల 30 వరకు బుకింగ్స్ తీసుకోవడం లేదు.

ప్రస్తుతానికి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఆంక్షల మధ్య లాక్ డౌన్ తొలగించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన రైల్వే సర్వీసులతో పాటు గూడ్స్ యధావిధిగా నడిపించనున్నారంటున్నారు. ఇక బస్సు సర్వీసులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు నెలాఖరు వరకు అనుమతులు ఇచ్చే అవకాశమే లేదంటున్నారు.

ప్రస్తుతమున్న నిత్యావసరాల దుకాణాలతో పాటు కొన్ని మరికొన్ని వ్యాపార సముదాయాలకు నిర్ణిత సమయం నిబంధనతో అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మూసివేసిన వాటిలో అప్పుడు మరికొన్ని తెరుచుకొని అవకాశం ఉంది. అయితే, విందులు వినోదాలకు మాత్రం ఈనెలాఖరు వరకు అనుమతులు ఇచ్చే అవకాశమే లేదంటున్నారు.

ఇక ఇప్పటికే పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ జరుగుతున్న క్రమంలో 10,12 సంవత్సరాల లోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులను ఇళ్ల నుండి బయటకి రావద్దని నిబంధన విధించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. బార్లు, రెస్టారెంట్లకు కూడా ఏప్రిల్ 15న అనుమతులు దక్కడం కష్టమేనని అయితే వైన్ షాప్స్ తెరుచుకోనున్నాయని చెప్తున్నారు.

ఒకవిధంగా చెప్పాలంటే ఈనెల 14 తర్వాత లాక్ డౌన్ పూర్తిగా తొలగిస్తే ప్రజలు కరోనా ఎదుర్కొని విజయం సాధించామన్న ధైర్యంతో ఒక్కసారిగా ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చే ప్రమాదం ఉందని.. అందుకే పాక్షికంగా క్రమక్రమంగా లాక్ డౌన్ తొలగిస్తూ ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే అప్పటికి పాజిటివ్ సంఖ్య తీవ్రంగా పెరుగుతూ ఆందోళనకరంగా ఉంటే మాత్రం మరింత కఠినంగా పొడగించినా ఆశ్చర్యం లేదంటున్నారు.

 

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle