newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

లాక్ డౌన్ పై మోడీ కీలక ప్రకటన...మే 3 వరకూ పొడిగింపు

14-04-202014-04-2020 10:21:33 IST
Updated On 14-04-2020 13:07:57 ISTUpdated On 14-04-20202020-04-14T04:51:33.144Z14-04-2020 2020-04-14T04:50:36.548Z - 2020-04-14T07:37:57.786Z - 14-04-2020

లాక్ డౌన్ పై మోడీ కీలక ప్రకటన...మే 3 వరకూ పొడిగింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ పై మోడీ కీలక ప్రసంగం చేశారు. ఇవాళితో ముగిసిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసింది. లాక్ డౌన్ ను మే 3వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్ కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈనేపథ్యంలో మోడీ ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా భావించినట్టుగానే మోడీ లాక్ డౌన్ పొడిగించారు.అయితే ఈనెల 20 నుంచి లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేయాలని భావిస్తున్నారు. 

21 రోజుల పాటు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసినా... క్రమంగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి... లాక్‌డౌన్ 21 రోజులు గడిచేలోపే... కరోనా పాజిటివ్ కేసులు 10వేల మార్క్‌ను దాటేసింది.. దీంతో లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగించాల్సిందేనని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. దీంతో అన్ని వర్గాలను సంప్రదించాక మోడీ ఈ నిర్ణయం ప్రకటించారు. లాక్ డౌన్2.O మరో 19 రోజుల పాటు పొడిగించారు. 

అంబేద్కర్ జయంతి సందర్భంగా మోడీ ఆయన ఆశయాలను గుర్తుచేశారు. భారత ప్రజలమైన మేము అన్న స్ఫూర్తిని చాటారన్నారు. దేశాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడం కోసం జాతి ఐక్యతను చాటాలన్నారు. దేశంలో వివిధ పండుగలను నిరాడంబరంగా జరుపుకోవాలన్నారు. దేశంలో 500 కేసులు వున్నప్పుడు లాక్ డౌన్ అమలు నిర్ణయం తీసుకున్నామని, మిగతా దేశాలతో పోలిస్తే లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందన్నారు. ఇతర దేశాల కంటే మనం మెరుగ్గానే వున్నామన్నారు మోడీ. అన్ని ప్రయత్నాలు చేసినా కరోనా ప్రపంచానికి పెద్ద సవాల్ గా మారిందన్నారు. ప్రజల కష్టాన్ని తగ్గించాలనే తాను చూస్తున్నానన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు. లాక్ డౌన్ విషయంలో ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలన్నారు. 

సమస్య తలెత్తగానే, త్వరగా నిర్ణయం తీసుకుని దాన్ని అరికట్టే ప్రయత్నం చేశాం.ఈ సమస్య విషయంలో ఏ దేశంతోనూ మనం పోల్చుకోవడం సరికాదు. కానీ, ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో పోల్చుకుని చూసుకుంటే, భారత్ ఇప్పుడు చాలా మెరుగైన స్థితిలో ఉంది. నెలన్నర కిందట కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చాలా దేశాలు భారత్‌తో సమానంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాల్లో మన కన్నా 25 రెట్లు ఎక్కువగా కేసులు పెరిగాయి.

భారత్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేం.కొన్ని రోజులుగా జరుగుతున్నది చూస్తే, మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని అర్థం అవుతుంది.సామాజిక దూరం పాటించడం, లౌక్‌డౌన్ వల్ల దేశానికి చాలా లాభం జరిగింది.ఆర్థికపరంగా చూసుకుంటే దీని వల్ల మనకు బాగా నష్టం జరిగిందనిపించవచ్చు. కానీ, దేశ పౌరుల ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదు.మనం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు ప్రపంచవ్యాప్తంగా నిపుణులను, ప్రభుత్వాలను భయపెడుతోంది.కరోనావైరస్‌పై పోరాటం మనం ఎలా కొనసాగించాలి? నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రజల ఇబ్బందులను ఎలా తక్కువ చేసుకోవాలి? ఈ విషయాలన్నింటిపై రాష్ట్రాలతో చర్చించాం.

లాక్‌డౌన్ పొడిగించాలని చాలా రాష్ట్రాలు కోరాయి. కొన్ని ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం.కొంత ప్రాంతాల్లో మనం ఇక కరోనావైరస్ వ్యాపించనీయకూడదు.మనం ముందుకున్నా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి.హాట్‌స్పాట్లుగా మారే అవకాశమున్న ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టాలి. కొత్త హాట్‌స్పాట్లతో మనకు మరిన్ని ఇబ్బందులు వస్తాయి.

ఏప్రిల్ 20 వరకూ అన్ని చోట్లా కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసుకోవాలి.హాట్‌స్పాట్లు పెరగకుండా ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తాం. రేపు ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా పేదలకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.రబీ కోతలు జరిగే సమయం ఇది. వారికి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలతో కలిసి అందరం ప్రయత్నిస్తున్నాం.మన దగ్గర ఆహారం, ఔషధాల నిల్వలు మెండుగా ఉన్నాయి.భారత్‌లో లక్ష పడకలకు ఏర్పాట్లు చేశాం. కోవిడ్-19 చికిత్స కోసం ఉన్న ఆసుపత్రులే 6 వేలకుపైగా ఉన్నాయి.మనం ధైర్యంగా, నిబంధనలను పాటిస్తూ పోతే కరోనావైరస్‌ను ఓడించి తీరుతాం.మీకు ఏడు విషయాలు చెబుతున్నా.ఇళ్లలో ఉండే వృద్ధులు, ఇదివరకే ఆరోగ్య సమస్యలున్నవారి గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలిలాక్‌డౌన్, సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులను తప్పకుండా వాడండి అన్నారు మోడీ. 

మోడీ ఏడు సూత్రాలు

మోడీ తన ప్రసంగంలో ఏడు సూత్రాలను అమలుచేయాలన్నారు

* సీనియర్ సిటిజన్లకు సాయం చేయడం

*కరోనాపై ముందుండి పోరాడుతున్న సిబ్బందిని గౌరవించాలి.

*లాక్ డౌన్ నిబంధనలు పాటించడం

*వివిధ నిబంధనల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం

*నిరుపేదలకు సాయం చేయడం

*సంస్థలు ఉద్యోగులను తొలగించకూడదు

*ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం 

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   3 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   19 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   20 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle