newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

లాక్ డౌన్ నుంచి ఆరంగాలకు రిలీఫ్

10-04-202010-04-2020 10:05:07 IST
Updated On 10-04-2020 10:41:25 ISTUpdated On 10-04-20202020-04-10T04:35:07.036Z10-04-2020 2020-04-10T04:35:01.978Z - 2020-04-10T05:11:25.148Z - 10-04-2020

లాక్ డౌన్ నుంచి ఆరంగాలకు రిలీఫ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశం మొత్తం లాక్ డౌన్లో వుంది. అన్ని రంగాలు కుదలేయ్యాయి. ఉద్యోగులు ఇళ్ళకే పరిమితమయి వర్క్ ఫ్రం హోంలోనే వున్నారు. ఈ నెల 14 తో లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో మెజారిటతీ రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతున్నాయి. దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగింపు తప్పనిసరైతే కొన్ని రంగాలకు వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించినట్లు తెలుస్తోంది. 

దేశానికి అవసరమయిన ఆహారాన్ని అందించే వ్యవసాయ రంగానికి మరింత వెసులుబాటు కల్పించడానికి కేంద్రం సుముఖంగా వుంది. ఉదయం 6నుంచి సాయంత్రం 6వరకు పనులు చేసుకునేందుకు అనుమతులు జారీ చేయాలన్న ఆలోచన సాగుతోంది. లాక్‌డౌన్‌ నుంచి వ్యవసాయరంగాన్ని మినహాయించాల్సిన అవసరాన్ని ఇప్పటికే పలువురు నిపుణులు కేంద్రం దృష్టికి తెచ్చారు. ఆర్ధిక పరిస్థితులు దిగజారినప్పటికీ తిరిగి సరిదిద్దుకునే అవకాశాలుంటాయి. కానీ వ్యవసాయ ఉత్పత్తులు పడిపోతే దేశం తీవ్ర ఆహార కొరతనెదుర్కొనే ప్రమాదముంటుంది. అప్పటికప్పుడు ఆహార దినుసుల్ని తయారు చేసుకునే వీలుండదు. కనీసం మూడు నుంచి నాలుగు నెలల పాటు సాగు నిర్వహిస్తే తప్ప చేతికి గింజలు రావు. అప్పటికప్పుడు దేశాన్ని ఆహార కొరతనుంచి కాపాడగడలగడం అసాధ్యం. 

ఇప్పటికే రబీ సీజన్‌పై లాక్‌డౌన్‌ ప్రభావం బాగా కనిపిస్తోంది. దీనికి తోడు పండ్ల తోటలు, కూరగాయల సాగుపై బాగా పడింది. పండిన పంటను అలాగే వివిధ యంత్రపరికరాలను ఓ చోటి నుంచి మరో చోటికి తరలించే అవకాశం లేకుండా పోయింది. రైతుల ఉత్పత్తుల కొనుగోలు ఇంకా మొదలుకాలేదు. ఇక వారి చేతికి సొమ్ములెప్పుడొచ్చేది అర్ధంకాని పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో 84రోజులకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి.

కొత్త ధాన్యం, గోధుమ మార్కెట్‌కొచ్చేసరికి మరో రెండుమాసాలు పడుతుంది. లాక్‌డౌన్‌ కొనసాగిస్తే ఖరీఫ్‌ నాట్లు జాప్యమౌతాయి. దీంతో మూడు మాసాల అనంతరం నిత్యావసరాల లభ్యత తగ్గిపోతుంది. ఇది మార్కెట్‌లో డిమాండ్‌ పెంచుతుంది. ధరలు ఆకాశాన్నంటుతాయి. ఉన్నత వర్గాలు మాత్రమే ఆహారాన్ని కొనుగోలు చేయగలుగుతాయి. పేద, మధ్య తరగతికి ప్రభుత్వం సరఫరా చేయాలన్నా ఖరీఫ్‌ దిగుబడి చేతికొచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ పరిస్థితిని కేంద్రం కూడా గుర్తించింది.

లాక్‌డౌన్‌ ఎత్తివేతపై కేంద్రం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు ముఖ్యమంత్రుల మరోసారి మోడీ మాట్లాడేక ఒక నిర్ణయానికి రావచ్చు అంటున్నారు. కానీ కొనసాగించాల్సొస్తే మాత్రం వ్యవసాయాన్ని లాక్‌డౌన్‌ ప్రక్రియ నుంచి మినహాయించాలన్న నిపుణుల సూచనలకు తలొగ్గే అవకాశాలు స్పష్టమౌతున్నాయి. అలాగే లాక్‌డౌన్‌ ఉపసంహరించినప్పటికీ ఆగస్టు వరకు రైళ్ళు, బస్సులు, విమానాల రవాణాను నిలిపేయాలని కూడా నిపుణులు సూచించారు.

ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వీటిలో ప్రయాణాలు సాగుతాయి. ఏ ఒక్కరికి కోవిడ్‌ 19 వ్యాధి లక్షణాలున్నా వారినుంచి ఒకేసారి పెద్దసంఖ్యలో వ్యాధి సంక్రమించే ప్రమాదముంది. అలాగే పాఠశాలల్ని కూడా ఆగస్టు వరకు తెరవకూడదని ప్రతిపాదించారు. అయితే లాక్‌డౌన్‌తో సంబంధంలేకుండా వ్యవసాయంతో పాటు పరిశ్రమల్ని కూడా తెరవాలని తద్వారా ఉత్పత్తికి ఎలాంటి విఘాతం లేకుండా చూడాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. 

దేశంలోనే ఈ వ్యాధి అధికంగా గల మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయ్‌, పూనె వంటి అతిపెద్ద నగరాల్లో లాక్‌డౌన్‌ మరింత పటిష్టంగా అమలు చేస్తూనే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో దీన్ని అంచెల వారీగా ఉపసంహరించొచ్చని కేంద్రానికి సూచించింది. దేశంలో ఒక్కో చోట ఒక్కో అభిప్రాయం వెల్లడవుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తివేతకు సంబంధించి దేశంలోని ముఖ్యమంత్రులందరితో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లోని అన్ని పక్షాల నాయకుల్తోనూ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరోసారి ముఖ్యమంత్రుల్తో మాట్లాడేందుకు సంసిద్దులౌతున్నారు.

కేవలం కోవిడ్‌ 19 టాస్క్‌ఫోర్స్‌గా నియమించిన మంత్రుల కమిటీ సిఫార్సులు, సూచనలకు మాత్రమే ఆయన పరిమితం కావడంలేదు. దేశంలో క్షేత్రస్థాయి నుంచి ప్రజల అభిప్రాయాల్ని సమీకరించి నిర్ణయం తీసుకునేందుకు సంసిద్దులౌతున్నారు. మరోసారి సీఎంలతో మాట్లాడిన అనంతరం మోడీ కీలక నిర్ణయం వెలువరించే అవకాశం కనిపిస్తోంది. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   10 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   13 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle