newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

లాక్ డౌన్ తొలగింపు.. కొనసాగింపు, ఓ బోస్టన్ రిపోర్ట్ కథ!

08-04-202008-04-2020 14:05:40 IST
Updated On 08-04-2020 14:13:11 ISTUpdated On 08-04-20202020-04-08T08:35:40.740Z08-04-2020 2020-04-08T08:35:37.511Z - 2020-04-08T08:43:11.542Z - 08-04-2020

లాక్ డౌన్ తొలగింపు.. కొనసాగింపు, ఓ బోస్టన్ రిపోర్ట్ కథ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత దేశంలో జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగించాలి. ఆ తరువాత కూడా పాక్షికంగానే లాక్ డౌన్ తొలగించి సెప్టెంబర్ వరకు కొనసాగించాలని.. లేకపోతే ఇండియాలో కరోనా పరిస్థితులు అదుపులోకి రావని బోస్టన్ కమిటీ గ్రూప్ (బీసీజీ) పేరిట ఓ రిపోర్ట్ ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో ఈ రిపోర్ట్ అంశాన్ని కూడా ప్రస్తావించి తాను కూడా ఈ రిపోర్ట్ ప్రకారం లాక్ డౌన్ కొనసాగింపుకే జై అనేశారు.

ఆ తరవాత ఈ బోస్టన్ రిపోర్ట్ ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొట్టేసింది. ఏమనుకున్నారో ఏమోకానీ ఆ రిపోర్ట్ ఫేక్ అంటూ బోస్టన్ గ్రూప్ ప్రకటించేసింది. దేశంలోని మీడియా సంస్థలకు ఆ విషయాన్ని ప్రస్తావించిన బోస్టన్ సంస్థ తాము అసలు ఎలాంటి రిపోర్ట్ చేయలేదని కూడా తేల్చి చెప్పింది. మరి బోస్టన్ పేరిట అధికారిక సీల్ తో సహా విడుదలైన రిపోర్ట్ ఎవరిది?.

సాక్షాత్తు ముఖ్యమంత్రులే ఆ నివేదికను ఆధారం చేసుకొని మాట్లాడారు. ఒకరోజు గడిచిన తర్వాత అది ఫేక్ అంటూ ప్రకటించడం ఏంటి? నిజంగా ఫేక్ అయితే తమ సంస్థ సీల్/స్టాంప్ ఉపయోగించిన వారిపై కేసులు పెట్టరా? రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఆధారం చేసుకున్న ఆ ఫేక్ రిపోర్టుపై చర్యలు ఉండవా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అన్నట్లు ఏపీలో మూడు రాజధానులు ఉండాలని సూచించి.. దానికి గాను ఏడుకోట్ల రూపాయాలను ఫీజుగా తీసుకున్న సంస్థే ఈ బోస్టన్ గ్రూప్. ఇప్పుడు తాజాగా ఇలా మరోసారి వార్తలలోకి ఎక్కింది. ఈ సంస్థపై మూడు రాజధానుల అంశంలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎలాంటి స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండానే రిపోర్ట్ తయారుచేసిందని విశ్లేషకులు విమర్శలు చేశారు.

కేవలం గతంలో రాజధానిపై చేసిన నివేదికల ఆధారంగా ఇప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చారని.. దాని కోసం ఏడుకోట్ల ప్రజాధనం ఫీజుగా ఆర్జించారని తేల్చారు. కాగా ఇప్పుడు కూడా లాక్ డౌన్ కొనసాగింపు అనే ఒక నివేదికలో కూడా రెండు అనుమానాలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ కొనసాగించాలని సూచించేలా బోస్టన్ సంస్థ రిపోర్ట్ తయారుచేసి ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ తీసుకుందని భావిస్తున్నారు.

ఇదంతా ఓ వ్యూహం ప్రకారమే రిపోర్ట్ విడుదల చేసిన బోస్టన్ గ్రూప్ అనంతర దేశవ్యాప్తంగా ఇదే చర్చ కావడంతో వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ నివేదిక తప్పని చెప్తున్న బీసీజీ తాము నివేదిక తయారు చేయలేదని మాత్రం గట్టిగా చెప్పలేకపోతుంది. పైగా విడుదలైన రిపోర్టులో తమ సంస్థ అధికారిక ముద్ర కూడా గట్టిగా వేసుకుంది. మరి అమరావతి అంటే ఒక రాష్ట్ర సమస్య.. ఇది దేశ సమస్య. ఇక్కడ కూడా పరాచకాలైతే ఎలా!

 

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   2 hours ago


పెద్దల సభలో రచ్చ.. సభ్యుల సస్పెన్షన్..!

పెద్దల సభలో రచ్చ.. సభ్యుల సస్పెన్షన్..!

   10 hours ago


దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

   20-09-2020


పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

   20-09-2020


పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

   20-09-2020


చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

   20-09-2020


ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

   20-09-2020


పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

   19-09-2020


ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

   19-09-2020


అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

   19-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle