newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

లాక్ డౌన్ కొనసాగింపేనా? మరో ఆర్థిక ప్యాకేజీ రాబోతోందా?

07-04-202007-04-2020 09:47:30 IST
Updated On 07-04-2020 10:17:22 ISTUpdated On 07-04-20202020-04-07T04:17:30.214Z07-04-2020 2020-04-07T04:17:18.813Z - 2020-04-07T04:47:22.003Z - 07-04-2020

లాక్ డౌన్ కొనసాగింపేనా? మరో ఆర్థిక ప్యాకేజీ రాబోతోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి చేయి దాటి పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి ఎలా వుంటుందోనని ఆందోళనకు గురవుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీయార్ లాక్ డౌన్ పొడిగించాలని, ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో అదే శరణ్యం అని మోడీకి తెలియచేస్తానంటున్నారు.

ఏప్రిల్ 14 తర్వాత ఇంకా కొనసాగుతుందా అంటే ప్రధాని మోడీ మాటలను బట్టి అలానే అనిపిస్తోంది. కరోనా కట్టడి చేయాలనే వ్యూహంలో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించారు. ఈ నెల 14తో లాక్‌డౌన్ ముగుస్తందని దేశప్రజలందరూ భావిస్తుండగా.. ప్రధాని నరేంద్ర మోడీ మాటలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారిపై ఇండియా సాగిస్తున్న పోరాటానికి సుదీర్ఘ సమయం పట్టొచ్చని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.

దీంతో లాక్ డౌన్ పై మోడీ కీలక నిర్ణయం వెలువరించనున్నట్టు తెలుస్తోంది. కరోనాపై దేశప్రజలకు మోడీ మరోసారి సందేశం ఇవ్వనున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ కార్యకర్తలు పేదలకు ఆహారం అందించేందుకు ఉపవాసం ఉండాలన్నారు. అదే తరహాలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలందరి .జీతాలలో 30 శాతం కోత ఏడాదిపాటు అమలయ్యేలా ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు 30 శాతం జీతాలు స్వచ్ఛందంగా తగ్గించుకునేందుకు అంగీకారం తెలిపారు. 2020-22 వరకూ ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపులు, విడుదల నిలుపుదల చేశారు. ఈ నిధులన్నీ భారత కన్సాలిడేటెడ్ ఫండ్ కు జమ అవుతాయి. వీటిని కోవిడ్ 19 వైరస్ పై పోరాటానికి ఖర్చుచేయాలని కేబినెట్ నిర్ణయించింది.

కరోనాపై పోరులో అలసిపోవద్దని, ఓటమిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వైరస్ భూతంపై పోరులో దేశం జయభేరి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనాపై భారత్ చేస్తున్న యుద్ధం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆయన మాటలను బట్టి లాక్‌డౌన్ పొడిగింపు ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇటు కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. 

ఇటీవల ప్రకటించిన రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. పలు రంగాలకు మరో రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. గతంలో కేంద్రం పేదలకు ఆహారం అందించేందుకు పథకం అమలు చేస్తోంది. గతంలో ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం ఈ సారి ప్యాకేజీలో కరోనా వైరస్ వల్ల దెబ్బతిన రంగాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హాస్పిటాలిటీ, పౌర విమానయానం వంటి రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వొచ్చంటున్నారు.. ఆయా రంగాలకు ఉద్దీపన ప్యాకేజీ అందించవచ్చని తెలుస్తోంది.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   6 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle